“రాత్ ” మూవీ తో సినిమాటోగ్రాఫర్ గా కెరీర్ ప్రారంభించిన తేజ పలు సూపర్ హిట్ హిందీ , తెలుగు మూవీస్ కు సినిమాటోగ్రాఫర్ గా పనిచేశారు. సూపర్ హిట్ “చిత్రం “మూవీ తో తేజ టాలీవుడ్ కు దర్శకుడిగా పరిచయం అయ్యారు. “ఏ దిల్ “మూవీ తో తేజ బాలీవుడ్ కు దర్శకుడిగా పరిచయం అయ్యారు. పలు సూపర్ హిట్ తెలుగు మూవీస్ కు దర్హకత్వం వహించిన తేజ ప్రస్తుతం అభిరామ్ దగ్గుబాటి హీరో గా తెరకెక్కుతున్న “అహింస ” మూవీ కి దర్శకత్వం వహిస్తున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
తాజాగా దర్శకుడు తేజ రెండు ప్రాజెక్ట్స్ తో బాలీవుడ్ రీ ఎంట్రీ ఇస్తున్నారు. టైమ్ ఫిల్మ్స్, NH స్టూడియోస్ అండ్ ట్రిఫ్లిక్స్ ఫిల్మ్స్ బ్యానర్స్ పై తేజ దర్శకత్వంలో “‘జఖీమే”మూవీ ఒకటి. ఇద్దరు బాలీవుడ్ తారలు ప్రధాన పాత్రలు పోషిస్తున్న ఈ సినిమా షూటింగ్ మొత్తం కాశ్మీర్‌లోని మంచు ప్రాంతంలో జరగనుందాని సమాచారం. మరొకటి ‘తజ్కారి’ అనే వెబ్ సిరీస్. ముంబైలో జరిగిన వాస్తవ సంఘటనల ఆధారంగా 1980 బ్యాక్‌డ్రాప్‌లో నాలుగు సీజన్ల సిరీస్ గా రూపొందనుంది. ఈ రెండు ప్రాజెక్టులకు సంబంధించిన నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలను త్వరలో ప్రకటించనున్నారని సమాచారం.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:

































