పూజా హెగ్డే ‘అరబిక్ కుతు’ డ్యాన్స్ వైరల్..!

Pooja Hegde Dances for Arabic Kuthu Song at Beast Telugu Press Meet,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, Pooja Hegde,Actress Pooja Hegde,Pooja Hegde Upcoming Movie,Pooja Hegde New Movies,Pooja Hegde Beast Movie Updates,Pooja Hegde Beast Movie,Pooja Hegde Dance,Pooja Hegde Dance on Arabic Kuthu Song, Arabic Kuthu Song,Arabic Kuthu Song From Beast Movie,Pooja Hegde Dance on Arabic Kuthu Song at Beast Press Meet,Beast Press Meet,Beast Movie Updates

ప్రస్తుతం దేశంలో అత్యంత బిజీగా ఉన్న హీరోయిన్ ఎవరంటే ఆ లిస్ట్ లో బుట్టబొమ్మ పూజా హెగ్డే ముందు ఉంటుంది. ఇప్పటికే కొన్నాళ్లుగా టాలీవుడ్ లో టాప్ హీరోయిన్ గా దూసుకుపోతున్న పూజా హెగ్డే తెలుగుతో పాటు తమిళ్, అలానే బాలీవుడ్ లో కూడా పలు సినిమాలతో బిజీగా ఉంది. అల్లు అర్జున్ తో దువ్వాథ జగన్నాథం సినిమాతో మొదట సక్సెస్ ను అందుకున్న పూజాహెగ్డే ఆ తరువాత పెద్దగా వెనుతిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. వరుస హిట్లను అందుకుంటూ లక్కీ హీరోయిన్ అయింది. ఇక ఇటీవలే రాధేశ్యామ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాగా త్వరలో తను నటించిన ఆచార్య సినిమా అలానే బీస్ట్ సినిమా కూడా రిలీజ్ కాబోతున్నాయి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక వీటిలో బీస్ట్ సినిమా ఏప్రిల్ 13న రిలీజ్ కాబోతున్న నేపథ్యంలో ఈసినిమా ప్రమోషన్ కార్యక్రమాలు మొదలుపెట్టారు. అయితే ఈసినిమా తమిళ్ తో పాటు తెలుగులో కూడా రిలీజ్ అవుతుంది కాబట్టి ఇక్కడ కూడా ప్రమోషన్స్ చేస్తున్నారు. ఈనేపథ్యంలో “బీస్ట్” తెలుగు రిలీజ్ కు సంబంధించి ప్రెస్ మీట్ ను నిర్వహించారు మేకర్స్. “బీస్ట్”ను తెలుగులో విడుదల చేస్తున్న దిల్ రాజు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈసందర్భంగా ఈసినిమాలో ఎంతో పాపులర్ అయిన అరబిక్ కుతు పాటకు పూజా హెగ్డే స్టెప్పులు వేసి మరోసారి ఆకట్టుకుంది. పూజా హెగ్డే అలానే, డైరెక్టర్ నెల్సన్ దిలీప్ కుమార్, ఈసినిమాకు సంగీతం అందించిన అనిరుధ్ కూడా కలిసి స్టెప్పులేశారు. ఇక వీరిద్దరూ వేసిన క్యూట్ డ్యాన్స్ కు మరోసారి అందరూ ఫిదా అవుతున్నారు.

 

View this post on Instagram

 

A post shared by Telugu FilmNagar (@telugufilmnagar)

నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో దళపతి విజయ్ హీరోగా వస్తున్న సినిమా బీస్ట్. యాక్ష‌న్ కామెడీ థ్రిల్ల‌ర్‌గా తెర‌కెక్కుతున్న ఈసినిమాలో పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తుంది. కాాగా ఈసినిమాలో సెల్వ రాఘవన్ నెగెటివ్ రోల్ లో నటించనుండగా.. యోగిబాబు మరో కీలకపాత్రలో నటిస్తున్నాడు. ఈసినిమాను పాన్ ఇండియా లెవల్లో రిలీజ్ చేస్తున్నారు మేకర్స్. తమిళంతో పాటు తెలుగు, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో విడుదల చేయనున్నారు. ఈ మూవీని ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ స‌న్ పిక్చ‌ర్స్ వారు నిర్మిస్తున్నారు. అనిరుధ్ సంగీతాన్ని అందిస్తున్నారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

two + 3 =