ముంబై సక్సెస్ పార్టీ ప్రెస్ మీట్ లో “ఆర్ ఆర్ ఆర్”టీమ్

RRR Movie Team at Mumbai Success Party Press Meet,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, RRR Movie,RRR Telugu Movie,RRR Movie Updates,RRR Movie latest Movie Updates,RRR Team Mumbai Success Party,RRR Press Meet at Mumbai,Jr NTR ,Ram Charan,SS Rajamouli, RRR Movie Team Success Part Press Meet,RRR Movie Success Meet At Mumbai

దర్శకుడు రాజమౌళి విజువల్ వండర్ గా తెరకెక్కించిన “ఆర్ ఆర్ ఆర్” మూవీ అన్ని భాషల లోనూ భారీ కలెక్షన్స్ రాబడుతూ దిగ్విజయంగా ప్రదర్శించబడుతుంది. బాలీవుడ్ లో 200 కోట్ల కలెక్షన్స్ తో దూసుకుపోతోంది. హిందీలో ఈ చిత్రాన్ని పెన్ స్టూడియోస్ సంస్థ అధినేత జయంతి లాల్ రిలీజ్ చేశారు. “ఆర్ఆర్ఆర్” ఊహించిన విధంగా సక్సెస్ కావడంతో జయంతిలాల్ సక్సెస్ పార్టీ ఇచ్చారు.
ఈ పార్టీకి రామ్ చరణ్, ఎన్టీఆర్, రాజమౌళి, దానయ్య ఇతర ఆర్ఆర్ఆర్ చిత్ర యూనిట్ హాజరయ్యారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

సక్సెస్ పార్టీ లో పాల్గొన్న రాజమౌళి , రామ్ చరణ్ , ఎన్టీఆర్ మీడియా ప్రశ్నలకు జవాబిచ్చారు. మీరు అద్భుతమైన స్టోరీ టెల్లర్ మీకు ఫాంటసీ అనే ట్యాగ్ ను యూజ్ చేయొచ్చా అని ఒక విలేఖరి అడిగితే , చాలా కాలం గా తన ఫిల్మ్స్ లైక్ చేస్తున్నారనీ , మీరు ఏ ట్యాగ్ నైనా తనపై చేయొచ్చనీ రాజమౌళి చెప్పారు. “బాహుబలి “, “ఆర్ ఆర్ ఆర్ ” మూవీస్ లో మీ మనసుకు దగ్గరైన మూవీ ఏదని అడిగిన ప్రశ్నకు అది జడ్జ్ చేయడం సులభంకాదనీ , ప్రస్తతం “ఆర్ ఆర్ ఆర్ “మూవీ పై అటాచ్ మెంట్ పెరిగిందనీ , మీరు బెస్ట్ ఫిల్మ్ గురించి అడిగి ఉంటే తన సినిమాలే కాదు , చిన్న వయసు నుండి చూసిన సినిమాలలో “ఆర్ ఆర్ ఆర్ ” బెస్ట్ ఫిల్మ్ అని చెబుతాననీ రాజమౌళి చెప్పారు. “బాహుబలి “, “ఆర్ ఆర్ ఆర్ ” మూవీ స్ పలు రికార్డ్స్ క్రియేట్ చేశాయనీ , మీ నెక్స్ట్ ఫిల్మ్ పై ఆ ఒత్తిడి ఉంటుంది కదా , ప్రేక్షకుల అంచనాలకు తగ్గట్టు ఉంటుందా అని ఒక విలేఖరి అడిగితే “బాహుబలి “, “ఆర్ ఆర్ ఆర్ “మూవీస్ అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించాయనీ , పాశ్చాత్య ప్రేక్షకులు ప్రశంసిస్తున్నారనీ , అందరి అంచనాలకు తగ్గట్టు ది బెస్ట్ మూవీ అందిస్తాననీ రాజమౌళి చెప్పారు.మీరు ఎన్టీఆర్ ను డామినేట్ చేసినట్టుగా అందరూ అనుకుంటున్నారు , మీరేం చెబుతారు అని రామ్ చరణ్ ను ఒక విలేఖరి అడిగితేఒక్క క్షణం కూడా అలా అనుకోననీ , డామినేషన్ అనే పదాన్ని తాను నమ్మననీ , అసలందులో నిజం లేదనీ , తారక్ తో కలిసి పని చేసిన ప్రతి క్షణాన్ని గుర్తుంచుకుంటాననీ రామ్ చరణ్ చెప్పారు. పక్కనే ఉన్న తారక్ కూడా పాజిటివ్ గానే రియాక్టయ్యారు. ఈ ఇద్దరు స్టార్స్ కూడా “ఆర్ఆర్ ఆర్ ” సీక్వెల్ తీస్తే.. అందులో నటించడానికి సిద్ధమే నని చెప్పడం విశేషం.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.