‘వినరో భాగ్యము విష్ణుకథ’ కిరణ్ ఫస్ట్ లుక్ రిలీజ్

Kiran Abbavarams Vinaro Bhagyamu Vishnukatha Movie First Look Released,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, Kiran Abbavaram,Hero Kiran Abbavaram,Kiran Abbavaram Movies,Kiran Abbavarams Upcoming Movie,Kiran Abbavarams Latest Movie Updates,Kiran Abbavarams New Movie Updates, Kiran Abbavarams Vinaro Bhagyamu Vishnukatha Movie,Vinaro Bhagyamu Vishnukatha Movie,Vinaro Bhagyamu Vishnukatha Movie First Look,Vinaro Bhagyamu Vishnukatha Movie First Look Released, Vinaro Bhagyamu Vishnukatha Telugu Movie First Look Released,Kiran Abbavaram Vinaro Bhagyamu Vishnukatha Movie First Look out Now

వరుస విజయాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నాడు యంగ్ హ్యాపెనింగ్ హీరో కిర‌ణ్ అబ్బ‌వ‌రం. కేవలం వరుసగా సినిమాలు చేయడమే.. అది కూడా పెద్ద పెద్ద బ్యానర్స్ లలోనే ఛాన్స్ లు దక్కించుకోవడం విశేషం. నిజానికి కిరణ్ ఇప్పటివరకూ చేసింది రెండు మూడు సినిమాలు మాత్రమే.. అవి కూడా మంచి బ్లాక్ బస్టర్లు కొట్టిన సినిమాలు కూడా కావు.. అయినా కూడా ఈ యంగ్ హీరోకు మాత్రం మంచి మంచి అవకాశాలు వస్తున్నాయి. ఇక ప్రస్తుతం కిరణ్ పలు సినిమాలతో బిజీగా ఉండగా అందులో గీతా ఆర్ట్స్ 2 బ్యానర్ లో కూడా ఒక సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా అయితే ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ ను జరుపుకుంటుంది. ప్రస్తుతం అయితే ఈ సినిమా షూటింగ్ తిరుపతిలో జరుగుతుండా.. 35 రోజుల పాటు సాగే ఈ షెడ్యూల్ లో 80 శాతం షూటింగ్ పూర్తి కానున్నట్టు తెలుస్తుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఇదిలా ఉండగా ఈసినిమా నుండి తాజాగా ఒక అప్ డేట్ ఇచ్చింది చిత్రయూనిట్. శ్రీరామనవమి సందర్భంగా ఈసినిమా నుంచి ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల చేశారు మేకర్స్. గుడి ముందు లుంగీ కట్టుకొని పర్ఫెక్ట్ మాస్ లుక్ లో అందరిని అలరిస్తున్నాడు కిరణ్ అబ్బవరం. ఈ లుక్ మాస్ ఆడియన్స్ తో పాటు కుటుంబ ప్రేక్షకుల్ని కూడా విపరీతంగా ఆకట్టుకుంటుంది.

కాగా ఈసినిమాకు మురళీ కిషోర్ దర్శకత్వం వహిస్తుండగా.. ఈసినిమాతోనే ద‌ర్శ‌కుడిగా తెలుగు ఇండస్ట్రీకి ప‌రిచయం అవుతున్నాడు. క‌శ్మీర ప‌ర్ధేశీ హీరోయిన్ గా నటిస్తుంది. మెగా ప్రొడ్యూస‌ర్ అల్లు అరవింద్ స‌మ‌ర్ప‌ణ‌లో జీఏ2 పిక్చ‌ర్స్ బ్యాన‌ర్ పై స‌క్సెస్ ఫుల్ ప్రొడ్యూస‌ర్ బ‌న్నీ వాసు ఈసినిమాను నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం చైత‌న్ భరద్వాజ్.. విశ్వాస్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.