
ట్యాగ్ · 4407 కథనాలు · పేజీ 157


అఫీషియల్ అమెజాన్ ప్రైమ్ లో నాగచైతన్య 'దూత'

యంగ్ హీరో 'నిఖిల్' తండ్రి కన్నుమూత

మరోసారి రజనీకాంత్-రమ్యకృష్ణ కాంబినేషన్..!

దర్శకుడు కొరటాల శివ కు ఇష్టమైన సినిమాలు

బాలీవుడ్ మూవీ "యానిమల్ " షూటింగ్ తో రష్మిక బిజీ

'సర్కారు వారి పాట' ట్రైలర్ రిలీజ్ డేట్ ఫిక్స్..!

"యశోద "మూవీ గ్లింప్స్ రిలీజ్ డేట్

'సత్యదేవ్' చాలా గర్వంగా ఉంది..!

"ది వారియర్"మూవీ సెట్స్ కు అనుపమ పరమేశ్వరన్

కిరణ్ అబ్బవరం 'సమ్మతమే' కొత్త రిలీజ్ డేట్ ఫిక్స్..!

నార్త్ లో "ఆర్ ఆర్ ఆర్ " మూవీ హవా

హ్యాపీ బర్త్ డే - "శాకుంతలం " టీమ్

'హరి హర వీరమల్లు' మరో షెడ్యూల్ కంప్లీట్..!

'శివ కార్తికేయన్' డాన్ కొత్త రిలీజ్ డేట్ ఫిక్స్..!

'ఆచార్య' తో హరీష్.. భవదీయుడు డైలాగ్ లీక్..!

మాది కూడా కపూర్ ఫ్యామిలీ కావాలనుకున్నా..!

ఫేక్ సీన్ తో 'సామ్' కు బర్త్ డే విషెస్..!
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత సమంత తన పుట్టిన రోజును జరుపుకుంటున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా తనకు సెలబ్రిటీల నుండి అభిమానుల నుండి బర్త్ డే విషెస్ అందుతున్నాయి. మరోవైపు తను నటిస్తున్న సినిమాల నుండి అప్ డేట్స్ కూడా వచ్చాయి. ఇక ఈసందర్బంగా #VD 11 చిత్రయూనిట్ కూడా సామ్ కు బర్త్ డే విషెస్ అందించారు. అయితే అందరిలా కాకుండా కాస్త విభిన్నంగా ప్లాన్ చేశారు చిత్రబృందం. తనకోసం ఫేక్ సీన్ ను క్రియేట్ చేసి ప్రాంక్ చేసి మరీ విషెస్ అందించారు. ఇక ఈవీడియోను విజయ్ దేవరకొండ తన ఇన్ట్సా ద్వారా షేర్ చేస్తూ సామ్ కు స్పెషల్ విషెస్ అందించాడు.

అఫీషియల్ అమెజాన్ ప్రైమ్ లో నాగచైతన్య 'దూత'
ప్రస్తుతం ఇండస్ట్రీలో చాలా మార్పులు వచ్చిన సంగతి తెలిసిందే. అందులోనూ ఓటీటీ ఫ్లాట్ ఫామ్స్ ఎక్కువయ్యాక ఆ మార్పులు మరింత ఎక్కువయ్యాయి. ఆడియన్స్ ఓటీటీ కి మరింత చేరువైన నేపథ్యంలో సెలబ్రిటీలు ఓటీటీల ద్వారా కూడా ప్రేక్షకుల ముందుకు రావడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. హీరోలు సైతం ఒకవైపు సినిమాలు చేస్తూనే మరోవైపు ఓటీటీలలో చేయడానికి ముందుకొస్తున్నారు. ఈనేపథ్యంలోనే టాలీవుడ్ యంగ్ హీరో నాగచైతన్య కూడా ఓటీటీలోకి ఎంట్రీ ఇస్తున్నాడు.

యంగ్ హీరో 'నిఖిల్' తండ్రి కన్నుమూత
టాలీవుడ్ లో గత కొంతకాలంగా ఏదో ఒక విషాదం చోటుచేసుకుంటూనే ఉంది. ఈమధ్య సెలబ్రిటీల మరణవార్తలను ఎక్కువగా వినాల్సి వస్తుంది. ఇప్పటికే చాలామంది ప్రముఖులను కోల్పోయింది చిత్రపరిశ్రమ. రీసెంట్ గానే ప్రముఖ నిర్మాత నారాయణ్ దాస్ కె నారంగ్ కన్ను మూశారు. ఇక ఇప్పుడు మరో యంగ్ హీరో ఇంట్లో విషాదం చోటుచేసుకుంది. యంగ్ హీరో నిఖిల్ తండ్రి శ్యామ్ సిద్ధార్థ కన్నుమూశారు. గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైదరాబాదులోని నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. అయితే పరిస్థితి కాస్త విషమించడంతో నేడు తుదిశ్వాస విడిచారు. మరోవైపు నిఖిల్ తండ్రి చనిపోవడంపై పలువురు సినీ ప్రముఖులు విచారం వ్యక్తం చేస్తున్నారు…

మరోసారి రజనీకాంత్-రమ్యకృష్ణ కాంబినేషన్..!
రజనీకాంత్-రమ్యకృష్ణ కాంబినేషన్ లో వచ్చిన నరసింహ సినిమా గురించి ఎప్పటికీ మరిచిపోలేరు. తమిళ్ లో వడయప్పా అన్న పేరుతో రిలీజ్ అవ్వగా.. తెలుగులో నరసింహ పేరుతో రిలీజ్ అయింది. ఇక ఈసినిమాలో రజనీకాంత్- రమ్యకృష్ణ పోటా పోటీగా నటించారు. రజనీకాంత్ నటన గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.. అలాంటి పాత్రల్లో తను ఇంతకుముందే నటించాడు. కానీ నీలాంబరి పాత్రలో నటించిన రమ్యకృష్ణ పాత్ర మాత్రం సినిమాకు మరో హైలెట్ అని చెప్పొచ్చు. తను తప్పా ఆ పాత్రలో ఎవరు చేసినా ఆ రేంజ్ లో వస్తుందని చెప్పలేము. తను ఏది కోరుకుంటే అది దక్కాలి అని అనుకునే పొగరుబోతు పాత్రలో రమ్యకృష్ణ జీవించేసింది. ఇక ఈ సినిమాతో రమ్యకృష్ణ క్రేజ్ కూడా…

దర్శకుడు కొరటాల శివ కు ఇష్టమైన సినిమాలు
పలు సూపర్ హిట్ సినిమాలకు రైటర్ గా పని చేసిన కొరటాల శివ సూపర్ హిట్ "మిర్చి "మూవీ తో టాలీవుడ్ కు దర్శకుడిగా పరిచయం అయ్యారు. "శ్రీమంతుడు ", "జనతా గ్యారేజ్ ""భరత్ అనే నేను " వంటి బ్లాక్ బస్టర్ మూవీస్ తో కొరటాల ప్రేక్షకులను అలరించారు. మెగా స్టార్ చిరంజీవి, రామ్ చరణ్ హీరోలుగా కొరటాల దర్శకత్వంలో తెరకెక్కిన "ఆచార్య "మూవీ 29 వ తేదీ రిలీజ్ కానుంది. కొరటాల దర్శకత్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కనున్న "#NTR30" మూవీ త్వరలో సెట్స్ పైకి వెళ్లనుంది.

బాలీవుడ్ మూవీ "యానిమల్ " షూటింగ్ తో రష్మిక బిజీ
పలు బ్లాక్ బస్టర్ మూవీస్ లో తన అందం , అభినయం తో ప్రేక్షకులను అలరిస్తూ సక్సెస్ ఫుల్ చిత్ర హీరోయిన్ గా రాణిస్తున్న రష్మిక నేషనల్ క్రష్ గా మారారు.“పుష్ప :ది రైజ్ “హిందీ డబ్బింగ్ వెర్షన్ తో ప్రేక్షకులను ఆకట్టుకున్న రష్మిక బాలీవుడ్ లో క్రేజీ హీరోయిన్ గా మారారు.దుల్కర్ సల్మాన్ “సీతారామం”, దళపతి విజయ్ హీరో గా తెలుగు , తమిళ భాషలలో తెరకెక్కుతున్న “#THALAPATHY 66 “మూవీ లో విజయ్ కు జోడీగా రష్మిక నటిస్తున్నారు. రష్మిక కథానాయిక గా “పుష్ప :ది రూల్”మూవీ త్వరలో సెట్స్ పైకి వెళ్ళనుంది. స్టార్ హీరోయిన్ రష్మిక కథానాయికగా రూపొందిన బాలీవుడ్ మూవీ “మిషన్ మజ్ను ” 2022 మే 13 వ తేదీ రిలీజ్ కానుంది. బిగ్ బీ అమితాబ్…

'సర్కారు వారి పాట' ట్రైలర్ రిలీజ్ డేట్ ఫిక్స్..!
మహేష్ ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురూచస్తున్న సినిమా సర్కారు వారి పాట. మహేష్ ను సిల్వర్ స్క్రీన్ పై చూసి చాలా కాలం అవ్వడంతో మహేష్ అభిమానులు తమ అభిమాన హీరోను ఎప్పుడు చూద్దామా అని ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ఇక వారి ఎదురుచూపులకు మరో రెండు వారాల్లో ఫుల్ స్టాప్ పడనుంది. ఇటీవలే ఈ సినిమా షూటింగ్ ను పూర్తి చేసుకొని.. పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ ను జరుపుకొంటోంది. మే 12న రిలీజ్ కానున్న ఈసినిమా ప్రస్తుతం ప్రమోషన్స్ పై దృష్టి పెడుతుంది.

"యశోద "మూవీ గ్లింప్స్ రిలీజ్ డేట్
శ్రీదేవి మూవీస్ బ్యానర్ పై హరి , హరీష్ దర్శకత్వంలో స్టార్ హీరోయిన్ సమంత ప్రధాన పాత్రలో పాన్ ఇండియా మూవీ “యశోద’” తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఉమెన్ సెంట్రిక్ ఫిల్మ్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో వరలక్ష్మి శరత్ కుమార్, రావు రమేష్, ఉన్ని ముకుందన్, కల్పిక గణేష్, సంపత్ రాజ్ కీలకపాత్రలు పోషిస్తున్నారు. మణిశర్మ సంగీతం అందిస్తున్నారు. సైంటిఫిక్ థ్రిల్లర్ కాన్సెప్ట్ తో తెరకెక్కుతున్న “యశోద ” మూవీలో సమంత క్యారెక్టర్ కై హాలీవుడ్ యాక్షన్ కొరియోగ్రాఫర్ యానిక్ బెన్ కొన్నియాక్షన్ సన్నివేశాలను తెరకెక్కించారు.

'సత్యదేవ్' చాలా గర్వంగా ఉంది..!
సినీ ఇండస్ట్రీలో ఉన్న ఎంతో మంది యంగ్ హీరోస్ కు మెగాస్టార్ చిరంజీవి ఇన్స్ఫిరేషన్ అని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఎంతో మంది చిరు ఇన్ఫిరేషన్ తోనే సినిమాల్లోకి వచ్చిన వారు ఉన్నారు. అందులో సత్యదేవ్ కూడా ఒకరు. చిరు మీద తనకు ఉన్న అభిమానాన్ని ఎప్పుడూ చూపిస్తూనే ఉంటాడు. తాజాగా మరోసారి చిరుపై తనకున్న అభిమానాన్ని చాటిచెప్పాడు.

"ది వారియర్"మూవీ సెట్స్ కు అనుపమ పరమేశ్వరన్
శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ బ్యానర్ పై సూపర్ హిట్ “పందెం కోడి “మూవీ ఫేమ్ లింగుస్వామి దర్శకత్వంలో ఎనర్జిటిక్ హీరో రామ్, సక్సెస్ ఫుల్ చిత్ర హీరోయిన్ కృతి శెట్టి జంటగా ఫ్యాక్షన్ నేపథ్యం లో తెలుగు , తమిళ భాషలలో తెరకెక్కుతున్న యాక్షన్ ఎంటర్ టైనర్ “ది వారియర్ ” మూవీ జూలై 14 వ తేదీ రిలీజ్ కానుంది. ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని ఫస్ట్ టైమ్ పోలీస్ ఆఫీసర్ గా నటిస్తున్న ఈ మూవీ లో నదియా , ఆదిపినిశెట్టి , అక్షర గౌడ్ ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. “ది వారియర్”మూవీ షూటింగ్ ముగింపు దశలో ఉంది.

కిరణ్ అబ్బవరం 'సమ్మతమే' కొత్త రిలీజ్ డేట్ ఫిక్స్..!
కరోనా థర్డ్ వేవ్ వల్ల కూడా చాలా సినిమాల రిలీజ్ డేట్లు మారిపోయాయి. ముందే రిలీజ్ కావాల్సిన పెద్ద సినిమాల రిలీజ్ డేట్లు మారిపోవడంతో చిన్న సినిమాల రిలీజ్ డేట్లు కూడా మార్చుకోవాల్సి వచ్చింది. ఇక ప్రస్తుతం అయితే పెద్ద సినిమాలు పెద్దగా లేవు. పెండింగ్ లో ఉన్న సినిమాలు మొత్తం రిలీజ్ అయిపోయాయి. దీంతో చిన్న సినిమాలు మళ్లీ కొత్తగా రిలీజ్ డేట్లను మార్చుకుంటున్నాయి. ఇప్పటికే చాలా సినిమాల రిలీజ్ డేట్లు మారగా.. ఇప్పుడు కిరణ్ అబ్బవరం సమ్మతమే చిత్రయూనిట్ కూడా కొత్త రిలీజ్ డేట్ ను ప్రకటించింది.

నార్త్ లో "ఆర్ ఆర్ ఆర్ " మూవీ హవా
డివివి ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై స్టార్ డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ , అలియా భట్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ , ఒలీవియా మోరిస్ జంటలుగా భారీ బడ్జెట్ , భారీ తారాగణం తో తెరకెక్కిన హై ఎమోషనల్ యాక్షన్ ఎంటర్ టైనర్ “రౌద్రం రణం రుధిరం ” మూవీ మార్చి 25 వ తేదీ ప్రపంచవ్యాప్తంగా 10,000కు పైగా స్క్రీన్స్ లో రిలీజ్ అయ్యి సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుని అన్ని భాషలలోనూ భారీ కలెక్షన్స్ తో దూసుకుపోతున్న విషయం తెలిసిందే.

హ్యాపీ బర్త్ డే - "శాకుంతలం " టీమ్
దిల్ రాజు ప్రొడక్షన్స్ , గుణ టీమ్ వర్క్స్ బ్యానర్స్ పై గుణశేఖర్ దర్శకత్వంలో స్టార్ హీరోయిన్ సమంత , దేవ్ మోహన్ జంటగా మహా భారతం ఆదిపర్వం లోని శకుంతల , దుష్యంతుల ప్రేమ కథ ఆధారంగా మైథలాజికల్ మూవీ “శాకుంతలం ” తెరకెక్కిన విషయం తెలిసిందే. స్టార్ హీరోయిన్ సమంత ఫస్ట్ టైమ్ నటిస్తున్న ఈ మైథలాజికల్ మూవీ లో అదితి బాలన్ , మోహన్ బాబు , ప్రకాష్ రాజ్ , కబీర్ దుహన్ సింగ్ , అల్లు అర్హ ముఖ్య పాత్రలలో నటించారు. మణిశర్మ సంగీతం అందించారు.“శాకుంతలం ” మూవీని పాన్ ఇండియా మూవీ గా రిలీజ్ చేయడానికి మేకర్స్ ప్లాన్ చేశారు.

'సర్కారు వారి పాట' డైరెక్టర్ హ్యాపీ.. ఫుల్ స్వింగ్ లో వర్క్..!
టాలీవుడ్ లో టాప్ మ్యూజిక్ డైరెక్టర్ గా ప్రస్తుతం థమన్ ఫుల్ ఫామ్ లో ఉన్నాడు. తను అందిస్తున్న పాటలు సూపర్ క్రేజ్ ను సొంతం చేసుకోవడంతో పాటు పలు కొత్త రికార్డులు క్రియేట్ చేస్తుండటంతో థమన్ క్రేజ్ కూడా బాగా పెరిగింది. సినిమాకు తన పాటలతోనే సగం హైప్ తెచ్చేస్తున్నాడు. ఇక మహేష్..పరశురామ్ దర్శకత్వంలో వస్తున్న సర్కారు వారి పాట సినిమాకు కూడా థమన్ సంగీతం అందిస్తున్న సంగతి తెలిసిందే కదా. ఈ సినిమాకు కూడా సాలిడ్ పాటలు, మ్యూజిక్ అందిస్తున్నాడన్న విషయం ఇప్పటికే రిలీజ్ అయిన పాటలు, బ్లాస్టర్ వీడియోలను బట్టి చెప్పొచ్చు. మొదట రిలీజ్ అయిన కళావతి పాటకు అయితే ఓ రేంజ్ లో రెస్పాన్స్ వచ్చింది. ఆ తర్వాత రిలీజ్ అయిన…

బన్నీ , తారక్ , రామ్ , నితిన్ బెస్ట్ డ్యాన్సర్స్ - చిరంజీవి
కొణిదెల ప్రొడక్షన్స్ , మ్యాట్నీ ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్స్ పై సక్సెస్ ఫుల్ చిత్ర దర్శకుడు కొరటాల శివ దర్శకత్వంలో మెగా స్టార్ చిరంజీవి హీరో గా భారీ బడ్జెట్ తో రూపొందిన “ఆచార్య “మూవీ ఏప్రిల్ 29 వ తేదీ భారీ అంచనాలతో రిలీజ్ కానుంది. ఈ మూవీ లో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ , పూజా హెగ్డే జంటగా నటించారు. సోనూసూద్ ఒక కీలక పాత్రలో నటించారు. “ఆచార్య ” మూవీ లో హీరోయిన్ రెజీనా ఫస్ట్ టైమ్ ఒక స్పెషల్ సాంగ్ లో నటించారు. మణిశర్మ సంగీతం అందించారు. “ఆచార్య” మూవీ లో టెంపుల్ టౌన్ సెట్ ప్రత్యేక ఆకర్షణ కానుంది.చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ , టీజర్ , సాంగ్స్, ట్రైలర్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.

'హరి హర వీరమల్లు' మరో షెడ్యూల్ కంప్లీట్..!
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో క్రియేటివ్ డైరెక్టర్ క్రిష్ తెరకెక్కిస్తోన్న పీరియాడికల్ మూవీ ‘హరిహర వీరమల్లు’. గతకొద్దికాలంగా ఈచిత్రం సైలెంట్ గా ఉన్నా ఇప్పుడిప్పుడే మళ్లీ ఆ సందడి మొదలైంది. కరోనా వల్ల ఈసినిమా షూటింగ్ కు బ్రేక్ పడగా.. ఆతరువాత పలు కారణాల వల్ల చాలా కాలం బ్రేక్ పడింది. ఈమధ్యనే మళ్లీ ఈసినిమా షూటింగ్ ను రీస్టార్ట్ చేశారు మేకర్స్. దీంతో మళ్లీ హరిహర వీరమల్లు సందడి మొదలైంది. షూటింగ్ కు ముందు ఈసినిమాలో యాక్షన్ సీక్వెన్స్ కు సంబంధించిన పవన్ రిహార్సల్స్ చేస్తున్న వీడియోను రిలీజ్ చేయగా అది ఎంత వైరల్ అయిందో చూశాం. ప్రస్తుతం అయితే ఈసినిమా షూటింగ్ ను శరవేగంగా జరుపుకుంటుంది. కొద్ది రోజులుగా…

కళావతి బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తో 'థమన్' అప్ డేట్..!
సూపర్ స్టార్ మహేష్ బాబు నుండి సినిమా వచ్చి దాదాపు రెండేళ్లు అయిపోయింది. మహేష్ నుండి వచ్చిన చివరి చిత్రం సరిలేరు నీకెవ్వరు. దీనితో ఫ్యాన్స్ మహేష్ మూవీ కోసం ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఇక మరికొద్ది రోజుల్లో ఈసినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రస్తుతం అయితే పోస్ట్ ప్రొడక్షన్ పనులను ముగించుకునే పనిలో ఉంది చిత్రయూనిట్. మరోవైపు అప్పుడప్పుడు అప్ డేట్స్ ఇస్తున్నారు. అయితే ఇంకా సాలిడ్ ప్రమోషన్స్ స్టార్ట్ చేయలేదు కానీ పాటలు ఒక్కొక్కటిగా రిలీజ్ చేస్తున్నారు. ఇక పాటలకు ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో చూస్తూనే ఉన్నాం.

'శివ కార్తికేయన్' డాన్ కొత్త రిలీజ్ డేట్ ఫిక్స్..!
తమిళ టాలెంటెడ్ నటుడు శివ కార్తికేయన్ కు తమిళ్ తో పాటు తెలుగులో కూడా మంచి ఫాలోయింగ్ ఉన్న సంగతి తెలిసిందే కదా. అందకే తన సినిమాలను తమిళ్ తో పాటు తెలుగులో కూడారిలీజ్ చేస్తుంటాడు. గత ఏడాది డాక్టర్ సినిమాతో మంచి హిట్ ను సొంతం చేసుకున్నాడు. ఇక ఇప్పుడు వరుస సినిమాలతో ఫుల్ ఫామ్ లో ఉన్నాడు శివ కార్తికేయన్ . ఇప్పుడు మరో కొత్త సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావడానికి రెడీ అయిపోయాడు. సిబి చక్రవర్తి దర్శకత్వంలో శివకార్తికేయన్ హీరోగా డాన్ సినిమా వస్తుంది. ప్రస్తుతం అయితే ఈసినిమా రిలీజ్ కు సిద్దమవుతుంది.

'ఆచార్య' తో హరీష్.. భవదీయుడు డైలాగ్ లీక్..!
కొరటాల శివ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి, మెగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కాంబినేషన్ లో వస్తున్న సినిమా ఆచార్య. తండ్రీ కొడుకులిద్దరూ కలిసి స్క్రీన్ షేర్ చేసుకుంటుండటంతో.. ఫ్యాన్స్ ఎప్పటినుండి వెయిట్ చేస్తున్న మూమెంట్ కావడంతో ఈసినిమాకోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక ఈసినిమా రిలీజ్ కు ఇంకా ఒక్క రోజు మాత్రమే మిగిలి ఉంది. మరోవైపు చిత్రయూనిట్ వరుసగా ఇంటర్వ్యూలు బిజీగా ప్రమోషన్స్ చేస్తున్నారు.

మాది కూడా కపూర్ ఫ్యామిలీ కావాలనుకున్నా..!
తెలుగు సినీ పరిశ్రమలో మెగా ఫ్యామిలి గురించి తెలియని వారుండరు. ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా తెలుగు సినీ రంగంలోకి ప్రవేశించి మెగాస్టార్ అనే బిరుదును సొంతం చేసుకున్నారు చిరంజీవి. సినీ కెరీర్ లో ఎన్నో ఒడుదుడుకులు ఎదురైనా కూడా వాటన్నింటినీ ఎదుర్కొని సినీ చరిత్రలో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్నారు. తన నటన, డ్యాన్స్, సినిమాలతో ఎంతో మందిని ఉర్రూతలూగించి కోట్లాది మంది అభిమానులను సొంతం చేసుకున్నారు. ఎంతో మందికి స్పూర్తిదాయకంగా నిలిచారు. ఇప్పుడు ఇండస్ట్రీలో ఉన్న ఎంతోమంది చిరు ఇన్ఫిరేషన్ తో వచ్చినవాళ్లే.