‘సర్కారు వారి పాట’ ట్రైలర్ రిలీజ్ డేట్ ఫిక్స్..!

Sarkaru Vaari Paata Trailer Release Date Out,#SarkaruVaariPaata,latest telugu movies news,Latest Tollywood News,mahesh babu,Mahesh Babu new movie,Mahesh Babu Sarkaru Vaari Paata Trailer, Mahesh Babu Upcoming Film Sarkaru Vaari Paata,Mahesh Babu’s Sarkaru Vaari Paata Trailer Release Date Announced,Sarkaru Vaari Paata,Sarkaru Vaari Paata Movie Latest News, Sarkaru Vaari Paata Movie Trailer,Sarkaru Vaari Paata Movie Trailer Release Date,Sarkaru Vaari Paata Trailer,Sarkaru Vaari Paata Trailer Release Date, Sarkaru Vaari Paata Trailer Update,Telugu Film News 2022,Telugu Filmnagar,Tollywood Movie Updates

మహేష్ ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురూచస్తున్న సినిమా సర్కారు వారి పాట. మహేష్ ను సిల్వర్ స్క్రీన్ పై చూసి చాలా కాలం అవ్వడంతో మహేష్ అభిమానులు తమ అభిమాన హీరోను ఎప్పుడు చూద్దామా అని ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ఇక వారి ఎదురుచూపులకు మరో రెండు వారాల్లో ఫుల్ స్టాప్ పడనుంది. ఇటీవలే ఈ సినిమా షూటింగ్ ను పూర్తి చేసుకొని.. పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ ను జరుపుకొంటోంది. మే 12న రిలీజ్ కానున్న ఈసినిమా ప్రస్తుతం ప్రమోషన్స్ పై దృష్టి పెడుతుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇప్పటికే ఈసినిమా నుండి వరుసగా పాటలు రిలీజ్ చేస్తున్నారు. దీనిలో భాగంగానే ఇప్పటి వరకూ మూడు పాటలను రిలీజ్ చేశారు. మూడు పాటలు కూడా మంచి రెస్పాన్స్ ను సొంతం చేసుకున్నాయి. అయితే ఎన్ని పాటలు వచ్చినా.. ఎన్ని అప్ డేట్స్ ఇచ్చినా ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూసేది మాత్రం ట్రైలర్ గురించే. ఇక ఇప్పుడు అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తుంది ఈసినిమా నుండి వచ్చే ట్రైలర్ కోసం. ఇక ఈనేపథ్యంలోనే అభిమానులకు సర్ ప్రైజ్ ఇస్తూ ఈ సినిమా ట్రైలర్ అప్ డేట్ ఇచ్చింది చిత్రయూనిట్. ఈసినిమా ట్రైలర్ ను మే2 వ తేదీన రిలీజ్ చేస్తున్నట్టు ప్రకటించారు.

కాగా ఈసినిమాలో కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తుండగా.. వెన్నెల కిషోర్, సముద్రఖని కూడా ముఖ్య పాత్రలలో కనిపించనున్నారు. మైత్రీ మూవీ మేకర్స్, GMB ఎంటర్టైన్మెంట్ మరియు 14 రీల్స్ ప్లస్ బ్యానర్లపై నవీన్ యెర్నేని, వై. రవిశంకర్, రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. థమన్ సంగీతం అందిస్తుండగా.. ఆర్ మధి సినిమాటోగ్రఫీ, ఏ ఎస్ ప్రకాష్ ఆర్ట్ డైరెక్టర్ గా పనిచేస్తున్నారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

3 × three =