కళావతి బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తో ‘థమన్’ అప్ డేట్..!

Thaman Latest Update about Sarkaru Vaari Paata,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, Sarkaru Vaari Paata,Sarkaru Vaari Paata Telugu movie,Sarkaru Vaari Paata Movie Updates,Sarkaru Vaari Paata Latest Updates By Thaman,Sarkaru Vaari Paata Movie latest Updates, Music Director Thaman latest Update About Sarkaru Vaari Paata movie,Thaman Latest Update with BGM of Sarkaru Vaari Paata Movie,Thaman Gives Update with BGm of Sarkaru Vaari Paata Movie Sarkaru Vaari Paata Movie BGM,Sarkaru Vaari paata kalavathi Song BGM

సూపర్ స్టార్ మహేష్ బాబు నుండి సినిమా వచ్చి దాదాపు రెండేళ్లు అయిపోయింది. మహేష్ నుండి వచ్చిన చివరి చిత్రం సరిలేరు నీకెవ్వరు. దీనితో ఫ్యాన్స్ మహేష్ మూవీ కోసం ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఇక మరికొద్ది రోజుల్లో ఈసినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రస్తుతం అయితే పోస్ట్ ప్రొడక్షన్ పనులను ముగించుకునే పనిలో ఉంది చిత్రయూనిట్. మరోవైపు అప్పుడప్పుడు అప్ డేట్స్ ఇస్తున్నారు. అయితే ఇంకా సాలిడ్ ప్రమోషన్స్ స్టార్ట్ చేయలేదు కానీ పాటలు ఒక్కొక్కటిగా రిలీజ్ చేస్తున్నారు. ఇక పాటలకు ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో చూస్తూనే ఉన్నాం.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఈసినిమాకు సంబంధించి థమన్ ఏదో ఒక అప్ డేట్ ఇస్తూనే ఉన్నాడు. తన పాటల గురించో.. వర్క్ గురించో, అప్ డేట్స్ గురించో ఏదో ఒకటి తన ట్విట్టర్ ద్వారా తెలియచేస్తూనే ఉన్నాడు. ఇక తాజాగా మరో అప్ డేట్ ఇచ్చారు. తన ట్విట్టర్ ద్వారా కళావతి సాంగ్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ట్యూన్ ను పోస్ట్ చేస్తూ ఈ సీన్ థియోటర్ లో చూస్తే అంటూ ట్వీట్ చేశాడు.

కాగా ఈసినిమాలో కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తుండగా.. వెన్నెల కిషోర్, సముద్రఖని కూడా ముఖ్య పాత్రలలో కనిపించనున్నారు. మైత్రీ మూవీ మేకర్స్, GMB ఎంటర్టైన్మెంట్ మరియు 14 రీల్స్ ప్లస్ బ్యానర్లపై నవీన్ యెర్నేని, వై. రవిశంకర్, రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. థమన్ సంగీతం అందిస్తుండగా.. ఆర్ మధి సినిమాటోగ్రఫీ, ఏ ఎస్ ప్రకాష్ ఆర్ట్ డైరెక్టర్ గా పనిచేస్తున్నారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

seventeen − 8 =