మాది కూడా కపూర్ ఫ్యామిలీ కావాలనుకున్నా..!

Chiranjeevi says he too wants to become like Kapoor Family,Chiranjeevi says he too wants to become like Kapoor Family,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, Chiranjeevi,Mega Star Chiranjeevi,chiranjeevi Movie Updates,Chiranjevi Movie Latest Updates,Chiranjeevi upcoming movies,Chiranjeevi Mutlistarrer Movie Acharya, Chiranjeevi about Kapoor family,Chiranjeevi Wants to Become like kapoor Family,Chiranjeevi in a Interview,Acharya movie latest Updates,Acharya movie Releasign on 29th April, Chiranjeevi and Ram Charan movie Acharya Releasing on 29th April

తెలుగు సినీ పరిశ్రమలో మెగా ఫ్యామిలి గురించి తెలియని వారుండరు. ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా తెలుగు సినీ రంగంలోకి ప్రవేశించి మెగాస్టార్ అనే బిరుదును సొంతం చేసుకున్నారు చిరంజీవి. సినీ కెరీర్ లో ఎన్నో ఒడుదుడుకులు ఎదురైనా కూడా వాటన్నింటినీ ఎదుర్కొని సినీ చరిత్రలో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్నారు. తన నటన, డ్యాన్స్, సినిమాలతో ఎంతో మందిని ఉర్రూతలూగించి కోట్లాది మంది అభిమానులను సొంతం చేసుకున్నారు. ఎంతో మందికి స్పూర్తిదాయకంగా నిలిచారు. ఇప్పుడు ఇండస్ట్రీలో ఉన్న ఎంతోమంది చిరు ఇన్ఫిరేషన్ తో వచ్చినవాళ్లే.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఇదిలా ఉండగా తాజాగా చిరు పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తను నటించిన ఆచార్య సినిమా రిలీజ్ కానున్న నేపథ్యంలో పలు ఇంటర్వ్యూల్లో పాల్గొంటున్నారు చిరు. ఈసందర్భంగా ఓ ఇంటర్వ్యూలో తన ఫ్యామిలీ గురించి మాట్లాడుతూ.. తన కుటుంబం కపూర్ ఫ్యామిలీ కావాలనుకున్నానని తెలిపారు. హిందీలో కపూర్ కుటుంబానికి ఓ ప్రాధాన్యం ఉందని, ఆ కుటుంబం నుంచి వచ్చిన వాళ్లంతా తమకంటూ ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకున్నారని చెప్పారు. వారికున్న పేరు, ఫేమ్ ను చూసి తనకెంతో ముచ్చటేసిందని… అందుకే తన కుటుంబం కపూర్ ఫ్యామిలీలా ఎదగాలనుకుంటున్నట్టు పవన్ కల్యాణ్ తో చెప్పానని ఆయన గుర్తు చేసుకున్నారు.

కాగా మెగాస్టార్ వేసిన రూట్ లో ఎంత మంది మెగా హీరోలు ఎంట్రీ ఇచ్చారో తెలిసిందే. చాలామంది టాప్ పొజిషన్ లో కొనసాగుతున్నారు కూడా. పవర్ స్టార్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇక ఆతరువాత వచ్చిన అల్లు అర్జున్ కానీ, రామ్ చరణ్ టాలీవుడ్ స్టార్ హీరోలుగా టాప్ లో ఉన్నారు. ఇక వరుణ్ తేజ్, సాయి ధరమ్ తేజ్ కూడా మంచి హిట్లతో కెరీర్ లో దూసుకుపోతున్నారు. కొత్తగా వచ్చిన వైష్ణవ్ తేజ్ కూడా మొదటి సినిమాతోనే మంచి విజయం దక్కించుకొని తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

three × two =