మరోసారి రజనీకాంత్-రమ్యకృష్ణ కాంబినేషన్..!

Rajinikanth And Ramya Krishnan To Team Up Again,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, Rajinikanth,Super Star Rajinikanth,Rajinikanth Movie Updates,Rajinikanth Latst Movie Updates,Rajinikanth Upcoming Movies,Rajinikanth latest News,Rajinikanth To Team Up with Ramya Krishnan, Rajinikanth To Act with Ramya Krishnan Again,Rajinikanth New Movie with Actress Ramya Krishnan Again,Rajinikanth and Ramya Krishnan Team up Again,Rajinikanth and Ramya Krishnan New Updates

రజనీకాంత్-రమ్యకృష్ణ కాంబినేషన్ లో వచ్చిన నరసింహ సినిమా గురించి ఎప్పటికీ మరిచిపోలేరు. తమిళ్ లో వడయప్పా అన్న పేరుతో రిలీజ్ అవ్వగా.. తెలుగులో నరసింహ పేరుతో రిలీజ్ అయింది. ఇక ఈసినిమాలో రజనీకాంత్- రమ్యకృష్ణ పోటా పోటీగా నటించారు. రజనీకాంత్ నటన గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.. అలాంటి పాత్రల్లో తను ఇంతకుముందే నటించాడు. కానీ నీలాంబరి పాత్రలో నటించిన రమ్యకృష్ణ పాత్ర మాత్రం సినిమాకు మరో హైలెట్ అని చెప్పొచ్చు. తను తప్పా ఆ పాత్రలో ఎవరు చేసినా ఆ రేంజ్ లో వస్తుందని చెప్పలేము. తను ఏది కోరుకుంటే అది దక్కాలి అని అనుకునే పొగరుబోతు పాత్రలో రమ్యకృష్ణ జీవించేసింది. ఇక ఈ సినిమాతో రమ్యకృష్ణ క్రేజ్ కూడా అప్పట్లో ఏ రేంజ్ లో పెరిగిందో తెలిసిందే. రమ్యకృష్ణ చేసిన పాత్రల్లో ఎవర్ గ్రీన్ పాత్రగా నిలిచిపోతుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఇదిలా ఉండగా ఇప్పుడు మరోసారి ఈ కాంబినేషన్ ప్రేక్షకుల ముందుకు రానున్నట్టు వార్తలు వస్తున్నాయి. నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో ఒక సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే కదా. ఇక ఈసినిమాలో ఒక పవర్ ఫుల్ పాత్ర కోసం రమ్యకృష్ణను తీసుకున్నట్టు వార్తలు వస్తున్నాయి. మరి ఇందులో ఎంత నిజముందో తెలియాలంటే మాత్రం అధికారిక ప్రకటన వచ్చేంత వరకూ వెయిట్ చేయాల్సిందే.

కాగా సన్ పిక్చర్స్ వారు నిర్మిస్తున్న ఈ సినిమాకి అనిరుధ్ సంగీతాన్ని అందిస్తున్నాడు. మరి నిజంగా వీరిద్దరి కాంబినేషన్ అంటే ఎలా ఉంటుందో చెప్పనక్కర్లేదు. నిజమైతే కనుక మరోసారి క్రేజీ కాంబినేషన్ ను చూడొచ్చు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

two × one =