‘సత్యదేవ్’ చాలా గర్వంగా ఉంది..!

Megastar Chiranjeevi Feeling Proud About Satyadev

సినీ ఇండస్ట్రీలో ఉన్న ఎంతో మంది యంగ్ హీరోస్ కు మెగాస్టార్ చిరంజీవి ఇన్స్ఫిరేషన్ అని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఎంతో మంది చిరు ఇన్ఫిరేషన్ తోనే సినిమాల్లోకి వచ్చిన వారు ఉన్నారు. అందులో సత్యదేవ్ కూడా ఒకరు. చిరు మీద తనకు ఉన్న అభిమానాన్ని ఎప్పుడూ చూపిస్తూనే ఉంటాడు. తాజాగా మరోసారి చిరుపై తనకున్న అభిమానాన్ని చాటిచెప్పాడు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

నేడు తన ట్విట్టర్ ద్వారా మరోసారి చిరు పై తనకు ఉన్నఅభిమానాన్ని తెలియచేశాడు. అన్నయ్యా.. నటనలో జీవితంలో మాలాంటి ఎందరికో ఆచార్య మీరు. అభిమానిగా గుండెల్లో చిరకాలం తలిచేది మీ పేరునే. మిమ్మల్ని చూసే నటుడిగా మారాను. ఈరోజు ఆచార్య సినిమాలో కాసేపైనా మీతోపాటూ కనిపించే అదృష్టం కలిగింది.మీ కష్టం, క్రమశిక్షణ దగ్గర నుంచి చూసి నేర్చుకునే అవకాశం దక్కింది అంటూ ట్వీట్ చేశారు. ఇక దీనికి చిరు కూడా స్పందిస్తూ తన ట్విట్టర్ ద్వారా రిప్లై ఇచ్చారు. డియర్ సత్యదేవ్ థాంక్యూ.. నీలాంటి చక్కని నటుడు నా అభిమాని కావడం చాలా సంతోషంగా ఉంది. ఆచార్య లో తక్కువ నిడివి పాత్రలో అయినా నువ్వు కనిపించడం నాకు ఆనందంగా ఉంది.. అలానే గాడ్ పాధర్ సినిమాలో నా అభిమాని నాకు ఎదురుగా నిలబడే పూర్తి స్థాయి పాత్రలో నటించడం నాకు గర్వకారణంగా ఉంది అంటూ ట్వీట్ చేశారు.

ఇదిలా ఉండగా ప్రస్తుతం పలు సినిమాలతో బిజీగా ఉన్నాడు సత్యదేవ్. ఒకపక్క హీరోగా సినిమాలు చేస్తూనే మరోపక్క పలు కీలక పాత్రల్లో కూడా చేస్తున్నాడు. ఇక ఇప్పుడు చిరు ట్వీట్ తో గాడ్ ఫాదర్ లో కూడా సత్యదేవ్ ఉన్నాడన్న క్లారిటీ వచ్చేసింది.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

one × 5 =