టాలీవుడ్ లో టాప్ మ్యూజిక్ డైరెక్టర్ గా ప్రస్తుతం థమన్ ఫుల్ ఫామ్ లో ఉన్నాడు. తను అందిస్తున్న పాటలు సూపర్ క్రేజ్ ను సొంతం చేసుకోవడంతో పాటు పలు కొత్త రికార్డులు క్రియేట్ చేస్తుండటంతో థమన్ క్రేజ్ కూడా బాగా పెరిగింది. సినిమాకు తన పాటలతోనే సగం హైప్ తెచ్చేస్తున్నాడు. ఇక మహేష్..పరశురామ్ దర్శకత్వంలో వస్తున్న సర్కారు వారి పాట సినిమాకు కూడా థమన్ సంగీతం అందిస్తున్న సంగతి తెలిసిందే కదా. ఈ సినిమాకు కూడా సాలిడ్ పాటలు, మ్యూజిక్ అందిస్తున్నాడన్న విషయం ఇప్పటికే రిలీజ్ అయిన పాటలు, బ్లాస్టర్ వీడియోలను బట్టి చెప్పొచ్చు. మొదట రిలీజ్ అయిన కళావతి పాటకు అయితే ఓ రేంజ్ లో రెస్పాన్స్ వచ్చింది. ఆ తర్వాత రిలీజ్ అయిన పెన్నీ సాంగ్ అలానే టైటిల్ సాంగ్ కూడా బాగా ఆకట్టుకున్నాయి. మరి అలాంటి అవుట్ పుట్ ఇస్తే ఏ డైరెక్టర్ అయినా హ్యాపీగానే ఉంటాడు కదా. ఇప్పుడు తన వర్క్ తో పరుశురాం కూడా హ్యాపీ అంటున్నాడు థమన్
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈసినిమాకు సంబంధించి ఏదో ఒక అప్ డేట్ ఇస్తూనే ఉన్నాడు థమన్. తన పాటల గురించి అలానే వర్క్ గురించి తన ట్విట్టర్ ద్వారా ఏదో ఒకటి షేర్ చేస్తూనే ఉంటాడు. ఇక తాజాగా తన ట్విట్టర్ ద్వారా పరుశురాం తనతో ఉన్న ఫొటోను షేర్ చేస్తూ.. డైరెక్టర్ హ్యాపీ ఆరోజు కంటే బెటర్ ఇంకేం ఉంటుంది.. సర్కారు వారి పాట వర్క్ ఫుల్ స్వింగ్ లో ఉంది.. మరిన్ని అప్ డేట్స్ వస్తాయి అంటూ తన ట్వీట్ లో పేర్కొన్నారు.
What a start for the day !! When Ur director is Super Happy !! 🎬🔥❤️🎛 #SarkaaruVaariPaataBgm Works On full swing 🧨 #SuperStarShining 😍
More updates ON THE WAY !! Big Bang On #May12 #SvpOnMay12th 🚀🚀🚀🚀🚀
Let’s make the Way for our dear #SuperStar @urstrulyMahesh gaaru ❤️ pic.twitter.com/oITFt3vlpU
— thaman S (@MusicThaman) April 28, 2022
కాగా ఈసినిమాలో కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తుండగా.. వెన్నెల కిషోర్, సముద్రఖని కూడా ముఖ్య పాత్రలలో కనిపించనున్నారు. మైత్రీ మూవీ మేకర్స్, GMB ఎంటర్టైన్మెంట్ మరియు 14 రీల్స్ ప్లస్ బ్యానర్లపై నవీన్ యెర్నేని, వై. రవిశంకర్, రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. థమన్ సంగీతం అందిస్తుండగా.. ఆర్ మధి సినిమాటోగ్రఫీ, ఏ ఎస్ ప్రకాష్ ఆర్ట్ డైరెక్టర్ గా పనిచేస్తున్నారు.




[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: