యంగ్ హీరో ‘నిఖిల్’ తండ్రి కన్నుమూత

Actor Nikhils Father Passed Away,Nikhil Siddhartha’s Father Shyam Siddhartha Passed Away,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, Nikhil,Hero Nikhil,Nikhil Telugu Movie Updates,Nikhil Upcoming Movies,Nikhil Latest News,Nikhil Movie News,Nikhil Siddhartha,Nikhil Siddhartha Fater Shyam Siddhartha Passes, Hero Nikhil Father Shyam Siddhartha Passed Away,Nikhil Father Passed Away,Nikhil Father passed Away Today,Tollywood Celebrities Sending condolences to Nikhil and His Family

టాలీవుడ్ లో గత కొంతకాలంగా ఏదో ఒక విషాదం చోటుచేసుకుంటూనే ఉంది. ఈమధ్య సెలబ్రిటీల మరణవార్తలను ఎక్కువగా వినాల్సి వస్తుంది. ఇప్పటికే చాలామంది ప్రముఖులను కోల్పోయింది చిత్రపరిశ్రమ. రీసెంట్ గానే ప్రముఖ నిర్మాత నారాయణ్ దాస్ కె నారంగ్ కన్ను మూశారు. ఇక ఇప్పుడు మరో యంగ్ హీరో ఇంట్లో విషాదం చోటుచేసుకుంది. యంగ్ హీరో నిఖిల్ తండ్రి శ్యామ్ సిద్ధార్థ‌ కన్నుమూశారు. గ‌త కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధ‌ప‌డుతున్న ఆయన హైదరాబాదులోని నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. అయితే పరిస్థితి కాస్త విషమించడంతో నేడు తుదిశ్వాస విడిచారు. మరోవైపు నిఖిల్ తండ్రి చనిపోవడంపై పలువురు సినీ ప్రముఖులు విచారం వ్యక్తం చేస్తున్నారు.. నిఖిల్ కుటుంబానికి సంతాపాన్ని తెలియచేస్తున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

కాగా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన హ్యాపీ డేస్ సినిమాతో తెలుగు సినీ పరిశ్రమలో అడుగుపెట్టాడు నిఖిల్. మొదటి సినిమాతోనే తన ఎనర్జిటిక్ నటనతో అందరిని ఆకట్టుకున్నాడు. ఇక ఆతరువాత హీరోగా పలు సినిమాల్లో నటించినా సరైన ఫలితం అందించలేకపోయాయి. అయితే స్వామిరారా సినిమాతో మళ్లీ ట్రాక్ లోకి వచ్చి ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. ప్రస్తుతం నిఖిల్ కార్తికేయ 2, 18 పేజెస్ చిత్రాల్లో నటిస్తున్నాడు. ఈరెండు సినిమాలు కూడా రిలీజ్ కు సిద్దమవుతున్నాయి. ఇక ఇటీవలే ‘స్పై’ టైటిట్‌తో ఓ పాన్ ఇండియా సినిమాను కూడా ప్రకటించిన సంగతి తెలిసిందే.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here