పీపుల్ మీడియా ఫ్యాక్టరీ , అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్స్ పై చందు మొండేటి దర్శకత్వంలో నిఖిల్ హీరోగా సూపర్ హిట్ థ్రిల్లింగ్ మిస్టరీ కార్తికేయ మూవీ కి సీక్వెల్ గా తెరకెక్కిన కార్తికేయ 2 మూవీ ఆగస్ట్ 13 వ తేదీ తెలుగు , హిందీ భాషలలో భారీ అంచనాలతో రిలీజ్ అయ్యి సూపర్ హిట్ టాక్ తో , భారీ కలెక్షన్స్ సాధించిన విషయం తెలిసిందే. ఈ మూవీలో అనుపమ పరమేశ్వరన్ కథానాయిక. ఈ మూవీ కి కాలభైరవ సంగీతం అందించారు.హీరో నిఖిల్ , హీరోయిన్ అనుపమ అద్భుతంగా పెర్ఫార్మ్ చేసిన కార్తికేయ 2 మూవీ 3 రోజులలో బ్రేక్ ఈవెన్ సాధించింది. ఓవర్ సీస్ తో పాటు , నార్త్ లో కూడా అద్భుత రెస్పాన్స్ అందుకున్న కార్తికేయ 2 మూవీ ప్రపంచవ్యాప్తం గా 130కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టింది. బాలీవుడ్ లో 30 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టడం విశేషం.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
దర్శకుడు చందు మొండేటి. ఇప్పటికే ఒక పాయింట్ తో కథ రెడీ చేస్తున్నారనీ ,కార్తికేయ 2 ని నిర్మించిన అభిషేక్ అగర్వాల్ , విశ్వప్రసాద్ నే కార్తికేయ 3 నిర్మించనున్నారని సమాచారం. కార్తికేయ 2 అంత సక్సెస్ అవ్వడానికి రీజన్స్ అందులో ఉన్న కృష్ణతత్వం, అలాగే ట్రెజర్ హంట్ సీక్వెన్స్ . ఈ రెండూ చిత్ర విజయంలో కీలక పాత్ర పోషించాయి. మరి కార్తికేయ 3 లో అలాంటి డెవోషనల్ పాయింట్ తో పాటు ఎగ్జైటింగ్ గా చూడగలిగే స్క్రీన్ ప్లే వర్కౌట్ అయితే మరోసారి నిఖిల్ చందూ కాంబో మరోసారి మంచి వసూళ్ళు రాబట్టే అవకాశం ఉంది.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: