పాన్ ఇండియాగా విరూపాక్ష- టైటిల్ గ్లింప్స్ కు డేట్ ఫిక్స్

Date Fixed For Virupaksha Movie Title Glimpse In Other Languages, Virupaksha Movie Title Glimpse In Other Languages, Virupaksha Movie In Other Languages, Date Fixed For Virupaksha Movie, Sai Dharam Tej, Samyuktha Menon, Sukumar, B.Ajaneesh Loknath, Karthik Dandu, Sai Dharam Tej Movies, Sai Dharam Tej Latest Movie, Sai Dharam Tej Upcoming Movie, Virupaksha, Virupaksha 2023, Virupaksha Movie, Virupaksha Update, Virupaksha Latest News, Virupaksha Telugu Movie, Virupaksha Movie Live Updates, Virupaksha Movie Latest News And Updates, Telugu Filmnagar, Telugu Film News 2022, Tollywood Movie Updates, Latest Tollywood Updates, Latest Telugu Movies News

మెగా ఫ్యామిలీ నుండి ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చినా తన సినిమాలతో తనకుంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నాడు సాయి తేజ్. గత ఏడాది రిపబ్లిక్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సాయి తేజ్ ప్రస్తుతం మరో థ్రిల్లర్ సినిమాతో రాబోతున్నాడు. కార్తీక్ దండు దర్శకత్వంలో సాయి తేజ్ హీరోగా ఒక సినిమా వస్తున్న సంగతి తెలిసిందే. మిస్టరీ థ్రిల్లర్ నేపథ్యంలో ఈసినిమా తెరకెక్కుతుంది. ప్రస్తుతం ఈసినిమా షూటింగ్ ను పూర్తి చేసుకుంటుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

రీసెంట్ గానే ఈసినిమా తెలుగు టైటిల్ గ్లింప్స్ ను రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే కదా. విరూపాక్ష అనే టైటిల్ ను ఫిక్స్ చేశారు. ఎన్టీఆర్ వాయిస్ ఓవర్ అందించిన ఈ టైటిల్ గ్లింప్స్ సూపర్ రెస్పాన్స్ ను సొంతం చేసుకుంది. అయితే ఈసినిమాను పాన్ ఇండియా రేంజ్ లో రిలీజ్ చేస్తున్నారు. ఈనేపథ్యంలో మిగిలిన భాషల్లో ఈసినిమా టైటిల్ గ్లింప్స్ రిలీజ్ కు డేట్ ను కూడా ఫిక్స్ చేశారు. దీనికి సంబంధించిన అప్ డేట్ ను తాజాగా ఇచ్చారు మేకర్స్. ఈసినిమా తమిళ్, కన్నడ, మలయాళం ఇంకా హిందీ భాషల టైటిల్స్ గ్లింప్స్ ను 14వ తేదీన ఉదయం 10 గంటల 30 నిమిషాలకు రిలీజ్ చేస్తున్నట్టు తెలిపారు.

కాగా ఈసినిమాలో సంయుక్త మీనన్ కథానాయిక గా నటిస్తుంది. ఇంకా ఈసినిమాలో బ్రహ్మాజీ, అజయ్, సునీల్ తదితరులు పలు కీలకపాత్రల్లో నటిస్తున్నారు. ఇక ఈ సినిమాకు సుకుమార్ స్క్రీన్ ప్లే అందిస్తుండగా.. శ్రీ వెంక‌టేశ్వ‌ర సినీ చిత్ర, సుకుమార్ రైటింగ్స్ బ్యాన‌ర్లు సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నాయి. ఈసినిమాకు కాంతార సెన్సేషన్ అంజనీష్ లోక్ నాథ్ సంగీతం అందించనున్నారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.