ధమాకా ట్రైలర్ రిలీజ్ టైమ్ ఫిక్స్

Ravitejas Dhamaka Movie Trailer Release Time Fixed, Dhamaka Movie Trailer Release Time Fixed, Dhamaka Movie Trailer, Raviteja's Dhamaka Movie, Mass MahaRaja Ravi Teja, Ravi Teja, Sreeleela, Rao Ramesh, Jayaram, Tanikella Bharani, Bheems Ceciroleo Trinadha Rao Nakkina, Ravi Teja Movies, Ravi Teja Latest Movie, Ravi Teja Upcoming Movie, Dhamaka, Dhamaka 2022, Dhamaka Movie, Dhamaka Update, Dhamaka Latest News, Dhamaka Telugu Movie, Dhamaka Movie Live Updates, Dhamaka Movie Latest News And Updates, Telugu Filmnagar, Telugu Film News 2022, Tollywood Movie Updates, Latest Tollywood Updates, Latest Telugu Movies News

క్రాక్ లాంటి బ్లాక్ బస్టర్ హిట్ తరువాత ఆరేంజ్ హిట్ మళ్లీ మాస్ మహారాజా రవితేజకు దక్కలేదు. ప్రస్తుతం అయితే ఆశలన్నీ రాబోతున్న ధమాకా మీదనే ఉన్నాయి. యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈసినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. ఈసినిమా డిసెంబర్‌ 23న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక రిలీజ్‌ డేట్‌ దగ్గర పడుతుండటంతో చిత్రయూనిట్ వరుస అప్‌డేట్‌లను ఇస్తూ సినిమాపై మంచి బజ్‌ క్రియేట్‌ చేస్తున్నారు. దీనిలోభాగంగానే ఇప్పటికే రిలీజ్ అయిన పాటలు, టీజర్ లు సినిమాపై అంచనాలు మరింత పెంచాయి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇదిలా ఉండగా ఈసినిమా నుండి ట్రైలర్ ను కూడా రిలీజ్ చేయడానికి సిద్దంగా ఉన్నారు. ట్రైలర్ రిలీజ్ డేట్ ను కూడా ఫిక్స్ చేస్తూ ఇప్పటికే ప్రకటన కూడా ఇచ్చారు మేకర్స్. ఈనెల 15వ తేదీన ట్రైలర్ రిలీజ్ చేస్తున్నట్టు తెలిపారు. ఇక తాజాగా రిలీజ్ టైమ్ కూడా ఫిక్స్ చేస్తూ మరో అప్ డేట్ ఇచ్చారు. 15వ తేదీన సాయంత్రం 6 గంటల 45 నిమిషాలకు ట్రైలర్ ను రిలీజ్ చేస్తున్నట్టు ప్రకటించారు.

నక్కిన త్రినాథరావు దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాలో ఈసినిమాలో పెళ్లి సందడి సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్న నటి శ్రీలీల ఈ సినిమాలో రవితేజ సరసన హీరోయిన్‌గా నటిస్తోంది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్స్ పై ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమాకి భీమ్స్ సంగీతం అందిస్తున్నాడు. ఈ సినిమాకు ప్రసన్న కుమార్‌ బెజవాడ కథ, మాటలు అందిస్తున్నారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

one × three =