బ్లాక్ బస్టర్ ఆర్ఆర్ఆర్ మూవీలో అల్లూరి సీతారామరాజుగా అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను ఆకట్టుకుని మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందారు. రామ్ చరణ్ ప్రస్తుతం భారీ చిత్ర దర్శకుడు శంకర్ ఎస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న#RC15 మూవీ లో నటిస్తున్నారు. రామ్ చరణ్ తాజాగా అహ్మదాబాద్ లో జరిగే ఒక ఆధ్యాత్మిక కార్యక్రమానికి ప్రత్యేక ఆహ్వానం అందుకున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
అహ్మదాబాద్‌లోని ఒగనాజ్‌లో జరిగే ప్రముఖ స్వామి మహరాజ్ శతాబ్ది మహోత్సవానికి సన్నాహాలు పూర్తయ్యాయి. పీఎస్‌ఎమ్ 100 పేరుతో నిర్వహించనున్న ఈ ఉత్సవాలకు దేశ, విదేశాల నుండి వివిధ రంగాలకు చెందిన పలువురు ప్రముఖులు హాజరుకానున్నారు. బుధవారం (డిసెంబర్ 14) నుంచి ఈ ఉత్సవాలు ప్రారంభంకానున్నాయి. BAPS అధినేత మహంత్ స్వామి సమక్షంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము స్వామి మహారాజ్ శతాబ్ది ఉత్సవాలను ప్రారంభించనున్నారు. ఈ ఉత్సవాలకు సంబంధించి ఇప్పటికే ప్రధాని నరేంద్ర మోదీ, ముఖేశ్ అంబానీలతో సహా పలువురు దక్షిణాది ప్రముఖులకు ఆహ్వానాలు వెళ్లాయి. కాగా ఈ ఉత్సవాల ప్రత్యేక ఆహ్వానితుల జాబితాలో మెగా పవర్‌స్టార్ రామ్‌చరణ్ కూడా ఉన్నారు. ఈ సందర్భంగా స్వామీజీలు హైదరాబాద్ వచ్చి స్వయంగా రామ్ చరణ్ ను కలిసి పీఎస్‌ఎమ్ 100 ఉత్సవాలకు హాజరుకావాలని ఆహ్వానించారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: