దర్శకుడు రాజమౌళి , కీరవాణి లకు ప్రభాస్ అభినందనలు
Prabhas Congratulates SS Rajamouli & MM Keeravani

డివివి ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై స్టార్ డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోలుగా భారీ బడ్జెట్, భారీ తారాగణంతో తెరకెక్కిన పీరియాడికల్ యాక్షన్ డ్రామా రౌద్రం రణం రుధిరం మూవీ మార్చి 25 వ తేదీ రిలీజ్ అయ్యి ఘనవిజయం సాధించి , ప్రపంచవ్యాప్తంగా 1140కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించింది. మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు పాత్రలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, గోండు వీరుడు కొమురం భీమ్ గా ఎన్టీఆర్ తమ పవర్ ఫుల్ యాక్టింగ్ టాలెంట్ తో ప్రేక్షకులను అలరించారు. ఆర్ఆర్ఆర్ మూవీ పై హాలీవుడ్ ప్రముఖులు ప్రశంసలు కురిపించిన విషయం తెలిసిందే.
ఆర్ ఆర్ ఆర్ మూవీ ని అద్భుతంగా తెరకెక్కించిన రాజమౌళి బెస్ట్ డైరెక్టర్ గా న్యూయార్క్ ఫిల్మ్ క్రిటిక్స్ సర్కిల్ అవార్డ్ , L A ఫిల్మ్ క్రిటిక్స్అవార్డ్ గెలుచుకున్నందుకు , ఈ మూవీ అద్భుతమైన సంగీతాన్ని అందించిన కీరవాణి బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ గా L A ఫిల్మ్ క్రిటిక్స్అవార్డ్ గెలుచుకున్నందుకు వారిద్దరికీ హీరో ప్రభాస్ సోషల్ మీడియా ద్వారా అభినందనలు తెలిపారు. రాజమౌళి దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా తెరకెక్కిన ఛత్రపతి , బాహుబలి, బాహుబలి 2 మూవీస్ ఘనవిజయం సాధించిన విషయం తెలిసిందే.








