
ట్యాగ్ · 4407 కథనాలు · పేజీ 133


"పక్కా కమర్షియల్" ప్రెస్ మీట్

సాగర తీరాన అనసూయ ఎంజాయ్

6 మిలియన్ క్లబ్ లోకి ఎన్టీఆర్..!

చిరంజీవి బ్యాక్ టు వర్క్

'మేజర్' పై అనుష్క ప్రశంసలు..!

గ్లోబల్ మూవీ గా "ఆర్ ఆర్ ఆర్ "

'మేజర్' ఫస్ట్ డే కలెక్షన్..!

సెన్సార్ పూర్తి చేసుకున్న 'అంటే సుందరానికీ'

హీరో హీరోయిన్లదే ఆ బాధ్యత..!

100 కోట్ల క్లబ్ దిశగా "F 3"

"మేజర్" మూవీపై మహేష్ బాబు స్పందన

'మెగాస్టార్' తో సినిమా రూమర్స్ పై క్లారిటీ..!

'విరాట పర్వం' ట్రైలర్ రిలీజ్ డేట్ ఫిక్స్

"కొండా" మూవీ ట్రైలర్ 2 రిలీజ్

అట్లీ-షారుక్ మూవీ టైటిల్ రిలీజ్..!

'మేజర్' హార్ట్ టచింగ్ ఫిలిం
ప్రస్తుతం ఎక్కడ చూసినా మేజర్ సినిమా గురించే వినిపిస్తుంది. అడివి శేష్ హీరోగా ఈసినిమా తెరకెక్కగా నిన్న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ముంబైలో జరిగిన ఉగ్రదాడుల్లో వీర మరణం పొందిన మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవిత కథ ఆధారంగా ఈ సినిమా తెరకెక్కడంతో మొదటి నుండీ ఈసినిమాపై అందరికీ ఆసక్తి ఉంది. సందీప్ ఉన్ని కృష్ణన్ జీవితాన్ని చాలా బాగా చూపించినందుకు అందరూ మేజర్ టీమ్ ను ప్రశంసిస్తున్నారు. హోటల్ తాజ్ పై ఉగ్రదాడి.. ప్రాణాలకు తెగించి హీరో ముందుకు వెళ్లే సీన్స్ ఆడియన్స్ కి గూస్ బంప్స్ తెప్పిస్తున్నాయి. సందీప్ పేరెంట్స్ గా చేసిన ప్రకాష్ రాజ్, రేవతి కూడా తమ పాత్రల్లో ఒదిగిపోయి చేశారు కాబట్టి ప్రతిఒక్క పాత్రకు…

"పక్కా కమర్షియల్" ప్రెస్ మీట్
మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సమర్పణ లో GA 2 పిక్చర్స్ , యు వి క్రియేషన్స్ బ్యానర్స్ పై మారుతి దర్శకత్వంలో యాక్షన్ చిత్ర హీరో గోపీచంద్ , అందాల రాశీ ఖన్నా జంటగా తెరకెక్కిన "పక్కా కమర్షియల్" మూవీ జులై 1 వ తేదీ రిలీజ్ కానుంది. సత్యరాజ్ , అనసూయ , రావు రమేష్ , సప్తగిరి ముఖ్య పాత్రలలో నటించారు. జాక్స్ బిజోయ్ సంగీతం అందించారు. "పక్కా కమర్షియల్" మూవీ జులై 1 వ తేదీ విడుదల సందర్భంగా చిత్ర యూనిట్ హైదరాబాద్ లో నిన్న మీడియా సమావేశం నిర్వహించింది.

సాగర తీరాన అనసూయ ఎంజాయ్
సక్సెస్ ఫుల్ యాంకర్ గా బుల్లితెర ప్రేక్షకులను అలరిస్తున్న అనసూయ పలు మూవీ కమిట్ మెంట్స్ తో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. నటనకు ప్రాధాన్యత ఉన్న మూవీస్ ఎంపిక చేసుకుంటున్న టాలెంటెడ్ యాక్ట్రెస్ అనసూయ ప్రస్తుతం “రంగమార్తాండ “,“ఫ్లాష్ బ్యాక్ ”, “పక్కా కమర్షియల్ ” “గాడ్ ఫాదర్ ” , “మైఖేల్ “, "వాంటెడ్ పండుగాడ్ " మూవీస్ లో కీలక పాత్రలలో నటిస్తున్నారు."పుష్ప :ది రూల్ "మూవీ లో అనసూయ నటించనున్నారు. మమ్ముట్టి హీరోగా తెరకెక్కిన సూపర్ హిట్ “భీష్మ పర్వం “ మూవీ తో అనసూయ మలయాళ చిత్ర పరిశ్రమకు పరిచయం అయ్యారు.

6 మిలియన్ క్లబ్ లోకి ఎన్టీఆర్..!
సినిమాలపై సోషల్ మీడియా ప్రభావం ఎంత ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సినిమాలకు, ఫ్యాన్స్ కు మధ్య సోషల్ మీడియా వారధిలాగ పనిచేస్తుంది. ఇక సినిమా టీజర్, ట్రైలర్, పాటలకు ఎలాగైతే సోషల్ మీడియా రికార్డులు, లెక్కలు ఉంటాయో స్టార్ హీరోల ఫాలోవర్స్ లో కూడా పోటీ ఉంటుంది. అందులోనూ స్టార్ హీరోల విషయంలో అయితే ఈపోటీ మరీ ఎక్కువ ఉంటుంది. ఇప్పటికే టాలీవుడ్ లో ఉన్న స్టార్ హీరోలు మిలియన్ల ఫాలోవర్స్ తో కొత్త కొత్త రికార్డులు క్రియేట్ చేస్తున్నారు.

చిరంజీవి బ్యాక్ టు వర్క్
మెగా స్టార్ చిరంజీవి హీరోగా మోహన్ రాజా దర్శకత్వంలో “గాడ్ ఫాదర్ “, మెహెర్ రమేష్ దర్శకత్వంలో “భోళా శంకర్ “, బాబీ (కేఎస్ రవీంద్ర) దర్శకత్వం లో “చిరంజీవి 154 “మూవీ సెట్స్ పైన ఉన్నాయి. చిరంజీవి ఒకే సారి ఈ మూడు సినిమాలలో నటించడం విశేషం. ఈ మూవీస్ కాకుండా వెంకీ కుడుముల దర్శకత్వంలో ఒక మూవీ, సీనియర్ హీరోయిన్ రాధిక స్వంత బ్యానర్ రాడాన్ మీడియా వర్క్స్ లో ఒక మూవీ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. చిరంజీవి హీరోగా పలు మూవీస్ చర్చల దశలో ఉన్నాయని సమాచారం.

ప్రశాంత్ నీల్ బర్త్ డే వేడుకల్లో పాన్ ఇండియా స్టార్స్
సక్సెస్ ఫుల్ " ఉగ్రం" మూవీతో కన్నడ చిత్ర పరిశ్రమకు దర్శకుడిగా పరిచయం అయిన ప్రశాంత్ నీల్, బ్లాక్ బస్టర్"కె జి ఎఫ్ చాప్టర్ 1" , "కె జి ఎఫ్ చాప్టర్ 2 "మూవీస్ తో స్టార్ డైరెక్టర్ గా మారారు. దర్శకుడు ప్రశాంత్ నీల్ మేకింగ్ స్టైల్ టాలీవుడ్ స్టార్ హీరోలను, నిర్మాతలను ఎంతగానో ఆకట్టుకుంది. అందుకే, ఆయనతో ప్రముఖ నిర్మాణ సంస్థలు, స్టార్ హీరోలు సినిమా చేసేందుకు రెడీ అవుతున్నారు. ఇప్పటికే, హోంబలే ఫిల్మ్స్ బ్యానర్ పై ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా తెలుగు , కన్నడ భాషలలో "సలార్" మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ లో యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ హీరోగా…

'మేజర్' పై అనుష్క ప్రశంసలు..!
టాలీవుడ్ టాలెండ్ నటుడు అడివి శేష్ మరోసారి తన ప్రత్యేకతను చాటుకున్నాడు. ఇప్పటికే అడివి శేష్ అంటే డిఫరెంట్ కథలను ఎంచుకుంటాడని.. రొటీన్ కు భిన్నంగా ఉండే సినిమాలను చేస్తాడన్న పేరు ఉంది. అందుకే తను చేసిన సినిమాలన్నీ విజయాలను అందుకున్నాడు. ఇప్పుడు మేజర్ తో మరో హిట్ ను తన ఖాతాలో వేసుకున్నాడు. 26/11 ముంబై ఉగ్ర దాడిలో ప్రజలను రక్షించడానికి తన ప్రాణాలను పణంగా పెట్టిన మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవితం ఆధారంగా రూపొందిన చిత్రమిది. ఈ సినిమాతో సందీప్ ఉన్ని కృష్ణన్ జీవితాన్ని మాత్రమే కాదు.. దేశంకోసం ప్రాణాలకు సైతం తెగించే వీరులు ఎంత మంది ఉన్నారో కూడా గుర్తు చేశారు. ప్రివ్యూల నుండే ఈసినిమా మంటి టాక్…

గ్లోబల్ మూవీ గా "ఆర్ ఆర్ ఆర్ "
డివివి ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై స్టార్ డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ , అలియా భట్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ , ఒలీవియా మోరిస్ జంటలుగా భారీ బడ్జెట్ , భారీ తారాగణం తో తెరకెక్కిన హై ఎమోషనల్ యాక్షన్ ఎంటర్ టైనర్ “రౌద్రం రణం రుధిరం ” మూవీ మార్చి 25 వ తేదీ ప్రపంచవ్యాప్తంగా 10,000కు పైగా స్క్రీన్స్ లో రిలీజ్ అయ్యి సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుని అన్ని భాషలలోనూ భారీ కలెక్షన్స్ సాధిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా 1,130 కోట్ల రూపాయల కి పైగా గ్రాస్ కలెక్షన్స్ తో దూసుకుపోతోంది.

'మేజర్' ఫస్ట్ డే కలెక్షన్..!
శశి కిరణ్ తిక్క దర్శకత్వంలో అడివి శేష్ హీరోగా వచ్చిన సినిమా మేజర్. ఈసినిమా నిన్న రిలీజ్ అయి ప్రేక్షకుల ముందుకు వచ్చింది. నిజానికి సినిమా రిలీజ్ చేసేముందు ప్రివ్యూ లు వేయడం కామనే. కాని రిలీజ్ కు ఒకటి లేదా రెండు రోజుల ముందు అదికూడా సెలబ్రిటీలకు వేయడం జరుగుతుంది. కానీ మేజర్ టీమ్ మాత్రం రిలీజ్ కు వారం రోజుల ముందు నుండే ప్రివ్యూలు వేశారంటేనే అర్థం చేసుకోవచ్చు ఈసినిమాపై ఎంత నమ్మకంతో ఉన్నారో. ఇక ఆ నమ్మకానికి తగ్గట్టే రెస్పాన్స్ వస్తుంది. సందీప్ ఉన్ని కృష్ణన్ గా అడివి శేష్ చాలా బాగానటించాడని..అడివి శేష్ నటన, శశికిరణ్ టేకింగ్‌పై విమర్శకులు సైతం ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు.

సెన్సార్ పూర్తి చేసుకున్న 'అంటే సుందరానికీ'
న్యాచురల్ స్టార్ నాని కామెడీ టైమింగ్ ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అందుకే ఫ్యాన్స్ కూడా నానిని సీరియస్ రోల్స్ లో కంటే కామెడీ ఎంటర్ టైనర్స్ లో నటించడానికి ఎక్కువ ఇష్టపడతారు. అయితే మొదటి నుండి కాస్త కామెడీ ఎంటర్ టైనర్ లతోనే అలరించిన నాని ఈమధ్య కాస్త రూట్ మార్చి సీరియస్ మోడ్ లోకి వచ్చాడు. అయితే నాని ఫుల్ లెంగ్త్ సీరియస్, కంపోజ్డ్ పాత్రలు సినీ ప్రేక్షకులకు కూడా కనెక్ట్ కాలేదు. అందుకే ఆ మధ్య వచ్చిన వి, టక్ జగదీష్ లాంటి సినిమాలు ఏవరేజ్ హిట్ లు అందుకున్నాయి. ఇక రీసెంట్ గా వచ్చిన శ్యామ్ సింగ రాయ్ కూడా కాస్త సీరియస్ మోడ్ ఉన్న సినిమానే కానీ కథ కొంచం డిఫరెంట్ గా ఉండటంతో హిట్ అయిపోయింది.

హీరో హీరోయిన్లదే ఆ బాధ్యత..!
ఇండస్ట్రీలో యంగ్ హీరోల హవా ఎక్కువైన తరువాత కొంతమంది హీరోలు మాత్రం వెనుకబడిపోయారని చెప్పొచ్చు. ఒకపక్క కుర్రహీరోలు కొత్త కొత్త కథలతో హిట్లు అందుకుంటూ వరుస సినిమాలతో దూసుకుపోతుంటే మరోపక్క కొంత మంది హిట్ కోసం చాలా కష్టపడాల్సి వస్తుంది. ఆ లిస్ట్ లో చాలామంది హీరోలే ఉండగా అందులో గోపీచంద్ కూడా ఒకరు. ఒకప్పుడు వరుస విజయాలు అందుకున్న గోపీచంద్ ఇప్పుడు ఒక్క హిట్ కోసం చాలా కష్టపడాల్సి వస్తుంది. ఆమధ్య ఏ సినిమా తీసినా బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టాయి. రీసెంట్ గా వచ్చిన సీటీమార్ తోనే చాలా కాలం తరువాత హిట్ ను తన ఖాతాలో వేసుకున్నాడు. ఇక ఇప్పుడు తన ఆశ పక్కా కమర్షియల్ సినిమాపై ఉంది.

100 కోట్ల క్లబ్ దిశగా "F 3"
శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై సక్సెస్ ఫుల్ చిత్ర దర్శకుడు అనిల్ రావిపూడి దర్శకత్వంలో వెంకటేష్, వరుణ్ తేజ్ , తమన్నా , మెహరీన్ ప్రధాన పాత్రలలో బ్లాక్ బస్టర్ “F 2:ఫన్ &ఫ్రస్టేషన్ ” మూవీ సీక్వెల్ గా తెరకెక్కిన “F 3” మూవీ 27 వ తేదీ రిలీజ్ అయ్యి ఘనవిజయం సాధించింది. ఈ మూవీ లో సోనాల్ చౌహాన్, సునీల్ కీలక పాత్రలలో నటించారు. స్టార్ హీరోయిన్ పూజా హెగ్డే ఒక స్పెషల్ సాంగ్ లో నటించారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు.హీరో వెంకటేష్ తన కామెడీ టైమింగ్‌తో మరోసారి ఈ సినిమాకే హైలెట్ గా నిలిచారు. ఫ్యామిలీ సీన్స్, మనీ ఫ్రస్ట్రేషన్ సీన్స్ ప్రేక్షకులను అలరించాయి.

"మేజర్" మూవీపై మహేష్ బాబు స్పందన
సోనీ పిక్చర్ ఇండియా , జి ఎమ్ బి ఎంటర్ టైన్ మెంట్ , A +S మూవీస్ బ్యానర్స్ పై శశి కిరణ్ తిక్క దర్శకత్వంలో అడివి శేష్, సయీ మంజ్రేకర్ జంటగా మేజర్ సందీప్ ఉన్ని కృష్ణన్ జీవిత చరిత్ర ఆధారంగా తెలుగు , హిందీ భాషలలో తెరకెక్కిన ఎమోషనల్ డ్రామా “మేజర్” మూవీ 3 వ తేదీ రిలీజ్అయ్యి ప్రేక్షక , విమర్శకుల ప్రశంసలు అందుకుని సూపర్ హిట్ టాక్ తో దూసుకుపోతోంది. మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ పాత్రలో అడివిశేష్ తన కెరీర్ బెస్ట్ ఫర్ఫార్మెన్స్ అందించారు. అడివి శేష్ కు జోడీగా నటించిన సయీ మంజ్రేకర్ అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. అడివి శేష్ , సయీ ల స్క్రీన్ కెమిస్ట్రీ ప్రేక్షకులను అలరించింది.USA లో…

'మెగాస్టార్' తో సినిమా రూమర్స్ పై క్లారిటీ..!
ఇటీవలే మెగాస్టార్ ఆచార్య సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి అలరించాడు చిరంజీవి. ఇక ప్రస్తుతం తన నెక్ట్స్ ప్రాజెక్ట్ లపై దృష్టి పెట్టాడు. మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్రలో మోహన్ రాజా దర్శకత్వంలో వస్తున్న సినిమా గాడ్ ఫాదర్. మలయాళంలో బ్లాక్ బస్టర్ అయిన ‘లూసిఫర్’ ను గాడ్ ఫాదర్ గా రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇంకా దీనితో పాటు మెహర్ రమేష్ దర్శకత్వంలో భోళాశంకర్ సినిమా ఇంకా బాబితో మరో సినిమా చేస్తున్నాడు. ఈసినిమాలు అన్నీ షూటింగ్ దశలోనే ఉన్నాయి.

'విరాట పర్వం' ట్రైలర్ రిలీజ్ డేట్ ఫిక్స్
వేణు ఉడుగుల దర్శకత్వంలో రానా, సాయిపల్లవి జంటగా నటిస్తున్న సినిమా విరాట పర్వం. ఈసినిమా షూటింగ్ ఎప్పుడో పూర్తయింది కానీ రిలీజ్ మాత్రం అవ్వలేదు. ఈసినిమా ఎన్నో సార్లు వాయిదా పడిన తరువాత ఫైనల్ గా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. నక్సలిజం నేపథ్యంలో ఈసినిమా తెరకెక్కుతుండగా రవన్న పాత్రలో రానా నటిస్తున్నాడు. ఇక ఫైనల్ గా ఈసినిమా జూన్ 17న విడుదల కానుంది. ఈ క్రమంలో చిత్ర బృందం వరుస అప్‌డేట్లతో ప్రేక్షకులను అలరిస్తున్నారు. ఇప్పటికే వరుసగా పాటలు రిలీజ్ చేస్తుండగా.. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్ విడుదల తేదీని మేకర్స్ ప్రకటించారు. జూన్ 5న విడుదల చేయనున్నట్లు మేకర్స్ వెల్లడించారు.

'కీర్తి సురేష్' ఎమోషనల్ నోట్.. ధైర్యంగా ముందుకు వెళతా..!
నేను శైలజ సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది కీర్తి సురేష్. అయితే కీర్తి సురేష్ కు కూడా సక్సెస్ రేట్ కాస్త తక్కువనే చెప్పొచ్చు. సినిమా అవకాశలకు అయితే మాత్రం ఎలాంటి కొదువలేదు కానీ విజయాల కంటే అపజయాలే ఎక్కువ సొంతం చేసుకుంది. కానీ మహానటి లాంటి సినిమాతో మాత్రం తనేంటో నిరూపించుకుంది. ఇక మహానటి తరువాత పలు లేడీ ఒరియెంటెడ్ సినిమాలే చేసినా అవి కూడా సక్సెస్ అందించలేకపోయాయి.

"కొండా" మూవీ ట్రైలర్ 2 రిలీజ్
బ్లాక్ బస్టర్ "శివ "మూవీ తో టాలీవుడ్ కు దర్శకుడిగా పరిచయం అయిన రామ్ గోపాల్ వర్మ, " శివ" మూవీ హిందీ రీమేక్ తో బాలీవుడ్ లో దర్శకుడిగా అడుగుపెట్టారు. ఆ మూవీ ఘనవిజయం సాధించింది. టాలీవుడ్ , బాలీవుడ్ లలో పలు బ్లాక్ బస్టర్ మూవీస్ తెరకెక్కించి ఆర్ జి వి ప్రేక్షకులను అలరించిన విషయం తెలిసిందే. రాజకీయనాయకుల బయోపిక్ మూవీస్ , నిజ జీవిత వ్యక్తుల జీవిత చరిత్ర ఆధారంగా కొన్ని మూవీస్ , శృంగార చిత్రాలు తెరకెక్కించి ఆర్ జివి వివాదాస్పద దర్శకుడిగా మారారు. తాజాగా ఆర్ జి వి మరో బయోపిక్ మూవీ తో ప్రేక్షకుల ముందుకు రానున్నారు.

"అంటే .. సుందరానికీ !" మూవీ ప్రతీ ఒక్కరికీ కనెక్ట్ అవుతుంది -నజ్రియా నజీమ్
మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై వివేక్ ఆత్రేయ దర్శకత్వం లో నాని హీరోగా తెరకెక్కిన కామెడీ ఎంటర్ టైనర్ “అంటే .. సుందరానికీ !” మూవీ జూన్ 10 వ తేదీ రిలీజ్ కానుంది. మలయాళ బ్యూటీ నజ్రియా నజీమ్ కథానాయిక . హర్షవర్ధన్ , సుహాస్ , నదియా , రాహుల్ రామకృష్ణ ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. వివేక్ సాగర్ సంగీతం అందిస్తున్నారు. “అంటే సుందరానికీ !”చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ , టీజర్, మేకింగ్ వీడియో, ట్రైలర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుని మూవీ పై అంచనాలను పెంచాయి. ఈ మూవీ తమిళ , మలయాళ భాషలలోనూ రిలీజ్ కానుంది.

ఉపేంద్ర పాన్ ఇండియా మూవీ "UI " పోస్టర్ రిలీజ్
యాక్టర్ , రైటర్ , సింగర్ , ప్రొడ్యూసర్ , డైరెక్టర్ గా పలు బ్లాక్ బస్టర్ మూవీస్ తో ప్రేక్షకులను అలరిస్తూ ఉపేంద్ర కన్నడ చిత్ర పరిశ్రమలో సూపర్ స్టార్ గా రాణిస్తున్నారు. ప్రత్యేక పాత్రలలో అద్భుతంగా పెర్ఫార్మ్ చేస్తూ ఉపేంద్ర తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు. ఉపేంద్ర హీరో గా మూడు కన్నడ సినిమాలు సెట్స్ పైన ఉన్నాయి. హీరో ఉపేంద్ర ఇప్పుడు మరో పాన్ ఇండియా మూవీలో స్వీయ దర్శకత్వంలో హీరోగా నటిస్తున్నారు.

అట్లీ-షారుక్ మూవీ టైటిల్ రిలీజ్..!
కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ అట్లీ వరుస హిట్లతో మంచి ఫామ్ లో ఉన్నాడు. తీసిన నాలుగు సినిమాల్లో మూడు సినిమాలు కూడా స్టార్ హీరో విజయ్ తో చేసినవే. మూడు సినిమాలు కూడా బ్లాక్ బస్టర్ కొట్టాయి. ఇక ఇప్పుడు బాలీవుడ్ లో తన సత్తా చాటడానికి ప్రయత్నిస్తున్నాడు. ఈనేపథ్యంలోనే బాలీవుడ్ బాద్ షాతో చేసే అవకాశం దక్కించుకున్నాడు. ఎప్పుడో కరోనాకు ముందు షారుఖ్-అట్లీ సినిమాని అనౌన్స్ చేశారు. కానీ ఇన్ని రోజులు కరోనా ఉండటం.. మధ్యలో పలు కారణాల వల్ల ఈసినిమా సెట్స్ పైకి వెళ్లడానికి చాలా లేట్ అయింది. ప్రస్తుతం ఈసినిమా షూటింగ్ జరుపుకుంటుంది. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ సినిమాకు ఇంకా టైటిల్ ని అనౌన్స్ చేయలేదు.