సినిమాలపై సోషల్ మీడియా ప్రభావం ఎంత ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సినిమాలకు, ఫ్యాన్స్ కు మధ్య సోషల్ మీడియా వారధిలాగ పనిచేస్తుంది. ఇక సినిమా టీజర్, ట్రైలర్, పాటలకు ఎలాగైతే సోషల్ మీడియా రికార్డులు, లెక్కలు ఉంటాయో స్టార్ హీరోల ఫాలోవర్స్ లో కూడా పోటీ ఉంటుంది. అందులోనూ స్టార్ హీరోల విషయంలో అయితే ఈపోటీ మరీ ఎక్కువ ఉంటుంది. ఇప్పటికే టాలీవుడ్ లో ఉన్న స్టార్ హీరోలు మిలియన్ల ఫాలోవర్స్ తో కొత్త కొత్త రికార్డులు క్రియేట్ చేస్తున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక తాజాగా సోషల్ మీడియాలో కూడా ఎన్టీఆర్ మరో మార్క్ ను సొంతం చేసుకున్నాడు. సోషల్ మీడియాలో ఎన్టీఆర్ కు భారీ ఫాలోయింగ్ ఉన్న సంగతి తెలిసిందే కదా. తాజాగా తన ట్విట్టర్ ఖాతా లేటెస్ట్ గా 6 మిలియన్ మార్క్ కి చేరుకుంది. దీనితో తారక్ 60 లక్షల ట్వీటర్స్ ఫ్యామిలీ లోకి చేరాడు. నిజానికి ఎన్టీఆర్ సోషల్ మీడియాలో పెద్దగా యాక్టీవ్ గా కనిపించడు. తన సినిమాలకు సంబంధించిన అప్ డేట్స్ తప్పా తన సోషల్ మీడియా ద్వారా వ్యక్తిగత విషయాలు పంచుకోడు.
ఇక ఎన్టీఆర్ సినిమాసినిమాల విషయానికొస్తే ఇటీవలే ఆర్ఆర్ఆర్ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ ను కొట్టాడు. ప్రస్తుతం తన లిస్ట్ లో కొరటాల శివతో అలానే ప్రశాంత్ నీల్ తో మరో సినిమా ఉన్నాయి. రీసెంట్ గానే ఎన్టీఆర్ పుట్టిన రోజు సందర్భంగా రెండు సినిమాలకు సంబంధించిన అప్ డేట్స్ వచ్చాయి. త్వరలోనే కొరటాల శివ సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్లనున్నారు. ప్రశాంత్ నీల్ సినిమాను వచ్చే ఏడాది ఏప్రిల్ లో మొదలుపెట్టనున్నారు.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: