మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సమర్పణ లో GA 2 పిక్చర్స్ , యు వి క్రియేషన్స్ బ్యానర్స్ పై మారుతి దర్శకత్వంలో యాక్షన్ చిత్ర హీరో గోపీచంద్ , అందాల రాశీ ఖన్నా జంటగా తెరకెక్కిన “పక్కా కమర్షియల్” మూవీ జులై 1 వ తేదీ రిలీజ్ కానుంది. సత్యరాజ్ , అనసూయ , రావు రమేష్ , సప్తగిరి ముఖ్య పాత్రలలో నటించారు. జాక్స్ బిజోయ్ సంగీతం అందించారు. “పక్కా కమర్షియల్” మూవీ జులై 1 వ తేదీ విడుదల సందర్భంగా చిత్ర యూనిట్ హైదరాబాద్ లో నిన్న మీడియా సమావేశం నిర్వహించింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
మీడియా సమావేశంలో హీరో గోపీచంద్ మాట్లాడుతూ .. “రణం”, “లౌక్యం” మూవీస్ తరవాత.. సినిమా అంతా వినోదం పంచే పాత్ర తనకు దొరకలేదనీ , .”పక్కా కమర్షియల్” మూవీ తో ఆ అవకాశం తనకు వచ్చిందనీ , టైటిల్‌కి తగట్టుగానే పక్కా కమర్షియల్ సినిమా ఇదనీ , దర్శకుడు మారుతి రాసుకొన్న కథలోనే కావల్సినంత ఫన్ ఉందనీ , ఈ మూవీ లో తన పాత్రకు పూర్తి న్యాయం చేశాననిపిస్తోందనీ , టీమ్ వర్క్‌తో చేసిన సినిమా ఇదనీ , అల్లు అరవింద్ గారి తో పని చేయాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నా. ఆ అవకాశం ఇప్పుడు దక్కిందనీ , రాశీ చాలా టాలెంటెడ్ అనీ ,ఆమె కు మంచి పాత్ర లభించిందనీ చెప్పారు. దర్శకుడు మారుతి మాట్లాడుతూ.. ప్రతీ సినిమాకీ బడ్జెట్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటాననీ , కానీ ఈ సినిమాకి మాత్రం బాగా ఖర్చు పెట్టించి తెరకెక్కించాననీ , తన నుంచి ఆశించే వినోదం, గోపీచంద్ అభిమానులు ఇష్టపడే యాక్షన్ పుష్కలంగా ఉంటాయనీ చెప్పారు. అల్లు అరవింద్ మాట్లాడుతూ .. గోపీచంద్‌లో కామెడీ టైమింగ్ చాలా బాగుంటుందనీ , అది ఈ సినిమాతో అర్థమవుతుందనీ , గోపీ తండ్రి టి.కృష్ణతో గీతా ఆర్ట్స్‌లో ఓ సినిమా చేద్దామనుకొన్నా. కానీ కుదర్లేదనీ , ఇంతకాలానికి గోపీతో సినిమా చేయడం ఆనందంగా ఉందనీ చెప్పారు.




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: