‘మేజర్’ హార్ట్ టచింగ్ ఫిలిం

Allu arjun about Adivi Sesh Major Movie,Icon Star Allu Arjun Loves Major Movie,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, Allu Arjun,Icon Star Allu Arjun,Stylish Star Allu Arjun,Allu Arjun About Major Movie,major Movie Updates,Allu Arjun loved Major Movie, Allu Arjun About Major Telugu Movie,Allu Arjun About Aidivi Sesh Major Movie,Allu Arjun Big congratulations To Major Team,Allu Arjun About Aidivi Sesh Acting In Major Movie, Major Movie Collections,Major Movie Latest Collections Updates,Major Telugu Movie Box Office Collections,Major Movie USA Collections,Major Movie

ప్రస్తుతం ఎక్కడ చూసినా మేజర్ సినిమా గురించే వినిపిస్తుంది. అడివి శేష్ హీరోగా ఈసినిమా తెరకెక్కగా నిన్న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ముంబైలో జరిగిన ఉగ్రదాడుల్లో వీర మరణం పొందిన మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవిత కథ ఆధారంగా ఈ సినిమా తెరకెక్కడంతో మొదటి నుండీ ఈసినిమాపై అందరికీ ఆసక్తి ఉంది. సందీప్ ఉన్ని కృష్ణన్ జీవితాన్ని చాలా బాగా చూపించినందుకు అందరూ మేజర్ టీమ్ ను ప్రశంసిస్తున్నారు. హోటల్ తాజ్ పై ఉగ్రదాడి.. ప్రాణాలకు తెగించి హీరో ముందుకు వెళ్లే సీన్స్ ఆడియన్స్ కి గూస్ బంప్స్ తెప్పిస్తున్నాయి. సందీప్ పేరెంట్స్ గా చేసిన ప్రకాష్ రాజ్, రేవతి కూడా తమ పాత్రల్లో ఒదిగిపోయి చేశారు కాబట్టి ప్రతిఒక్క పాత్రకు ఆడియన్స్ కనెక్ట్ అవుతున్నారు. మేజర్ సందీప్ చనిపోయాడనే వార్తలు టీవీలో చూసిన అతని తల్లి, తన కొడుకు తనకి ఎదురైతే బాగుండుననే ఆశతో వర్షంలో నడుస్తూ వెళ్లే సీన్ చూసి ఎమోషనల్ అవ్వకుండా ఉండరంటే అతిశయోక్తి కాదు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఈసినిమాకు సినీ సెలబ్రిటీల నుండి కూడా ప్రశంసలు దక్కుతున్నాయి. ఇప్పటికే పలువురు స్పందించి చిత్రయూనిట్ పై ప్రశంసలు కురిపించగా..తాజాగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కూడా మేజర్ సినిమాపై స్పందించారు. ఈసందర్భంగా ఆయన ట్వీట్ చేస్తూ.. మేజర్ చిత్రయూనిట్ అందరికీ పెద్ద కంగ్రాచ్యూలేషన్స్.. మేజర్ హార్ట్ టచింగ్ ఫిలి.. మ్యాన్ ఆఫ్ షో అడివి శేష్ మరోసారి తన మ్యాజిక్ ను చూపించాడు.. అలానే ప్రకాష్ రాజ్, రేవతి గారు సయీ ముంజ్రేకర్, శోభితా ధూళిపాళ్ల, కాస్ట్ అండ్ క్రూ ఇంపాక్ట్ సపోర్ట్ ఇచ్చారు.. ఇంకా శ్రీచరణ్ పాకాల మైండ్ బ్లోయింగ్ బీజీయం ఇచ్చాడు.. డైరెక్టర్ శశి కిరణ్ మేకింగ్ సూపర్.. ముఖ్యంగా మహేష్ బాబు గారికి నా పర్సవల్ కంగ్రాట్స్ ఇలాంటి సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చినందుకు.. మేజర్ ప్రతి ఒక్క ఇండియన్ మనసును తాకుతుంది అంటూ ట్వీట్ లో పేర్కొన్నాడు.

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

17 + 18 =