‘కీర్తి సురేష్’ ఎమోషనల్ నోట్.. ధైర్యంగా ముందుకు వెళతా..!

Keerthy Emotional Note To Audience,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, Keerthy Suresh,Actress Keerthy Suresh,Keerthy Suresh Movie,Keerthy Suresh latest Updates,Keerthy Suresh upcoming Movies,Keerthy Suresh motional Note, Keerthy Suresh Emotional Note in Social Media,Keerthy Suresh Latest Movie Updates,Keerthy Suresh in Social Media,Keerthy Suresh Emotional Note in Social Media to Audience

నేను శైలజ సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది కీర్తి సురేష్. అయితే కీర్తి సురేష్ కు కూడా సక్సెస్ రేట్ కాస్త తక్కువనే చెప్పొచ్చు. సినిమా అవకాశలకు అయితే మాత్రం ఎలాంటి కొదువలేదు కానీ విజయాల కంటే అపజయాలే ఎక్కువ సొంతం చేసుకుంది. కానీ మహానటి లాంటి సినిమాతో మాత్రం తనేంటో నిరూపించుకుంది. ఇక మహానటి తరువాత పలు లేడీ ఒరియెంటెడ్ సినిమాలే చేసినా అవి కూడా సక్సెస్ అందించలేకపోయాయి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఈఏడాది కీర్తి సురేష్ కు బాగానే కలిసొచ్చిందని చెప్పొచ్చు. రీసెంట్ గా రిలీజ్ అయిన సర్కారు వారి పాట తో బ్లాక్ బస్టర్ హిట్ ను తన ఖాతాలో వేసుకుంది. దానితోపాటు తెలుగు, తమిళ్ లో రిలీజ్ అయిన సాని కాయిదం సినిమాతో మరో సక్సెస్ ను అందుకుంది. ఈసినిమా ఓటీటీలో రిలీజ్ అవ్వగా సినిమా చూసిన వారందరూ కీర్తిపై ప్రశంసలు కురిపిస్తున్నారు. ఈనేపథ్యంలో కీర్తిసురేష్ సోషల్ మీడియా వేదికగా రెండు సినిమాలు చేసిన టీంకు ధన్యవాదాలు తెలుపుతూ ఎమోషనల్ పోస్ట్ చేసింది. ఒక యాక్టర్ జీవితం అనేది ఎన్నో ఒడిదుడుకులతో ఉంటుంది..రీసెంట్ టైమ్స్ నాకు చాలా పరీక్షా సమయం లాంటిది.. అయితే అప్పుడే నాకు అర్దమైంది.. నేను నిరంతరం కృషి చేయాల్సిన అవసరం ఉందని.

ఇక నా అభిమానులు నా బలం..నేను ఈరోజు ఈస్థాయిలో ఉన్నానంటే దానికి కారణం మీరే.. నన్ను సపోర్ట్ చేస్తున్నందుకు మీ అందరికీ కతజ్ఞతలు అంటూ పోస్ట్ లో పేర్కొంది. సాని కాయిదం టీమ్ కు నా సిన్సియర్ థ్యాంక్స్.. డైరెక్టర్ అరుణ్ మహేశ్వరన్ నన్ను నమ్మి పొన్ని లాంటి రోల్ ను ఇచ్చారు.. ఇంతకు ముందు నేను ఎప్పుడూ చేయని పాత్ర ఇది. అంతేకాదు టాలెంటెడ్ కో స్టార్ సెల్వ రాఘవన్ సార్ కూడా నువ్వు తప్ప ఈపాత్రలో ఎవరూ చేయరని కాంప్లిమెంట్ ఇచ్చారు. సినిమాటోగ్రాఫర్ యామిని ఈసినిమాను నీ భుజాల మీద మోశావు.. ఇలాంటి మంచి మెమరబుల్ ఎక్స్ పీరియన్స్ ఇచ్చినందుకు సానికాయిదం కాస్ట్ అండ్ క్రూ కి చాలా థ్యాంక్స్ అంటూ తెలిపింది.

ఇంకా సర్కారు వారి పాట టీమ్ కు కూడా స్పెషల్ థ్యాంక్స్. ఈసినిమా ప్రొడ్యూసర్స్, మైత్రీ మూవీ మేకర్స్, 14 రీల్స్ ప్లస్, జీఎంబీ ఎంటర్ టైన్ మెంట్స్, డైరెక్టర్ పరుశురాం, మ్యూజిక్ డైరెక్టర్ థమన్, సినిమాటోగ్రాఫర్ మది అందరి హార్డ్ వర్కే ఇప్పుడు చూస్తున్న రిజల్ట్. ఇంకా ఫైనల్ గా మహేష్ బాబు గారు మీతో నటించడం.. స్క్రీన్ షేర్ చేసుకోవడం చాలా గౌరవంగా భావిస్తున్నా.. ఇంకా ఈసినిమా విజయంలో భాగమైన కాస్ట్ అండ్ క్రూ కి కూడా చాలా థ్యాంక్స్.

ఇక నా అభిమానులకు స్పెషల్ థ్యాంక్స్. వారే నా బలం. నేను ఈరోజు ఈస్థానంలో ఉన్నానంటే దానికి కారణం మీరే. ఎన్ని ఇబ్బందులు వచ్చినా మీరు నాకు సపోర్టు ఇస్తున్నందుకు చాలా కృతజ్ఞతలు. ఇంకా నా ప్రయాణంలో భాగమైన దర్శకులందరికీ నా ధన్యవాదాలు. ఫైనల్ గా ఎన్ని ఇబ్బందులు ఎదురైనా ధైర్యంగా ముందుకు వెళతానని తెలిపింది.

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

4 × five =