శశి కిరణ్ తిక్క దర్శకత్వంలో అడివి శేష్ హీరోగా వచ్చిన సినిమా మేజర్. ఈసినిమా నిన్న రిలీజ్ అయి ప్రేక్షకుల ముందుకు వచ్చింది. నిజానికి సినిమా రిలీజ్ చేసేముందు ప్రివ్యూ లు వేయడం కామనే. కాని రిలీజ్ కు ఒకటి లేదా రెండు రోజుల ముందు అదికూడా సెలబ్రిటీలకు వేయడం జరుగుతుంది. కానీ మేజర్ టీమ్ మాత్రం రిలీజ్ కు వారం రోజుల ముందు నుండే ప్రివ్యూలు వేశారంటేనే అర్థం చేసుకోవచ్చు ఈసినిమాపై ఎంత నమ్మకంతో ఉన్నారో. ఇక ఆ నమ్మకానికి తగ్గట్టే రెస్పాన్స్ వస్తుంది. సందీప్ ఉన్ని కృష్ణన్ గా అడివి శేష్ చాలా బాగానటించాడని..అడివి శేష్ నటన, శశికిరణ్ టేకింగ్‌పై విమర్శకులు సైతం ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక దీంతో ఈసినిమా మొదటి రోజే మంచి కలెక్షన్స్ ను రాబట్టుకుంది. ప్రపంచ వ్యాప్తంగా ఈసినిమా 13.4 కోట్ల గ్రాస్ ను రాబట్టింది. ఈ విషయాన్ని చిత్రయూనిట్ అధికారికంగా తెలియచేసింది. ప్రపంచ వ్యాప్తంగా ఈ చిత్రం 7.12 కోట్ల షేర్, 13.10 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టినట్లు తెలుస్తోంది. ఏపీ, తెలంగాణాలో మొత్తంగా రూ.4 కోట్లను వసూలు చేసింది. ఇక వీకెండ్ లోపు మంచి కలెక్షన్స్ ను రాబట్టనున్నట్టు తెలుస్తుంది.
#IndiaLovesMajor 🙂 pic.twitter.com/S7rU5C1aVc
— Adivi Sesh (@AdiviSesh) June 4, 2022
కాగా మహేశ్‌బాబు జీఎమ్‌బీ ఎంటర్‌టైన్మెంట్, ఏ ప్లస్ ఏస్ మూవీస్‌తో కలిసి సోనీ పిక్చర్స్ ఫిల్మ్స్ ఇండియా బ్యాన్ర్స్ పై ఈసినిమాను నిర్మించారు. ఈసినిమాలో సయీ ముంజ్రేకర్, శోభిత ధూళిపాళ్ల, ప్రకాష్ రాజ్, మురళీ శర్మ, రేవతి కీలక పాత్రల్లో నటించారు.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: