యాక్టర్ , రైటర్ , సింగర్ , ప్రొడ్యూసర్ , డైరెక్టర్ గా పలు బ్లాక్ బస్టర్ మూవీస్ తో ప్రేక్షకులను అలరిస్తూ ఉపేంద్ర కన్నడ చిత్ర పరిశ్రమలో సూపర్ స్టార్ గా రాణిస్తున్నారు. ప్రత్యేక పాత్రలలో అద్భుతంగా పెర్ఫార్మ్ చేస్తూ ఉపేంద్ర తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు. ఉపేంద్ర హీరో గా మూడు కన్నడ సినిమాలు సెట్స్ పైన ఉన్నాయి. హీరో ఉపేంద్ర ఇప్పుడు మరో పాన్ ఇండియా మూవీలో స్వీయ దర్శకత్వంలో హీరోగా నటిస్తున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ప్రయోగాత్మక చిత్రాలకు పెట్టింది పేరుగా మారిన ఉపేంద్ర “ఓం”, “ఏ” ,”రా” వంటి వెరైటీ టైటిల్స్ తో ప్రేక్షకులను అలరించిన తన తాజా చిత్రానికి “UI”టైటిల్ ని ఫిక్స్ చేశారు. లహరి ఫిల్మ్స్ , వీనస్ ఎంటర్ టైనర్స్ బ్యానర్స్ పై స్వీయ దర్శకత్వంలో ఉపేంద్ర హీరోగా తెరకెక్కుతున్న పాన్ ఇండియా మూవీ “UI” పూజాకార్యక్రమం బెంగుళూరు లో గ్రాండ్ గా జరిగింది. ఈ కార్యక్రమానికి కన్నడ స్టార్ హీరోస్ కిచ్చా సుదీప్ , శివరాజ్ కుమార్ , ధనంజయ్ ముఖ్య అతిథులు గా పాల్గొన్నారు. పాన్ ఇండియా మూవీ “UI ” రెగ్యులర్ షూటింగ్ త్వరలోనే ప్రారంభం కానుందని సమాచారం. ఈ మూవీ ప్రారంభోత్సవం సందర్భంగా చిత్ర యూనిట్ ఒక పోస్టర్ ను రిలీజ్ చేసింది.




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:



























