
ట్యాగ్ · 4407 కథనాలు · పేజీ 111


"ది వారియర్" మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ డేట్

'పొన్నియన్ సెల్వన్' టీజర్ రిలీజ్

'రామారావు ఆన్ డ్యూటీ' మాస్ ట్రైలర్ లోడింగ్

తిరిగి సినిమాలలో సీనియర్ హీరోయిన్ స్నేహ

తమన్నా డ్రీమ్ ప్రాజెక్ట్

అస్వస్థతకు గురైన 'విక్రమ్'

భాషాపరమైన ఎలాంటి భేదాలు లేవు - నిత్యా మీనన్

గత జన్మలో కూడా హీరోయిన్ అయి ఉంటాను- కృతి శెట్టి

కోలీవుడ్ లో పూజా హెగ్డే కి మరో భారీ ఆఫర్ ?

ఆది సాయికుమార్ 'క్రేజీ ఫెలో' రిలీజ్ డేట్ ఫిక్స్

'రంగమార్తాండ' కాస్ట్ అండ్ క్రూ డీటైల్స్

మరో తెలుగు మూవీ లో శివ కార్తికేయన్

యూట్యూబ్ ట్రెండింగ్ లో "బింబిసార"ట్రైలర్

తమిళ్ డెబ్యూకోసం 15 ఏళ్లు వెయిట్ చేశా..!

పాకిస్థాన్ , బంగ్లాదేశ్ , శ్రీలంక లలో నెం 1 గా "మేజర్ "
సోనీ పిక్చర్ ఇండియా , జి ఎమ్ బి ఎంటర్ టైన్ మెంట్ , A +S మూవీస్ బ్యానర్స్ పై శశి కిరణ్ తిక్క దర్శకత్వంలో అడివి శేష్, సయీ మంజ్రేకర్ జంటగా మేజర్ సందీప్ ఉన్ని కృష్ణన్ జీవిత చరిత్ర ఆధారంగా తెలుగు , హిందీ భాషలలో తెరకెక్కిన ఎమోషనల్ డ్రామా “మేజర్” మూవీ 3వ తేదీ రిలీజ్అయ్యి ప్రేక్షకులతో పాటు సినీ ప్రముఖుల ప్రశంసలు అందుకుని సూపర్ హిట్ టాక్ తో దూసుకుపోతోంది. మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ పాత్రలో అడివిశేష్ తన కెరీర్ బెస్ట్ ఫర్ఫార్మెన్స్ అందించారు. అడివి శేష్ కు జోడీగా నటించిన సయీ మంజ్రేకర్ అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. అడివి శేష్ , సయీ ల స్క్రీన్ కెమిస్ట్రీ ప్రేక్షకులను అలరించింది.

'కోబ్రా' తెలుగు హక్కులు సొంతం చేసుకున్న ఎన్వీఆర్ సినిమా
ప్రయోగాత్మక చిత్రాలతో అనేక సూపర్‌హిట్‌లు, బ్లాక్‌బస్టర్‌లను సొంతం చేసుకున్న చియాన్ విక్రమ్, అసాధారణ సినిమాలతో ఆకట్టుకునే దర్శకుడు ఆర్ అజయ్ జ్ఞానముత్తు దర్శకత్వంలో తెరకెక్కిన యాక్షన్ థ్రిల్లర్ 'కోబ్రా'. ఈ కాంబినేషన్ లో సినిమా వస్తుండటంతో ప్రేక్షకులు కూడా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.ఇక సెవెన్ స్క్రీన్ స్టూడియోస్ బ్యానర్‌పై ఎస్ఎస్ లలిత్ కుమార్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

'లైగర్' ఫస్ట్ సింగిల్ ప్రోమో రిలీజ్..!
టాలీవుడ్ డ్యాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రౌడీ హీరో విజయ్ దేవరకొండ హీరోగా వస్తున్న సినిమా లైగర్. ఈసినిమాతో విజయ్ పాన్ ఇండియా మార్కెట్ లోకి అడుగుపెడుతున్నాడు. నిజానికి అర్జున్ రెడ్డి సినిమాతోనే సౌత్ లో కూడా విజయ్ దేవరకొండ మంచి క్రేజ్ ను సొంతం చేసుకున్నాడు. ఇప్పుడు ఈసినిమాతో దేశవ్యాప్తంగా ఉన్న ప్రేక్షకులకు మరింత దగ్గరగా అవ్వడానికి ప్రయత్నిస్తున్నాడు. ప్రస్తుతం అయితే ఈసినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటుంది. దీనిలో భాగంగానే ఈసినిమా నుండి పోస్టర్లు, గ్లింప్స్ రిలీజ్ చేస్తున్నారు. ఇక ఇప్పుడు మ్యూజికల్ ప్రమోషన్స్ కూడా మొదలుపెట్టారు.

"ది వారియర్" మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ డేట్
శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ బ్యానర్ పై సూపర్ హిట్ “పందెం కోడి “మూవీ ఫేమ్ లింగుస్వామి దర్శకత్వంలో ఎనర్జిటిక్ హీరో రామ్, సక్సెస్ ఫుల్ చిత్ర హీరోయిన్ కృతి శెట్టి జంటగా ఫ్యాక్షన్ నేపథ్యం లో తెలుగు , తమిళ భాషలలో తెరకెక్కిన యాక్షన్ ఎంటర్ టైనర్ “ది వారియర్ ” మూవీ జూలై 14 వ తేదీ రిలీజ్ కానుంది. ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని ఫస్ట్ టైమ్ పోలీస్ ఆఫీసర్ గా నటిస్తున్న “ది వారియర్”మూవీ లో నదియా , ఆదిపినిశెట్టి , అక్షర గౌడ్ ముఖ్య పాత్రలలో నటించారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు.“ది వారియర్ ” చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ , టీజర్ , ట్రైలర్ , సాంగ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.

'పొన్నియన్ సెల్వన్' టీజర్ రిలీజ్
సినీ ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్న పొన్నియన్ సెల్వన్ టీజర్ ఫైనల్ గా వచ్చేసింది. మణిరత్నం ఈసినిమాకు డైరెక్టర్ అవ్వడం.. దానికి తోడు భారీ బడ్జెట్, భారీ విజువల్స్, భారీ తారగాణంతో వస్తున్న సినిమా అవ్వడంతో ఈసినిమా కోసం అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక ఈసినిమా ప్రస్తుతం రిలీజ్ కు రెడీ అవుతుంది. మరోపక్క ప్రమోషన్స్ ను కూడా చేస్తున్నారు. ఈసినిమాలో కీలక పాత్రల్లో నటిస్తున్న పాత్రలకు సంబంధించి పోస్టర్లను ఇప్పటికే ఒక్కొక్కటిగా రిలీజ్ చేసుకుంటూ వస్తున్నారు. తాజాగా ఈసినిమా టీజర్ ను రిలీజ్ చేశారు. అన్ని భాషల్లో రిలీజ్ చేసిన ఈసినిమా తెలుగు టీజర్ ను సూపర్ స్టార్ మహేష్ బాబు రిలీజ్ చేశారు. న ఫేవరెట్…

'రామారావు ఆన్ డ్యూటీ' మాస్ ట్రైలర్ లోడింగ్
మాస్ మహారాజా రవితేజ మోస్ట్ ఎవైటెడ్ మూవీ 'రామారావు ఆన్ డ్యూటీ. ఈసినిమా ఇప్పటికే రిలీజ్ అవ్వాలి కానీ కొన్ని కారణాల వల్ల రిలీజ్ కాలేదు. ఫైనల్ గా జూలై 29న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా రిలీజ్ కాబోతుంది. నూతన దర్శకుడు శరత్ మండవ దర్శకత్వంలో 1995 నాటి నేపథ్యంలో యదార్థ సంఘటనల ఆధారంగా తెరకెక్కుతుంది. ఇక ఈసినిమా ప్రమోషన్స్ ను ఎప్పుడో స్టార్ట్ చేశారు. ఇప్పటికే పాటలు, పోస్టర్లు, టీజర్ కూడా రిలీజ్ చేయగా వాటికి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడు ట్రైలర్ రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. దీనికి సంబంధించిన అప్ డేట్ కూడా ఇచ్చారు తాాజాగా. 'రామారావు ఆన్ డ్యూటీ మాస్ ట్రైలర్ లోడ్ అవుతుందని చెబుతూ.. ట్రైలర్…

విష్ణు 'జిన్నా' ఫస్ట్ లుక్ రిలీజ్ డేట్ ఫిక్స్..!
ఈషాన్ సూర్య దర్శకత్వంలో మంచు విష్ణు హీరోగా జిన్నా సినిమా వస్తున్న సంగతి తెలిసిందే కదా. ఈసినిమాలో విష్ణు గాలి నాగేశ్వరరావు అనే పాత్రలో నటిస్తున్నాడు. ప్రస్తుతం ఈసినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. దాదాపు షూటింగ్ చివరి దశకు వచ్చేసింది. రీసెంట్ గానే ఈసినిమా టైటిల్ ను ఫిక్స్ చేస్తూ ప్రకటించారు. ఇక ఈసినిమా లోకేషన్స్ నుండి అప్పడప్పుడు ఏదో పోస్ట్ చేస్తూనే ఉన్నాడు విష్ణు. ఇక తాజాగా ఈసినిమా ఫస్ట్ లుక్ కు సంబంధించిన అప్ డేట్ ఇచ్చారు మేకర్స్. ఈ సినిమా నుండి ఫస్ట్ లుక్ ను జులై11వ తేదీన ఉదయం 10 గంటల 22 నిమిషాలకు రిలీజ్ చేస్తున్నట్టు ప్రకటించారు.

తిరిగి సినిమాలలో సీనియర్ హీరోయిన్ స్నేహ
"ఇంగనే ఒరు నిలపక్షి "(2000) మూవీ తో కెరీర్ ప్రారంభించిన స్నేహ "ఎన్నవలే " మూవీ తో కోలీవుడ్ , "తొలివలపు " మూవీ తో టాలీవుడ్ కు పరిచయం అయ్యారు. కథానాయికగా తెలుగు , తమిళ , కన్నడ , మలయాళ భాషల పలు సూపర్ హిట్ మూవీస్ లో స్నేహ తన అందం , అభినయం తో ప్రేక్షకులను అలరించారు. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మారి స్నేహ తన అద్భుత పెర్ఫార్మెన్స్ తో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. "వినయ విధేయ రామ "మూవీ తరువాత స్నేహ సినిమాలకు గ్యాప్ తీసుకున్నారు.

తమన్నా డ్రీమ్ ప్రాజెక్ట్
“శ్రీ ”(2005 ) మూవీ తో టాలీవుడ్ కు పరిచయం అయిన మిల్కీ బ్యూటీ తమన్నా తెలుగు , తమిళ భాషల పలు బ్లాక్ బస్టర్ మూవీస్ లో తన అందం , అభినయం తో సుమారు 16 సంవత్సరాలుగా ప్రేక్షకులను అలరిస్తూ స్టార్ హీరోయిన్ గా రాణిస్తున్నారు. అద్భుత డ్యాన్స్ టాలెంట్ ఉన్న తమన్నా పలు భాషల మూవీస్ లో స్పెషల్ సాంగ్స్ లో పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు. టాలెంటెడ్ యాక్ట్రెస్ తమన్నా ప్రస్తుతం సత్యదేవ్ “గుర్తుందా శీతాకాలం “, చిరంజీవి “భోళా శంకర్ ” మూవీస్ లో కథానాయికగా నటిస్తున్నారు. ఫిమేల్ ఓరియెంటెడ్ మూవీ “బబ్లీ బౌన్సర్” షూటింగ్ ను తమన్నా కంప్లీట్ చేశారు.“బోలె చూడియా”, “ప్లాన్ ఎ ప్లాన్ బి”, ఒక హిందీ వెబ్…

అస్వస్థతకు గురైన 'విక్రమ్'
ఈమధ్య కాలంలో సినీ పరిశ్రమల్లో తరచుగా విషాద సంఘటనలు చోటు చేసుకోవడం చూస్తూనే ఉన్నాం. ఎప్పుడు ఏ వార్త వినిపిస్తుందో కూడా తెలియని పరిస్థితి ఏర్పడింది. యంగ్ హీరోలు సైతం కాలగమనం చేస్తుండటంతో ఏ చిన్న వార్త వినిపించినా ఫ్యాన్స్ మాత్రం ఆందోళన చెందుతున్నారు. ఇక ఇప్పుడు మరో వార్త సినీ ప్రేక్షకులను ఆందోళనకు గురిచేస్తుంది. తమిళ్ విలక్షణ నటుడు చియాన్ విక్రమ్ అస్వస్థతకు గురవ్వడంతో ఫ్యాన్స్ కలవరపడుతున్నారు. విక్రమ్ నేడు అస్వస్థకు గురవ్వడంతో వెంటనే చెన్నై కావేరి హాస్పిటల్‌లో జాయిన్ చేసినట్టు తెలుస్తుంది. అయితే ప్రస్తుతం విక్రమ్ ఆరోగ్యం నిలకడగా ఉందని అంటున్నారు.

భాషాపరమైన ఎలాంటి భేదాలు లేవు - నిత్యా మీనన్
మలయాళ , తెలుగు , తమిళ , కన్నడ భాషలలో సుమారు 50 సినిమాలలో నటించిన యాక్ట్రెస్ , సింగర్ నిత్యా మీనన్ 8 సంవత్సరాల వయసు లో ఒక ఇంగ్లీష్ మూవీ లో నటించారు. “ఆకాశగోపురం ” తో మలయాళ , “అలామొదలైంది “తో తెలుగు , “నూటరెంబదు “తో తమిళ చిత్ర పరిశ్రమలకు కథానాయికగా పరిచయం అయ్యారు. ” 7 O’ Clock”మూవీ లో సపోర్టింగ్ రోల్ తో నిత్యామీనన్ కన్నడ చిత్ర పరిశ్రమకు , “మిషన్ మంగళ్ ” మూవీ తో బాలీవుడ్ కు పరిచయం అయ్యారు.

గత జన్మలో కూడా హీరోయిన్ అయి ఉంటాను- కృతి శెట్టి
బ్లాక్ బస్టర్ “ఉప్పెన“మూవీ తో టాలీవుడ్ కు పరిచయం అయిన కృతి శెట్టి, ఆ మూవీ లో తన అందం అభినయం తో ప్రేక్షకులను అలరించారు. “ఉప్పెన “, “శ్యామ్ సింగ రాయ్” , “బంగార్రాజు ” మూవీస్ తో కృతి శెట్టి హ్యాట్రిక్ సాధించారు.సక్సెస్ ఫుల్ చిత్ర హీరోయిన్ కృతి శెట్టి ప్రస్తుతం “ది వారియర్ “, “ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి”,“మాచర్లనియోజకవర్గం” మూవీస్ లో కథానాయికగా నటిస్తున్నారు.బాలా దర్శకత్వంలో సూర్య హీరో గా తెరకెక్కనున్న తమిళ మూవీ, అరుణ్ మాధేశ్వరన్ దర్శకత్వంలో హీరో ధనుష్ నటించే మూవీ , నాగచైతన్య హీరోగా తెరకెక్కనున్న “#NC 22” మూవీ లో కృతి కథానాయికగా ఎంపిక అయ్యారు.

హ్యాపీ బర్త్ డే మూవీ రివ్యూ
ఓవరాల్ గా చెప్పాలంటే ఈసినిమా కామెడీ ఎంటర్ టైనర్ అని చెప్పొచ్చు. ఇలాంటి సినిమాలను లాజిక్కులు లేకుండా చూస్తూనే బెటర్. కామెడీ థ్రిల్లర్ కాబట్టి ప్రతిఒక్కరూ ఒకసారి చూసి ఎంజాయ్ చేయొచ్చు.

కోలీవుడ్ లో పూజా హెగ్డే కి మరో భారీ ఆఫర్ ?
హీరో నాగచైతన్య కథానాయకుడిగా తెరకెక్కిన సక్సెస్ ఫుల్ “ఒక లైలా కోసం “మూవీ తో పూజా హెగ్డే టాలీవుడ్ కు పరిచయం అయ్యారు. పలు బ్లాక్ బస్టర్ మూవీస్ లో తన అందం , అభినయం తో ప్రేక్షకులను అలరిస్తూ టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా రాణిస్తున్నారు. పూజాహెగ్డే ప్రస్తుతం “సర్కస్ “, “ కభీ ఈద్ కభీ దివాలీ “(హిందీ )మూవీస్ లో నటిస్తున్నారు. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో మహేష్ బాబు “#SSMB28”, పూరి జగన్నాథ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ హీరోగా తెరకెక్కుతున్న “జనగణమన ” మూవీస్ లో పూజాహెగ్డే కథానాయికగా నటిస్తున్నారు.

ఆది సాయికుమార్ 'క్రేజీ ఫెలో' రిలీజ్ డేట్ ఫిక్స్
ఫణికృష్ణ దర్శకుడిగా పరిచయం అవుతూ ఆది సాయి కుమార్ హీరోగా వస్తున్న సినిమా క్రేజీ ఫెలో. ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈసినిమా ప్రస్తుతం షూటింగ్ ను జరుపుకుంటుంది. ఇప్పటికే ఈసినిమా నుండి ఆది ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేశారు మేకర్స్. అంతేకాదు పాటలు కూడా ఒక్కొక్కటిగా రిలీజ్ చేస్తున్నారు. ఇటీవల విడుదలైన ‘బాలా త్రిపుర సుందరి..చాలా నచ్చిందే ఎందుకోమరి’ అన్న పాట మంచి రెస్పాన్స్ నే సొంతం చేసుకుంది. ఇక తాాజాగా ఈసినిమా రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేస్తూ అధికారికంగా ప్రకటించారు చిత్రయూనిట్. ఈసినిమాను సెప్టెంబర్ 16వ తేదీన ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.

నేను మీకు బాగా కావాల్సినవాడిని' టీజర్ రిలీజ్ డేట్ ఫిక్స్..!
యంగ్ హీరో కిరణ్ అబ్బవరం వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. రాజా వారు రాణి గారు, ఎస్‌ఆర్ కల్యాణమండపం, సెబాస్టియన్ పీసీ 524, ఇటీవల సమ్మతమే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఇక ప్రస్తుతం పలు సినిమాలతో బిజీగా ఉన్నాడు. అందులో నేను మీకు బాగా కావాల్సినవాడిని సినిమా కూడా ఒకటి. ఈసినిమా ఎప్పుడో మొదలై ఇటీవలే షూటింగ్ ను పూర్తి చేసుకొని ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది. ఇక ఈసినిమా నుండి అప్ డేట్ వచ్చి కూడా చాలా రోజులు అవుతున్న నేపథ్యంలో చిత్రయూనిట్ తాజాగా ఓ సాలిడ్ అప్ డేట్ తో వచ్చేసింది. ఈసినిమా టీజర్ ను రిలీజ్ చేస్తున్నట్టు తాజాగా ప్రకటించారు మేకర్స్. జులై 10వ తేదీన 11.05 నిమిషాలకు ఈ…

'రంగమార్తాండ' కాస్ట్ అండ్ క్రూ డీటైల్స్
క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ దర్శకత్వంలో ఒక సినిమా వస్తున్న సంగతి తెలిసిందే కదా. కృష్ణవంశీ 21వ సినిమాగా ఈసినిమా వస్తుంది. అయితే ఈసినిమాను మరాఠీలో సూపర్ హిట్ అయిన ‘నటసామ్రాట్’ సినిమాకు రీమేక్ చేస్తున్న సంగతి కూడా విదితమే. ప్రస్తుతం ఈసినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటుంది. రీసెంట్ గానే ఈసినిమా మ్యూజిక్ కంపోజిషన్స్ కు సంబంధించిన అప్ డేట్స్ ను ఇస్తూ వచ్చాడు కృష్ణ వంశీ. ఇక ఇప్పుడు తాజాగా మరో అప్ డేట్ ఇచ్చాడు. ఈసినిమా కాస్టింగ్ కు సంబంధించిన వివరాలను తెలియచేస్తూ ఒక వీడియో రిలీజ్ చేశారు.

మరో తెలుగు మూవీ లో శివ కార్తికేయన్
కోలీవుడ్ లో పలు బ్లాక్ బస్టర్ మూవీస్ తో ప్రేక్షకులను అలరిస్తున్న శివ కార్తికేయన్ సూపర్ హిట్ "డాక్టర్ జి", "డాన్" వంటి తెలుగు డబ్బింగ్ వెర్షన్స్ తో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్న విషయం తెలిసిందే. తమిళ స్టార్ హీరోలు విజయ్ , ధనుష్ టాలీవుడ్ మూవీస్ పై ఫోకస్ పెట్టారు. ఇప్పుడు శివకార్తికేయన్ కూడా తెలుగు స్ట్రయిట్ మూవీ తో ప్రేక్షకులను అలరించనున్నారు.

యూట్యూబ్ ట్రెండింగ్ లో "బింబిసార"ట్రైలర్
ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ పై మల్లిడి వశిష్ట్ దర్శకత్వంలో కళ్యాణ్ రామ్ హీరోగా క్రీస్తుపూర్వం 500 వ శతాబ్ద సమయంలో మగధదేశ రాజు భట్టియా కుమారుడైన బింబిసారుడి జీవితం ఆధారంగా తెరకెక్కిన “బింబిసార”మూవీ ఆగస్ట్ 5వ తేదీ రిలీజ్ కానుంది. హీరో కళ్యాణ్ రామ్ ఫస్ట్ పాన్ ఇండియా మూవీ గా తెరకెక్కిన “బింబిసార”మూవీలో క్యాథరిన్, సంయుక్త మీనన్ కథానాయికలు. కీరవాణి బ్యాక్ గ్రౌండ్ స్కోర్ , చిరంతన్ భట్ సంగీతం అందిస్తున్నారు.చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ , టీజర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.

తమిళ్ డెబ్యూకోసం 15 ఏళ్లు వెయిట్ చేశా..!
తమిళ స్టార్ డైరెక్టర్ లింగుస్వామి దర్శకత్వంలో రామ్ హీరోగా తెలుగు, తమిళ్ లో వస్తున్న సినిమా ది వారియర్. ఈసినిమా ఈనెల 14వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈనేథ్యంలో చిత్రయూనిట్ రెండు ప్రాంతాల్లోనూ సాలిడ్ గా ప్రమోషన్స్ ను స్టార్ట్ చేస్తున్నారు. ఇక ఇప్పటికే రిలీజ్ చేసిన టీజర్, ట్రైలర్ ఇంకా పాటలు సినిమాపై మంచి హైప్ ను క్రియేట్ చేశాయి. తమిళ్ లో రామ్ కు ఇది డెబ్యూ సినిమా అన్న సంగతి తెలిసిందే కదా. ఇక తన తమిళ్ ఎంట్రీకి దాదాపు 15 ఏళ్లు వెయిట్ చేశా అంటున్నాడు రామ్.