‘లైగర్’ ఫస్ట్ సింగిల్ ప్రోమో రిలీజ్..!

Akdi Pakdi Song Promo Out From Liger Movie,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, Liger,Liger Movie,Liger Telugu Movie,Liger Movie Updates,Liger Movie Song,Liger Promo Song,Promo Song From Liger Out Now, Akdi Pakdi Song From Liger Released,Vijay Deverakonda Liger Movie Song Released,Akdi Pakdi Song From Liger is Out Now,Vijay Deverakond,Vijay Deverakond Liger Movie Songs, Vijay Deverakond Akdi Pakdi Promo Song Released,Vijay Deverakond Akdi Pakdi Promo Song Out Now,Vijay Deverakond Liger Movie Promo Song Akdi Pakdi Released

టాలీవుడ్‌ డ్యాషింగ్‌ డైరెక్టర్‌ పూరి జగన్నాథ్‌ దర్శకత్వంలో రౌడీ హీరో విజయ్‌ దేవరకొండ హీరోగా వస్తున్న సినిమా లైగర్. ఈసినిమాతో విజయ్ పాన్ ఇండియా మార్కెట్ లోకి అడుగుపెడుతున్నాడు. నిజానికి అర్జున్ రెడ్డి సినిమాతోనే సౌత్ లో కూడా విజయ్ దేవరకొండ మంచి క్రేజ్ ను సొంతం చేసుకున్నాడు. ఇప్పుడు ఈసినిమాతో దేశవ్యాప్తంగా ఉన్న ప్రేక్షకులకు మరింత దగ్గరగా అవ్వడానికి ప్రయత్నిస్తున్నాడు. ప్రస్తుతం అయితే ఈసినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటుంది. దీనిలో భాగంగానే ఈసినిమా నుండి పోస్టర్లు, గ్లింప్స్ రిలీజ్ చేస్తున్నారు. ఇక ఇప్పుడు మ్యూజికల్ ప్రమోషన్స్ కూడా మొదలుపెట్టారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఈనేపథ్యంలో ఈసినిమా ఫస్ట్ సింగిల్ అప్ డేట్ రెండు రోజుల క్రితమే ప్రకటించారు. ‘అకడి పకడి’ అంటూ సాగే మాస్ సాంగ్‌ ప్రోమోను ఈరోజు రిలీజ్ చేశారు. ఇక ఫుల్ సాంగ్ ను జులై 11న సాయంత్రం 4గంటలకు రిలీజ్‌ చేస్తున్నట్లు తెలిపారు మేకర్స్. ప్రోమో లో మాత్రం విజయ్, అనన్య మాస్ స్టెప్పులతో అదరగొట్టారు. ఇక విజయ్ కూడా మొదటిసారి ఈరేంజ్ లో మాస్ స్టెప్పులు వేయడంతో ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు.

కాగా ఈ సినిమాలో విజయ్ దేవరకొండకు జోడీగా అనన్య పాండే నటిస్తుండగా. బాక్సింగ్ లెజెండ్ మైక్ టైసన్ కీలక పాత్రలో నటించనున్నారు. రమ్యకృష్ణ తోపాటు బాలీవుడ్ హీరో సునీల్ శెట్టి కూడా ఓ కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఈ సినిమాను పూరి కనెక్ట్స్ , ధర్మా ప్రొడక్షన్స్ బ్యానర్ పై తెలుగు, హిందీ, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో తెరకెక్కిస్తున్నారు. ఆగష్ట్ 25న ఈసినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

three × three =