కోలీవుడ్ లో పలు బ్లాక్ బస్టర్ మూవీస్ తో ప్రేక్షకులను అలరిస్తున్న శివ కార్తికేయన్ సూపర్ హిట్ “డాక్టర్ జి”, “డాన్” వంటి తెలుగు డబ్బింగ్ వెర్షన్స్ తో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్న విషయం తెలిసిందే. తమిళ స్టార్ హీరోలు విజయ్ , ధనుష్ టాలీవుడ్ మూవీస్ పై ఫోకస్ పెట్టారు. ఇప్పుడు శివకార్తికేయన్ కూడా తెలుగు స్ట్రయిట్ మూవీ తో ప్రేక్షకులను అలరించనున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
సురేశ్ ప్రొడక్షన్స్, శ్రీవెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్ పీ, శాంతి టాకీస్ బ్యానర్స్ పై బ్లాక్ బస్టర్ “జాతిరత్నాలు” మూవీ ఫేమ్ అనుదీప్ దర్శకత్వంలో తమిళ హీరో శివ కార్తికేయన్ , ఉక్రెయిన్ బ్యూటీ మరియా ర్యాబోషప్కా జంటగా తెలుగు , తమిళ భాషలలో”ప్రిన్స్ ” మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే.పాండిచ్చేరి , లండన్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న “ప్రిన్స్ “మూవీ వినాయక చవితి సందర్భంగా ఆగస్ట్ 31 వ తేదీ ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానుంది. ఈ సినిమాకు థమన్ ఎస్ సంగీతం అందిస్తున్నారు.తాజాగా యంగ్ హీరో శివ కార్తికేయన్ తన రెండవ ప్రాజెక్ట్ కూడా కన్ఫర్మ్ చేసుకున్నారు. ఈ చిత్రానికి కే.ఇ. జ్ఞాన్ వేల్ రాజా నిర్మాత కాగా బ్లాక్ బస్టర్ “సోగ్గాడే చిన్ని నాయనా “, “బంగార్రాజు ” మూవీస్ ఫేమ్ కళ్యాణ్ కృష్ణ దర్శకత్వం వహిస్తున్నట్లు సమాచారం.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: