
ట్యాగ్ · 4407 కథనాలు · పేజీ 110


టాకీ పార్ట్ పూర్తిచేసుకున్న 'యశోద'

"ది వారియర్ " మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్

జిన్నా ఫస్ట్ లుక్ గ్లింప్స్ రిలీజ్..!

'ఏజెంట్' టీజర్ రిలీజ్ డేట్ ఫిక్స్..!

"బాహుబలి "@ 7ఇయర్స్

'నేను మీకు బాగా కావాల్సిన వాడిని' టీజర్ రిలీజ్

ఆది సాయి కుమార్ "తీస్ మార్ ఖాన్"రిలీజ్ డేట్

#SSMB 28 మ్యూజిక్ పనులు స్టార్ట్..!

"కార్తికేయ 2 "మూవీ మ్యూజికల్ ప్రమోషన్స్ ప్రారంభం

"#MEGA 154 " మూవీ సెట్స్ లో శృతి హాసన్

మరో బాలీవుడ్ మూవీ లో రష్మిక ?

సోషల్ మీడియా లో పవన్ కళ్యాణ్ హవా

తండ్రి హెల్త్ రూమర్స్ పై తనయుడి క్లారిటీ..!

రామ్ తో పవన్ డైరెక్టర్..!
తమిళ్ స్టార్ డైరెక్టర్ లింగు స్వామి దర్శకత్వంలో రామ్-కృతిశెట్టి హీరో హీరోయిన్లుగా తెరెక్కుతున్న సినిమా ది వారియర్. మాస్ యాక్షన్ ఎంటర్టైనర్‌గా తెరకెక్కిన ఈ సినిమాలో మొదటి సారి రామ్ పవర్ ఫుల్ పోలీస్ పాత్రలో కనిపిస్తుండటంతో మరింత అంచనాలు నెలకొన్నాయి. దానికి తోడు సినిమా నుండి విడుదలైన టీజర్, ట్రైలర్ సినిమాపై అంచనాలను రెట్టింపు చేశాయి. జులై 14న గ్రాండ్‌గా రిలీజ్ అవుతుండటంతో దీనిలోభాగంగానే ప్రమోషన్ కార్యక్రమాలు కూడా బాగా చేస్తున్నారు.

టాకీ పార్ట్ పూర్తిచేసుకున్న 'యశోద'
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉంది. తెలుగులోనే పలు ప్రాజెక్టులతో బిజీగా ఉంది. ఇప్పటికే గుణశేఖర్ దర్శకత్వంలో వస్తున్న శాకుంతలం సినిమాలో నటిస్తుండగా ఆసినిమా షూటింగ్ ను పూర్తి చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది. ఈసినిమాతో పాటు యశోద, ఖుషి సినిమాలు చేస్తుంది. ఇక వీటిలో యశోద కూడా షూటింగ్ ను పూర్తి చేసుకుంది. హరి హరీష్ దర్శకత్వంలో ఈసినిమా తెరకెక్కుతుంది. ఇన్ని రోజులు ఈసినిమా షూటింగ్ తో బిజీగా ఉంది. పెద్దగా అప్ డేట్ లు లేకుండానే షూటింగ్ ను జరుపుకుంటూ వెళ్లారు. అయితే ఇటీవలే ఈసినిమా నుండి సమంత గ్లింప్స్ ను రిలీజ్ చేయగా.. చిన్న గ్లింప్సే సినిమాపై…

'లైగర్' అక్డీ పక్టీ ఫుల్ సాంగ్ రిలీజ్..!
పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ హీరోగా వస్తున్న సినిమా లైగర్. ప్రస్తుతం ఈసినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటుంది. మరోవైపు ఈసినిమా ప్రమోషన్ కార్యక్రమాలు కూడా మొదలుపెట్టారు. ఈసినిమా నుండి ఇప్పటివరకూ పలు పోస్టర్లు, గ్లింప్స్ రిలీజ్ అవ్వగా సినిమా అంచనాలను మరింత పెంచేశాయి. ఇక ఇప్పుడు మ్యూజికల్ ప్రమోషన్స్ కూడా స్టార్ట్ చేశారు. దీనిలో భాగంగానే ఈసినిమా నుండి అక్డీ పక్డీ పాటను రిలీజ్ చేశారు. ఈపాట ప్రోమోను ఇప్పటికే రిలీజ్ చేయగా ప్రోమోకే సూపర్ రెస్పాన్స్ వచ్చింది. ఈ పాటలో విజయ్ మాస్ స్టెప్పులతో, అనన్య పాండే గ్లామర్ తో ఆకట్టుకున్నారు. ఇప్పుడు తాజాగా ఫుల్ సాంగ్ ను రిలీజ్ చేశారు. ఇక సాంగ్…

"ది వారియర్ " మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్
శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ బ్యానర్ పై సూపర్ హిట్ “పందెం కోడి “మూవీ ఫేమ్ లింగుస్వామి దర్శకత్వంలో ఎనర్జిటిక్ హీరో రామ్, సక్సెస్ ఫుల్ చిత్ర హీరోయిన్ కృతి శెట్టి జంటగా ఫ్యాక్షన్ నేపథ్యం లో తెలుగు , తమిళ భాషలలో తెరకెక్కిన యాక్షన్ ఎంటర్ టైనర్ “ది వారియర్ ” మూవీ జూలై 14 వ తేదీ రిలీజ్ కానుంది. ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని ఫస్ట్ టైమ్ పోలీస్ ఆఫీసర్ గా నటిస్తున్న “ది వారియర్”మూవీ లో నదియా , ఆదిపినిశెట్టి , అక్షర గౌడ్ ముఖ్య పాత్రలలో నటించారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు.“ది వారియర్ ” చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ , టీజర్ , ట్రైలర్ , సాంగ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.

జిన్నా ఫస్ట్ లుక్ గ్లింప్స్ రిలీజ్..!
చాలాగ్యాప్ తరువాత మళ్లీ సందడి చేయడానికి వస్తున్నాడు మంచు విష్ణు. తన నుండి సినిమా వచ్చి చాలా కాలం అయిపోయింది. ఈ నేపథ్యంలో ఈసారి మరో ఎంటర్ టైనర్ తో వచ్చేస్తున్నాడు. ఈషాన్ సూర్య దర్శకత్వంలో మంచు విష్ణు హీరోగా వస్తున్న సినిమా జిన్నా. ఈసినిమాలో మంచు విష్ణు గాలి నాగేశ్వర్రావు పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇక తన గాలి నాగేశ్వర్రావు పేరు నచ్చక హీరో జిన్నాగా మార్చుకుంటాడు కాబట్టి జిన్నా టైటిల్ నే ఫిక్స్ చేశారు మేకర్స్. ఇక ప్రస్తుతం అయితే ఈసినిమా శరవేగంగా షూటింగ్ ను జరుపుకుంటుంది.

'ఏజెంట్' టీజర్ రిలీజ్ డేట్ ఫిక్స్..!
అక్కినేని వారసత్వంతో ఇండస్ట్రీలోకి హీరోగా అడుగుపెట్టిన అఖిల్ దాదాపు మూడు సినిమాల తర్వాత కానీ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్ తో మొదటి హిట్ ను తన ఖాతాలో వేసుకున్నాడు. ఇక ఇప్పుడు అదే జోష్ లో మరో హిట్ ను కొట్టడానికి గట్టి ప్రయత్నాలే చేస్తున్నాడు. ప్రస్తుతం అఖిల్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ఏజెంట్ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. అఖిల్ కెరీర్ లో మొట్టమొదటి పాన్ ఇండియా మూవీగా ఈసినిమాను రూపొందిస్తున్నారు. ఇక అందుకు తగ్గట్టే తన మేకవర్ తో పాన్ ఇండియా ఆడియన్స్ కు కనెక్ట్ అవ్వడానికి రెడీ అయిపోయాడు. ప్రస్తుతం అయితే శరవేగంగా షూటింగ్ ను జరుపుకుంటుంది ఈసినిమా.

"బాహుబలి "@ 7ఇయర్స్
ఆర్కా మీడియా వర్క్స్ బ్యానర్ పై రాజమౌళి ఎస్ ఎస్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా రెండు భాగాలుగా రూపొందిన ఎపిక్ యాక్షన్ ఫిల్మ్ “బాహుబలి “ఘనవిజయం సాధించి రికార్డ్ కలెక్షన్స్ తో ప్రపంచవ్యాప్తంగా తెలుగు మూవీ సత్తాను చాటింది. ఈ మూవీ లో అనుష్క , తమన్నా , రమ్యకృష్ణ , రానా దగ్గుబాటి ముఖ్య పాత్రలలో నటించారు. భారీ సెట్టింగ్స్ , భారీ యాక్షన్ సీన్స్ ప్రేక్షకులను అలరించాయి. "బాహుబలి" ఫస్ట్ పార్ట్ "బాహుబలి :ది బిగినింగ్ " మూవీ 2015 జూలై 10 వ తేదీ ప్రపంచవ్యాప్తంగా 9000 ధియేటర్లలో విడుదల అయ్యి 650 కోట్లు కలెక్ట్ చేసి రికార్డ్ క్రియేట్ చేసింది.

'నేను మీకు బాగా కావాల్సిన వాడిని' టీజర్ రిలీజ్
రాజావారు రాణిగారు సినిమాతో తెలుగు ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన కిరణ్ అబ్బవరం టాలీవుడ్ లో ఉన్న ఇతర యంగ్ హీరోలకు ఏమాత్రం తగ్గకుండా వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. కేవలం చిన్న బ్యానర్లు కాదు మైత్రీ, గీతా ఆర్ట్స్ లాంటి పెద్ద పెద్ద బ్యానర్లలో సినిమాలు చేస్తున్నాడు. ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉండగా.. అందులో నేను మీకు బాగా కావాల్సిన వాడిని సినిమా కూడా ఒకటి. శ్రీధర్ గాదే దర్శకత్వంలో ఈసినిమా తెరకెక్కుతుంది. ఇక ఈసినిమా షూటింగ్ ను పూర్తి చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ పనులను ముగించుకుంటుంది. ఇక ఈసినిమా నుండి టీజర్ ను నేడు రిలీజ్ చేస్తున్నట్టు రెండు రోజుల క్రితమే అప్ డేట్ ఇచ్చారు మేకర్స్. చెప్పినట్టే…

'మాచర్ల నియోజకవర్గం' మాస్ సాంగ్ రిలీజ్
నితిన్ హీరోగా ఎంఎస్ రాజశేఖర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా 'మాచర్ల నియోజకవర్గం'. పొలిటికల్ ఎలిమెంట్స్ తో మాస్, కమర్షియల్ ఎంటర్ టైనర్ గా ఈసినిమాను తెరకెక్కిస్తున్నారు. ప్రస్తుతం అయితే ఈసినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటుంది. ఇక మరోవైపు ఈసినిమా అప్ డేట్స్ కూడా అప్పుడప్పుడు ఇస్తూనే ఉన్నారు. ఇక ఈసినిమా రిలీజ్ దగ్గర పడుతుండటంతో ప్రమోషన్ కార్యక్రమాలు కూడా భారీగా చేస్తున్నారు. దీనిలో భాగంగానే పాటలు రిలీజ్ చేస్తూ బజ్ క్రియేట్ చేస్తున్నారు. ఇప్పటికే రా రా రెడ్డి.. ఐ యామ్ రెడీ అనే మాస్ సాంగ్ పాటను రిలీజ్ చేశారు. ఇప్పుడు తాజాగా ఈసినిమా ఫుల్ లిరికల్ సాంగ్ ను రిలీజ్ చేశారు మేకర్స్. ఈ…

'ది ఘోస్ట్' ఫస్ట్ గ్లింప్స్ రిలీజ్ రిలీజ్ డేట్ ఫిక్స్..!
ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో నాగార్జున హీరోగా వస్తున్న సినిమా ది ఘోస్ట్. ఈసినిమా షూటింగ్ చివరి దశలో ఉండగా మరోవైపు పోస్ట్ ప్రొడక్షన్ పనులను కూడా చూసుకుంటుంది. ఇక ఇప్పటికే ఈసినిమా పలు పోస్టర్లు రిలీజ్ చేయగా తాజాగా ఈసినిమా గ్లింప్స్ ను రిలీజ్ చేశారు మేకర్స్. ఇక గ్లింప్స్ లో నాగ్ కోపం వచ్చినప్పుడు అన్స్టాపబుల్ కిల్లింగ్ మెషిన్ గా నాగ్ మారతాడని అర్ధం అవుతుంది. అంతేకాదు.. గోస్ట్ తో ఎప్పుడు గొడవ పడకండి అంటూ ఈ వీడియోలో చెప్పుకొచ్చారు. బ్యాక్ గ్రౌండ్ స్కోర్.. అలాగే విజువల్స్ కూడా ఆకట్టుకుంటున్నాయి. ఈ గ్లింప్స్ తో ఈ సినిమాపై మరింత అంచనాలు పెంచేశారని చెప్పొచ్చు. ఇక రిలీజ్ డేట్ ను కూడా ప్రకటించారు…

ఆది సాయి కుమార్ "తీస్ మార్ ఖాన్"రిలీజ్ డేట్
విజన్ సినిమాస్ బ్యానర్ పై నాటకం ఫేమ్ కల్యాణ్ జీ గోగణ దర్శకత్వం లో ఆది సాయికుమార్ , పాయల్ రాజ్ పుత్ జంటగా మాస్ యాక్షన్ థ్రిల్లర్ "తీస్ మార్ ఖాన్" మూవీ తెరకెక్కిన విషయం తెలిసిందే. ఈ మూవీ లో సునీల్ , పూర్ణ , కబీర్ దుహాన్ సింగ్ , ఠాకూర్ అనూప్ సింగ్ ముఖ్య పాత్రలలో నటించారు. సాయి కార్తీక్ సంగీతం అందించారు. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ , , టీజర్ ట్రైలర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.

హీరో రామ్ చరణ్ కు వెల్లు వెత్తుతున్న బాలీవుడ్ ఆఫర్స్
స్టార్ డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వంలో రామ్ చరణ్ , ఎన్టీఆర్ లు హీరోలుగా భారీ బడ్జెట్ , భారీ తారాగణం తో తెరకెక్కిన "ఆర్ ఆర్ ఆర్ "మూవీ ప్రపంచవ్యాప్తం గా ప్రేక్షకాదరణతో భారీ కలెక్షన్స్ రాబట్టిన విషయం తెలిసిందే. బాలీవుడ్ లో భారీ వసూళ్లు సాధించి ఈ మూవీ రికార్డ్ క్రియేట్ చేసింది. మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు క్యారెక్టర్ లో హీరో రామ్ చరణ్ అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకుల ప్రశంసలు అందుకుని దేశవ్యాప్తం గా క్రేజ్ పొందారు. ఇప్పుడు పలువురు బాలీవుడ్ మేకర్స్ రామ్ చరణ్ హీరోగా మైథలాజికల్ , ఫాంటసీ మూవీస్ కై రామ్ చరణ్ ను సంప్రదిస్తున్నట్టు సమాచారం.

#SSMB 28 మ్యూజిక్ పనులు స్టార్ట్..!
త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా ఒక సినిమా వస్తున్న సంగతి తెలిసిందే కదా. ఇక ఈసినిమా కోసం అందరూ చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈసినిమాను ఎప్పుడో ప్రకటించారు.. ఇటీవల పూజా కార్యక్రమాలు కూడా జరిగాయి. కానీ ఈసినిమా అప్ డేట్ కోసం మాత్రం ఫ్యాన్స్ ఎప్పటినుండో వెయిట్ చేస్తున్నారు. కానీ ఇంతవరకూ ఎలాంటి అప్ డేట్ లేదు. తాజాగా చిత్రయూనిట్ ఈసినిమాకు సంబంధించి సాలిడ్ అప్ డేట్ ఇచ్చారు. ఈసినిమా ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుందని.. ఆగష్ట్ నుండి ఈసినిమా షూటింగ్ ను ప్రారంభించనుందని.. వచ్చే ఏడాది సమ్మర్ కు ప్రేక్షకుల ముందుకు రానున్నట్టు తెలిపారు.

"కార్తికేయ 2 "మూవీ మ్యూజికల్ ప్రమోషన్స్ ప్రారంభం
పీపుల్ మీడియా ఫ్యాక్టరీ , అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్స్ పై చందు మొండేటి దర్శకత్వంలో నిఖిల్ హీరోగా సూపర్ హిట్ థ్రిల్లింగ్ మిస్టరీ “కార్తికేయ మూవీ కి సీక్వెల్ గా తెరకెక్కిన “కార్తికేయ 2 “మూవీ జూలై 22 వ తేదీ తెలుగు , హిందీ భాషలలో రిలీజ్ కానుంది. ఈ మూవీలో అనుపమ పరమేశ్వరన్ కథానాయిక. బాలీవుడ్ యాక్టర్ అనుపమ్ ఖేర్ కీలక పాత్ర లో నటించారు. స్వాతి రెడ్డి , రావు రమేష్ , తనికెళ్ళ భరణి ముఖ్య పాత్రలలో నటించారు. ఈ మూవీ కి కాలభైరవ సంగీతం అందించారు.

"#MEGA 154 " మూవీ సెట్స్ లో శృతి హాసన్
మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై బాబీ (కె ఎస్ రవీంద్ర )దర్శకత్వంలో చిరంజీవి , శృతి హాసన్ జంటగా వాల్తేరు వీరయ్య మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే.ఈ మూవీలో శృతి హాసన్ కథానాయిక . బిజూ మీనన్ , మాస్ మహారాజ రవి తేజ కీలక పాత్రలలో నటిస్తున్నారు. ఈ మూవీ కి దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.”వాల్తేరు వీరయ్య ”(వర్కింగ్ టైటిల్ ) మూవీ శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటున్న విషయం తెలిసిందే. “వాల్తేరు వీరయ్య “మూవీ లో మెగా స్టార్ చిరంజీవి మత్స్య కారుడిగా , మత్స్య కారులకు నాయకుడిగా ఒక పక్కా మాస్ క్యారెక్టర్ లో నటిస్తున్నారు.చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.

మరో బాలీవుడ్ మూవీ లో రష్మిక ?
పలు బ్లాక్ బస్టర్ మూవీస్ లో తన అందం , అభినయం తో ప్రేక్షకులను అలరిస్తూ సక్సెస్ ఫుల్ చిత్ర హీరోయిన్ గా రాణిస్తున్న రష్మిక నేషనల్ క్రష్ గా మారారు.దుల్కర్ సల్మాన్ “సీతారామం”మూవీ లో నటిస్తున్న రష్మిక కథానాయిక గా “పుష్ప :ది రూల్”మూవీ త్వరలో సెట్స్ పైకి వెళ్ళనుంది. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై వంశీ పైడిపల్లి దర్శకత్వంలో దళపతి విజయ్ హీరో గా తెలుగు , తమిళ భాషలలో తెరకెక్కుతున్న “#THALAPATHY 66 “మూవీ లో విజయ్ కు జోడీగా రష్మిక నటిస్తున్నారు. రష్మిక కథానాయికగా రూపొందిన బాలీవుడ్ మూవీ “మిషన్ మజ్ను ”విడుదలకు సిద్ధంగా ఉంది. బిగ్ బీ అమితాబ్ “గుడ్ బై “ , రణ్ బీర్ కపూర్ “యానిమల్ “ బాలీవుడ్ మూవీస్ లో…

సోషల్ మీడియా లో పవన్ కళ్యాణ్ హవా
మెగా సూర్య ప్రొడక్షన్ బ్యానర్‌పై క్రియేటివ్ డైరెక్టర్ క్రిష్ దర్శకత్వంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా 17వ శతాబ్దం నాటి మొఘలాయిలు, కుతుబ్ షాహీల కాలం నేపథ్యంలో భారీ సెట్స్ , భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న పీరియాడికల్ యాక్షన్ అడ్వెంచర్ “హరి హర వీరమల్లు ” పాన్ ఇండియా మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. నిధి అగర్వాల్ , నర్గీస్ ఫక్రి కథానాయికలు.తాజా అప్ డేట్ ప్రకారం త్వరలోనే షూటింగ్ లో పవన్ పాల్గొంటారని సమాచారం. మొదట “హరిహర వీరమల్లు” చిత్రీకరణ మొదలుపెట్టి వీలైనంత త్వరగా పూర్తి చేయాలనుకుంటున్నారనీ , ఆ తరువాత సముద్రఖని డైరెక్షన్‌లో చేయబోతున్న” వినోధయ సీతమ్”తమిళ మూవీ…

'సీతారామం' సుమంత్ ఫస్ట్ లుక్ రిలీజ్..!
అందాల రాక్షసి, కృష్ణ గాడి వీర ప్రేమ గాధ, పడి పడి లేచే మనసు లాంటి ప్రేమ కథలతో తెలుగు ప్రేక్షకులను అలరించిన డైరెక్టర్ హను రాఘవపూడి. ఇక ఇప్పుడు మరో డిఫరెంట్ కథతో వస్తున్నాడు. మలయాళం సూపర్ స్టార్ దుల్కర్ సల్మాన్ హీరోగా ఈసినిమా తెరకెక్కుతుండగా.. పాన్ ఇండియా రేంజ్ లో ఈసినిమాను రూపొందించారు. ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. మిలటరీ ప్రేమ కథగా ఈసినిమా రాబోతుందని అర్థమవుతుంది. ఇక ఈసినిమాలో నటిస్తున్న పాత్రలకు సంబంధించిన పోస్టర్లను ఒక్కొక్కటిగా రిలీజ్ చేస్తున్న సంగతి తెలిసిందే కదా.

మహేష్-త్రివిక్రమ్ మూవీ సాలిడ్ అప్ డేట్.. ఆగష్ట్ నుండి షూటింగ్..!
మహేష్-త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో సినిమా అంటే సినీ లవర్స్ అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు. వీరిద్దరి కాంబినేషన్ లో ఇప్పటికే అతడు, ఖలేజా సినిమాలు వచ్చాయి. అతడు సినిమా హిట్ అయింది కానీ ఖలేజా సినిమా మాత్రం బాక్సాఫీస్ వద్ద బోల్తాకొట్టింది. అయితే రిజల్ట్ సంగతి పక్కన పెడ్డితే ఈసినిమా చాలా మందికి మాత్రం నచ్చుతుంది. మహేష్ బాబు లోని కామెడీ యాంగిల్ ను ఈసినిమాతో బయటకు తీసుకొచ్చాడు త్రివిక్రమ్. ముఖ్యంగా మహేష్ కామెడీకి ఫిదా అయిన వారు చాలా మంది ఉన్నారు. ఇక చాలా యేళ్ల తరువాత వీరిద్దరి కాంబినేషన్ లో మూడో సినిమా వస్తుంది. ఈసినిమా ఎప్పుడో అధికారికంగా ప్రటించారు మేకర్స్. ఇప్పటికే పూాజా…

తండ్రి హెల్త్ రూమర్స్ పై తనయుడి క్లారిటీ..!
తమిళ్ స్టార్ హీరో విక్రమ్ నిన్న కాస్త ఆస్వస్థతకు గురైన సంగతి తెలిసిందే కదా. దీంతో విక్రమ్ ను చెన్నైలోని కావేరీ హాస్పిటల్ లో జాయిన్ చేశారు. ప్రస్తుతం విక్రమ్ బాగానే ఉన్నారు.. ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఇప్పటికే సన్నిహితులు తెలియచేశారు. అయితే విక్రమ్ ఆరోగ్య పరిస్థితులపై కొన్ని తప్పుడు కథనాలు కూడా వచ్చాయి. విక్రమ్ గుండెపోటుకు గురయ్యారని.. అందుకే హాస్పిటల్ లో జాయిన్ అయ్యారని వార్తలు వచ్చాయి. అయితే ఈవార్తలపై స్పందించిన విక్రమ్ తనయుడు ధృవ్ క్లారిటీ ఇచ్చాడు.