
ట్యాగ్ · 4407 కథనాలు · పేజీ 112


రాజ్యసభ సభ్యత్వం పై చిరు స్పందన..!

మేనల్లుడి తో రాశీ ఖన్నా "థ్యాంక్యూ "

సూపర్ హీరో "థోర్ "కి సాయి తేజ్ ప్రమోషన్

ఎడిటర్ గౌతంరాజు కుటుంబానకి 'చిరు' సాయం..!

సమంత బాలీవుడ్ ఎంట్రీ ?

ఫైటర్ పైలట్ క్యారెక్టర్ లో రెజీనా

వైజాగ్ లో "ఖుషి" మూవీ సెకండ్ షెడ్యూల్

టర్కీ లో "#NBK107 "షూటింగ్ ?

'భలే భలే మగాడివోయ్' సీక్వెల్ ప్లాన్

సూపర్ హీరో పాత్రలో చేయాలనుంది..!

'డ్రైవర్ జమున' ట్రైలర్ రిలీజ్

'RC 15'.. 1200 మందితో యాక్షన్ సీక్వెన్స్..!

"యాత్ర "దర్శకుడి వెబ్ సిరీస్ "సైతాన్ "

సాయి పల్లవి 'గార్గి' ట్రైలర్ రిలీజ్
లవ్ స్టోరీ, శ్యామ్ సింగరాయ్, విరాట పర్వం ఇలా వరుస విజయాలతో ప్రస్తుతం ఫుల్ ఫామ్ లో ఉంది టాలెంటెడ్ నటి సాయి పల్లవి . మొదటి నుండి పాత్ర ప్రధానమైన సినిమాలను ఎంచుకుంటూ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. ఇక ఇప్పుడు మరో లేడీ ఒరియెంటెడ్ సినిమాతో వస్తుంది. గౌతమ్ రామచంద్రన్ దర్వకత్వంలో సాయి పల్లవి ప్రధాన పాత్రలో వస్తున్న సినిమా గార్గి. ఈసినిమా ప్రస్తుతం రిలీజ్ కు సిద్దమవుతుంది. జులై 15న ఈసినిమా రిలీజ్ అవుతున్న నేపథ్యంలో ఈసినిమా ప్రమోషన్స్ ను స్టార్ట్ చేశారు.

రాజ్యసభ సభ్యత్వం పై చిరు స్పందన..!
సినీ పరిశ్రమ నుండి రాజ్యసభ సభ్యులుగా ప్రముఖ సంగీత దర్శకుడు మ్యాస్ట్రో ఇళయరాజాను అలానే ప్రముఖ రచయిత విజయేంద్ర ప్రసాద్ ను నియమిస్తున్నట్లు స్వయంగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన సంగతి తెలిసిందే కదా. ఈమేరకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ స్వయంగా తమ ట్విట్టర్ ద్వారా వారికి అభినందనలు తెలుపుతూ మరీ పోస్ట్ చేశారు.

మేనల్లుడి తో రాశీ ఖన్నా "థ్యాంక్యూ "
మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సమర్పణ లో GA 2 పిక్చర్స్ , యు వి క్రియేషన్స్ బ్యానర్స్ పై మారుతి దర్శకత్వంలో యాక్షన్ చిత్ర హీరో గోపీచంద్ , అందాల రాశీ ఖన్నా జంటగా తెరకెక్కిన కామెడీ ఎంటర్ టైనర్ “పక్కా కమర్షియల్” మూవీ జులై 1 వ తేదీ గ్రాండ్ గా రిలీజ్ అయ్యి అద్భుతమైన కలెక్షన్స్ తో దూసుకుపోతోంది. మూడు రోజులలోనే బ్రేక్ ఈవెన్ సాధించిన ఈ మూవీ లో గోపీచంద్, రాశీ ఖన్నా ల పెర్ఫార్మెన్స్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. హీరో గోపీచంద్ , రాశీ ఖన్నా ల కెమిస్ట్రీ ప్రేక్షకులను అలరించింది.విక్రమ్ కె కుమార్ దర్శకత్వంలో నాగచైతన్య , రాశీ ఖన్నా జంటగా తెరకెక్కిన “థ్యాంక్యూ “మూవీ విడుదలకు సిద్ధంగా ఉంది.

సూపర్ హీరో "థోర్ "కి సాయి తేజ్ ప్రమోషన్
హాలీవుడ్ లో సూపర్ హీరో ఫ్రాంఛైజీ `థోర్` ఈ కేటగిరీలో పెద్ద సక్సెసైంది. థోర్ కి నేటితరం కిడ్స్ లో బోలెడంత ఫాలోయింగ్ ఉంది.ఇక థోర్ కి ఉన్నట్టే సుప్రీం హీరో సాయిధరమ్ తేజ్ కి కూడా కిడ్స్ లో కొంత ఫాలోయింగ్ ఉంది. అతడి మ్యాన్ లీ నెస్ .. మంచితనం అన్ని జనరేషన్ల వారికి నచ్చుతుంది. అందుకేనేమో.. ఇప్పుడు థోర్ కి సాయి తేజ్ ప్రమోషన్ చేస్తున్నారు.

శ్రీకాకుళంలో "మాచర్ల నియోజకవర్గం "మాస్ జాతర
రాజ్ కుమార్ ఆకెళ్ల సమర్పణలో ఆదిత్య మూవీస్ & ఎంటర్టైన్మెంట్స్ , శ్రేష్ఠ్ మూవీస్ బ్యానర్స్ పై ఎడిటర్ శేఖర్ దర్శకత్వంలో నితిన్ ,బ్లాక్ బస్టర్ “ఉప్పెన”మూవీ ఫేమ్ కృతి శెట్టి జంటగా సోషల్ మెసేజ్ తో తెరకెక్కుతున్న పొలిటికల్ థ్రిల్లర్ “మాచర్ల నియోజకవర్గం” మూవీ ఆగస్ట్ 12వ తేదీ రిలీజ్ కానుంది. ఈ మూవీ లో క్యాథరీన్ మరో కథానాయిక. ప్రభుత్వ ఆఫీసర్ గా నితిన్ నటిస్తున్న ఈ మూవీలో విలన్ గా సముద్ర ఖని నటిస్తున్నారు. మహతి సాగర్ సంగీతం అందిస్తున్నారు. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన “మాచర్ల నియోజకవర్గం” మూవీ పోస్టర్‌లు, గ్లింప్స్ కు కూడా ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి.

ఎడిటర్ గౌతంరాజు కుటుంబానకి 'చిరు' సాయం..!
ఇప్పటి వరకూ ఎంతో మంది సినీ ప్రముఖులను కోల్పోయిన తెలుగు ఇండస్ట్రీ ఇప్పుడు మరో ప్రముఖ ఎడిటర్ ను కోల్పోయిన సంగతి తెలిసిందే కదా. సీనియర్ ఎడిటర్ గౌతంరాజు నిన్న మృతి చెందిన సంగతి తెలిసిందే కదా. వయసు రీత్యా వచ్చిన అనారోగ్య సమస్యలతో గతకొద్దికాలంగా బాధపడుతున్న ఆయన నిన్న తుదిశ్వాస విడిచారు. ఈనేపథ్యంలో చిత్ర పరిశ్రమనుండి ప్రముఖులు అందరూ ఆయన మృతి పట్ల విచారం వ్యక్తం చేశారు.

సమంత బాలీవుడ్ ఎంట్రీ ?
టాలీవుడ్ , కోలీవుడ్ లలో పలు బ్లాక్ బస్టర్ మూవీస్ లో తన అందం , అభినయం తో ప్రేక్షకులను ఆకట్టుకుంటూ సమంత స్టార్ హీరోయిన్ గా రాణిస్తున్న విషయం తెలిసిందే.గుణ శేఖర్ దర్శకత్వంలో సమంత ప్రధాన పాత్రలో తెరకెక్కిన మైథలాజికల్ మూవీ “శాకుంతలం” ఉమెన్ సెంట్రిక్ ఫిల్మ్ “యశోద” మూవీస్ విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. క్రేజీ హీరో విజయ్ దేవరకొండ కథానాయకుడిగా తెరకెక్కుతున్న ”ఖుషి”మూవీ లో విజయ్ కు జోడీగా సమంత నటిస్తున్న విషయం తెలిసిందే.

ఫైటర్ పైలట్ క్యారెక్టర్ లో రెజీనా
“శివ మనసులో శృతి “మూవీ తో టాలీవుడ్ కు కథానాయికగా పరిచయం అయిన తమిళ హీరోయిన్ రెజీనా తమిళ , తెలుగు భాషల పలు సూపర్ హిట్ మూవీస్ లో తన అందం , అభినయం తో ప్రేక్షకులను అలరిస్తున్నారు. రెజీనా ప్రస్తుతం “పార్టీ”,”కళ్ళపార్టు “, “కాసాడ తపరా”(తమిళ ), తెలుగు , తమిళ భాషల “శూర్పాంగనై” , తెలుగు , తమిళ భాషల“శాకినీ ఢాకినీ ” మూవీస్ లో కథానాయికగా నటిస్తున్నారు. “రాకెట్ బాయ్స్” హిందీ వెబ్ సిరీస్ లో నటించిన రెజీనా ప్రస్తుతం "శూర్ వీర్"హిందీ వెబ్ సిరీస్ లో నటిస్తున్నారు.

'పొన్నియన్ సెల్వన్' త్రిష ఫస్ట్ లుక్ రిలీజ్..!
మణిరత్నం దర్శకత్వంలో వస్తున్న మోస్ట్ అవైటెడ్ సినిమా పొన్నియన్ సెల్వన్. ఈసినిమా చోళరాజుల కాలానికి సంబంధించిన నేపథ్యంలో.. ఒక సంఘటన ఆధారంగా తెరకెక్కిస్తున్నట్టు తెలుస్తుంది. ఇక ఈసినిమా ప్రస్తుతం రిలీజ్ కు సిద్దమవుతుండగా.. మరోపక్క ప్రమోషన్స్ ను స్టార్ట్ చేశారు. ఈ క్రమంలో చిత్రబృందం వరుసగా అప్‌డేట్‌లను ఇస్తుంది. ప్రతిరోజు ఈసినిమాలో నటించిన నటీనటుల పోస్టర్‌లను విడుదల చేస్తూ సినిమాపై క్యూరియాసిటీని పెంచుతున్నారు. అందులో భాగంగా ఇప్పటికే విక్రమ్, జయం రవి, కార్తీ లుక్‌లు విడుదలవ్వగా.. నిన్న ఐశ్వర్య రాయ్ ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు మేకర్స్. తాజాగా ఈ చిత్రంలోని త్రిష ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను…

వైజాగ్ లో "ఖుషి" మూవీ సెకండ్ షెడ్యూల్
పూరి జగన్నాథ్ దర్శకత్వంలో క్రేజీ హీరో విజయ్ దేవరకొండ , అనన్య పాండే జంటగా బాక్సింగ్ నేపథ్యంలో తెలుగు , హిందీ భాషలలో తెరకెక్కిన పాన్ ఇండియా “లైగర్ ” మూవీ ఆగస్ట్ 25 వ తేదీ రిలీజ్ కానుంది. “లైగర్ ” మూవీతో విజయ్ బాలీవుడ్ కు కథానాయకుడిగా పరిచయం అవుతున్నారు. ప్రస్తుతం శివ నిర్వాణ దర్శకత్వంలో "ఖుషి" మూవీ లో నటిస్తున్న హీరో విజయ్, పూరి జగన్నాథ్ దర్శకత్వంలో "జనగణమన" మూవీ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే.

'ది ఘోస్ట్' మూవీ.. ఫస్ట్ గ్లింప్స్ రిలీజ్ డేట్ ఫిక్స్..!
ఈ ఏడాది బంగార్రాజు సినిమాతో మంచి హిట్ ను తన ఖాతాలో వేసుకున్నాడు కింగ్ నాగార్జున. ఇక ఇప్పుడు మరో యాక్షన్ ఎంటర్ టైనర్ తో వచ్చేస్తున్నాడు. ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో నాగార్జున హీరోగా వస్తున్న సినిమా 'ది ఘోస్ట్'. ఈసినిమా ఎప్పుడో ప్రకటించి.. ఎప్పుడో మొదలుపెట్టారు కూడా. మధ్యలో కరోనా వల్ల కొంత గ్యాప్ రాగా.. ఇటీవలే ఈసినిమా షూటింగ్ ను మొదలుపెట్టి ప్రస్తుతం షూటింగ్ ను పూర్తి చేసే పనిలో ఉన్నారు. దాదాపు షూటింగ్ చివరి దశకు చేరుకున్నట్టు తెలుస్తుంది. ఇక ఒక వైపు షూటింగ్ చేస్తూనే మరోవైపు పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా పూర్తి చేస్తున్నారట చిత్రయూనిట్.

టర్కీ లో "#NBK107 "షూటింగ్ ?
మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై గోపీచంద్ మలినేని దర్శకత్వంలో బాలకృష్ణ హీరోగా వాస్తవ సంఘటనలతో యాక్షన్ ఎంటర్ టైనర్ “#NBK 107 “మూవీ శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటుంది. శృతి హాసన్ కథానాయిక. వరలక్ష్మి శరత్ కుమార్ , దునియా విజయ్ ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. చంద్రిక రవి ఒక స్పెషల్ సాంగ్ లో నటిస్తున్నారు. థమన్ ఎస్ సంగీతం అందిస్తున్నారు.చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన “#NBK 107 “మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ ప్రేక్షకులను ఆకట్టుకుని వైరల్ గా మారింది.బాలకృష్ణ బర్త్ డే (జూన్ 10)సందర్భంగా చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన ఫస్ట్ హంట్ 10 మిలియన్ వ్యూస్ కు పైగా సాధించి దూసుకుపోతోంది.

'భలే భలే మగాడివోయ్' సీక్వెల్ ప్లాన్
ఈరోజుల్లో సినిమాతో తెలుగు సినీ పరిశ్రమకు దర్శకుడిగా పరిచయమయ్యాడు మారుతి. ఇక ఆసినిమా యూత్ కి బాగా కనెక్ట్ అయి హిట్ అయింది. ఆ తరువాత కూడా యూత్ టార్గెట్ గా ఒకటి రెండు సినిమాలు తీసినా.. తను తీసిన కామెడీ హార్రర్ మూవీ ప్రేమకథా చిత్రమ్ సినిమా మాత్రం కెరీర్ టర్నింగ్ పాయింట్ అయింది. ఇక ఇప్పటి వరకూ దాదాపు తన మార్క్ కామెడీతో ప్రేక్షకులను అలరిస్తూనే ఉన్నాడు. దర్శకుడిగా తనని తాను నిరూపించుకుంటూనే ఉన్నాడు. రీసెంట్ గానే పక్కా కమర్షియల్ సినిమాతో మరో డీసెంట్ హిట్ ను సొంతం చేసుకున్నాడు. గోపీచంద్-రాశీఖన్నా హీరో హీరోయిన్లుగా మారుతి దర్శకత్వంలో వచ్చిన ఈసినిమాకు మంచి టాకే వచ్చింది.

రాజ్యసభకు నామినేట్ అయిన సినీ ప్రముఖులు ఇళయరాజా , విజయేంద్రప్రసాద్
మ్యూజిక్ కంపోజర్ , సింగర్ , లిరిసిస్ట్ ఇళయరాజా తమిళ , తెలుగు భాషలలో పలు బ్లాక్ బస్టర్ మూవీస్ కు సంగీతం అందించి ప్రేక్క్షకులను అలరిస్తున్న విషయం తెలిసిందే. నాలుగున్నర దశాబ్దాలుగా తమిళ , తెలుగు భాషలలో సుమారు 1400 సినిమాలకు సంగీత దర్శకుడిగా పని చేశారు. సుమారు 20000 స్టేజ్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేశారు. 5 నేషనల్ అవార్డ్స్ అందుకున్న ఇసై జ్ఞాని , మ్యాస్ట్రో ఇళయరాజా ను పద్మ విభూషణ్ , పద్మ భూషణ్ పురస్కారాలతో కేంద్ర ప్రభుత్వం సత్కరించింది.

సూపర్ హీరో పాత్రలో చేయాలనుంది..!
ప్రతి ఒక్క హీరో, హీరోయిన్ కు డ్రీమ్ రోల్స్ అంటూ కొన్ని ఉంటాయి. ఎన్ని సినిమాలు చేసినా తమకంటూ కొన్ని పాత్రల్లో చేయాలని ఉంటుంది. అప్పుడప్పుడు తమ డ్రీమ్ రోల్స్ గురించి ఇంటర్వ్యూలలో బయటపెడుతుంటారు. ఇక తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న తాప్సీ కూడా తన డ్రీమ్ రోల్ ఏంటో బయటపెట్టింది. తాప్సీ ప్రధాన పాత్రలో భారత మహిళా వన్డే క్రికెట్ జట్టు కెప్టెన్ మిథాలీ రాజ్ జీవితం ఆధారంగా శభాష్ మిథు టైటిల్ తో ఆమె బయోపిక్ వస్తున్న సంగతి తెలిసిందే కదా. ఈ బయోపిక్ లో మిథాలీ జీవితానికి సంబంధించి.. తన క్రికెట్ ఆరంగేట్రం గురించి ఎన్నో కీలకమైన అంశాలను చూపించనున్నారు. ఇక ఈసినిమా ప్రస్తుతం అయితే రిలీజ్ కు సిద్దమవుతుంది. జులై…

'డ్రైవర్ జమున' ట్రైలర్ రిలీజ్
ఐశ్వర్య రాజేష్ తెలుగు ప్రేక్షకులకు పరిచయం అవసరం లేని పేరు. విభిన్నమైన కథలతో.. తన నటనతో నటిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది ఐశ్వర్య రాజేష్. కౌసల్యాకృష్ణమూర్తి సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన ఐశ్వర్య రాజేష్.. విజయ్ దేవరకొండ తో వరల్డ్ ఫేమస్ లవర్ అలానే నానితో కలిసి టక్ జగదీష్ చిత్రాల్లో నటించింది. ఇక ఇప్పుడు తాజాగా 'డ్రైవర్ జమున' పేరుతో మరో డిఫరెంట్ మూవీతో ప్రేక్షకులని అలరించడానికి సిద్ధమవుతున్నారు. లేడీ క్యాబ్ డ్రైవర్ జీవితంలో చోటు చేసుకున్న నాటకీయ సంఘటనల నేపధ్యంలో 'డ్రైవర్ జమున' చిత్రాన్ని థ్రిల్లింగ్ గా రూపొందిస్తున్నారు. ఇక ఈసినిమా ప్రస్తుతం రిలీజ్ కు సిద్దమవుతుంది. ప్రస్తుతం…

'RC 15'.. 1200 మందితో యాక్షన్ సీక్వెన్స్..!
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా శంకర్ డైరెక్షన్‌లో ఒక సినిమా వస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతానికి 15 అనే వర్కింగ్ టైటిల్ తోనే షూటింగ్ ను జరుపుకుంటుంది. ఇక లెజెండరీ డైరెక్టర్, స్టార్ హీరో రామ్ చరణ్ కాంబినేషన్ లో వస్తున్న సినిమా కాబట్టి మొదటి నుండీ భారీ ఎక్స్ పెక్టేషన్సే ఉన్నాయి. ఇక ఆ అంచనాలకు ఎక్కడా తగ్గకుండా శంకర్ కూడా ఆదే స్థాయిలో తెరకెక్కిస్తున్నాడు. ఇక ఇప్పటికే ఈసినిమా మొదలుపెట్టారు కూడా. అయితే మధ్యలో ఆర్ఆర్ఆర్, ఆచార్య సినిమాల వల్ల గ్యాప్ తీసుకున్నాడు. ఆ తరువాత మళ్లీ షూటింగ్ లో పాల్గొన్నాడు. ప్రస్తుతం అయితే శరవేగంగా షూటింగ్ జరుగుతుంది.

'లైగర్' ఫస్ట్ సింగిల్ అప్ డేట్..!
విజయ్ దేవరకొండ హీరోగా పూరి జగన్నాధ్ దర్శకత్వంలో తెరకెక్కిన లేటెస్ట్ చిత్రం ‘లైగర్’. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులలో బిజీగా ఉంది. ఈసినిమా ఆగష్ట్ 25వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటి వరకూ ఈసినిమా నుండి పలు పోస్టర్లు, గ్లింప్స్ చేసిన సంగతి తెలిసిందే కదా. ఇక రీసెంట్ గా న్యూడ్ పిక్ రిలీజ్ చేసి మరింత బజ్ క్రియేట్ చేశాడు విజయ్ దేవరకొండ. ఇక ఈ సినిమా రిలీజ్ కు సరిగ్గా 50 రోజులు ఉంది. దీంతో ఈసినిమా ప్రమోషన్స్ ను వేగవంతం చేయనున్నారు మేకర్స్. దీనిలో భాగంగానే నేడు సర్ ప్రైజింగ్ అప్ డేట్ తో వచ్చేశారు మేకర్స్. ఈసినిమా ఫస్ట్ సింగిల్ కు సంబంధించిన…

"యాత్ర "దర్శకుడి వెబ్ సిరీస్ "సైతాన్ "
"పాఠశాల"మూవీ తో టాలీవుడ్ కు దర్శకుడిగా పరిచయం అయిన మహి వి. రాఘవ్ "ఆనందో బ్రహ్మ", "యాత్ర" మూవీస్ తో గుర్తింపు పొందారు. ఆయన దర్శకుడిగా పరిచయం అయ్యారు. ఆ తర్వాత తీసిన 'ఆనందో బ్రహ్మ', ముఖ్యంగా 'యాత్ర'తో పేరు, గుర్తింపు పొందారు. విమర్శకులతో పాటు ప్రేక్షకుల ప్రశంసలు అందుకున్న యువ దర్శకుడు ఇప్పుడు ఒక వెబ్ సిరీస్ తెరకెక్కిస్తున్నారు.

'రామారావు ఆన్ డ్యూటీ'.. వేణు ఫస్ట్ లుక్ రిలీజ్..!
మాస్ మహారాజా రవితేజ వరుస సినిమాలతో ఫుల్ బిజి బిజీగా ఉన్నాడు. ఆ లిస్టులో ఉన్న సినిమాల్లో ‘రామారావు ఆన్ డ్యూటీ’ కూడా ఒకటి. ఈసినిమా ఇప్పటికే రిలీజ్ అవ్వాలి కానీ పలు కారణాల వల్ల వాయిదా పడింది. ఇక ఫైనల్ గా జులై29న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు చివరి దశలో ఉండగా.. ప్రమోషన్స్ మాత్రం ఎప్పుడో మొదలుపెట్టారు. ఇప్పటికే ఈసినిమా నుండి విడుదలైన మూవీ పోస్టర్‌లు, టీజర్ ప్రేక్షకులని ఆకట్టుకున్నాయి. ఫుల్ యదార్థ ఘటనల ఆధారంగా ప్యాక్డ్ యాక్షన్‌తో ఈసినిమాను తెరకెక్కిస్తున్నారు.