‘కోబ్రా’ తెలుగు హక్కులు సొంతం చేసుకున్న ఎన్వీఆర్ సినిమా

Vikram Cobra Telugu States Rights Bagged By NV Prasad,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, Cobra,Cobra Movie,Cobra Telugu Movie,Cobra Movie Updates,Cobra Movie Latest Updates,Cobra Upcoming movie of Vikram,Vikram,Hero Vikram Cobra Movie Updates, Cobra Telugu Movie Rights Bagged By NV Prasad,NV Prasad Bagged Vikram Cobra Telugu Movie Rights,Cobra Telugu Movie Rights,Vikram Upcoming Movies,Vikram New Movie Updates, Cobra Telugu State Rights Bagged By NV Prasad,Srinidhi Shetty And Vikram,Srinidhi Shetty Cobra Movie,Srinidhi Shetty and Vikram in Cobra Movie

ప్రయోగాత్మక చిత్రాలతో అనేక సూపర్‌హిట్‌లు, బ్లాక్‌బస్టర్‌లను సొంతం చేసుకున్న చియాన్ విక్రమ్, అసాధారణ సినిమాలతో ఆకట్టుకునే దర్శకుడు ఆర్ అజయ్ జ్ఞానముత్తు దర్శకత్వంలో తెరకెక్కిన యాక్షన్ థ్రిల్లర్ ‘కోబ్రా’. ఈ కాంబినేషన్ లో సినిమా వస్తుండటంతో ప్రేక్షకులు కూడా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.ఇక సెవెన్ స్క్రీన్ స్టూడియోస్ బ్యానర్‌పై ఎస్ఎస్ లలిత్ కుమార్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

కాగా ఈసినిమా తెలుగులో కూడా రిలీజ్ అవుతున్న సంగతి తెలిసిందే కదా. ఇక ఈసినిమా తెలుగు హక్కులను ప్రొడక్షన్, డిస్ట్రిబ్యూషన్ బిజినెస్‌లో కీలకంగా వ్యవహరిస్తున్న ఎన్వీ ప్రసాద్ సొంతం చేసుకున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎన్వీఆర్ సంస్థ ద్వారా ఈసినిమా భారీగానే రిలీజ్ చేయనున్నారు.

కాగా ఈ సినిమాలో విక్రమ్ గణితశాస్త్ర మేధావి పాత్రలో నటిస్తున్నారు. శ్రీనిధి శెట్టి హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో ఇండియన్ వెటరన్ బౌలర్ ఇర్ఫాన్ పఠాన్ కీలక పాత్రలో నటిస్తున్నాడు. మియా జార్జ్, రోషన్ మాథ్యూ, కేఎస్ రవికుమార్, మృణాళిని రవి ఇతర ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. హరీష్ కన్నన్ సినిమాటోగ్రాఫర్ గా పని చేస్తున్నారు. ఆగస్ట్ 11న ఈ సినిమా తెలుగు, తమిళం, హిందీ భాషల్లో ఏకకాలంలో విడుదల కానుంది.

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.