‘పొన్నియన్ సెల్వన్’ టీజర్ రిలీజ్

Superstar Mahesh Babu Released Ponniyin Selvan Telugu Teaser,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, Ponniyin Selvan Teaser Released By Top Stars,Ponniyin Selvan Teaser Released By Top Stars Mahesh Babu,Suriya,Amitabh Bachchan,Mohanlal,And Rakshit Shetty, Mahesh Babu Released Ponniyin Selvan Telugu Teaser,Super Star Mahesh Babu,Mahesh Babu Released Ponniyin Selvan Teaser,Mahesh Babu Released Maniratnams Ponniyin Selvan Movie Teaser, Ponniyan Selvan Latest Telugu Movie,Trisha and Vikram Ponniyan Selvan,Trisha and Vikram,Mani Ratnam’s Ponniyin Selvan Teaser Released By Top Stars, Vikram Ponniyan Selvan Movie Updates,Ponniyan Selvan latest Movie,Ponniyan Selvan Upcoming Movie Teaser Out Now,Ponniyin Selvan Movie Teaser

సినీ ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్న పొన్నియన్ సెల్వన్ టీజర్ ఫైనల్ గా వచ్చేసింది. మణిరత్నం ఈసినిమాకు డైరెక్టర్ అవ్వడం.. దానికి తోడు భారీ బడ్జెట్, భారీ విజువల్స్, భారీ తారగాణంతో వస్తున్న సినిమా అవ్వడంతో ఈసినిమా కోసం అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక ఈసినిమా ప్రస్తుతం రిలీజ్ కు రెడీ అవుతుంది. మరోపక్క ప్రమోషన్స్ ను కూడా చేస్తున్నారు. ఈసినిమాలో కీలక పాత్రల్లో నటిస్తున్న పాత్రలకు సంబంధించి పోస్టర్లను ఇప్పటికే ఒక్కొక్కటిగా రిలీజ్ చేసుకుంటూ వస్తున్నారు. తాజాగా ఈసినిమా టీజర్ ను రిలీజ్ చేశారు. అన్ని భాషల్లో రిలీజ్ చేసిన ఈసినిమా తెలుగు టీజర్ ను సూపర్ స్టార్ మహేష్ బాబు రిలీజ్ చేశారు. న ఫేవరెట్ డైరెక్టర్ మణిరత్నం తెరకెక్కిస్తున్న భారీ సినిమా పొన్నియిన్ సెల్వన్ టీజర్ రిలీజ్ చేయడం ఎంతో థ్రిల్లింగ్ గా ఉందని చెబుతూ టీమ్ కు బెస్ట్ విషెస్ అందించారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక టీజర్ లో యుద్ద నేపథ్యం గురించే చూపించారు. టీజ‌ర్ అంతా యుద్ధ బీభ‌త్స‌మే. గుర్రాలు, ఏనుగులు, క‌త్తులు, దాడులు, ప్ర‌తి దాడులూ ఇలానే సాగింది. పోరాట సన్నివేశాలను హైలైట్ చేశారు. ఆనాటి రాజుల కాలాన్ని ఇప్పుడు ప్రేక్షకులకు కళ్ళకు కట్టినట్లు చూపించబోతున్నారని అర్థమవుతోంది. ఈసినిమా ఖచ్చితంగా ప్రేక్షకులకు విజువల్ ట్రీట్ ఇస్తుందని చెప్పొచ్చు. ఇక ఏ.ఆర్ రెహమాన్ సంగీతం ఈ సినిమాకి హైలైట్ గా నిలిచేలా కనిపిస్తోంది.

కాగా ఈ సినిమాలో ఐశ్వర్య రాయ్, త్రిష, జయం రవి, విక్రమ్, కీర్తి సురేష్, విజయ్ సేతుపతి, కార్తి, ఐశ్వర్య లక్ష్మి, మోహన్ బాబు, జయ రాం, ప్రభు లాంటి స్టార్లు నటించనున్నారు. మద్రాస్‌ టాకీస్, లైకా ప్రొడక్షన్స్‌ బ్యానర్స్ లో సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాకు ఏ.ఆర్.రెహమాన్ సంగీతం అందిస్తున్నారు.

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

15 − seven =