మాస్ మహారాజా రవితేజ మోస్ట్ ఎవైటెడ్ మూవీ ‘రామారావు ఆన్ డ్యూటీ. ఈసినిమా ఇప్పటికే రిలీజ్ అవ్వాలి కానీ కొన్ని కారణాల వల్ల రిలీజ్ కాలేదు. ఫైనల్ గా జూలై 29న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా రిలీజ్ కాబోతుంది. నూతన దర్శకుడు శరత్ మండవ దర్శకత్వంలో 1995 నాటి నేపథ్యంలో యదార్థ సంఘటనల ఆధారంగా తెరకెక్కుతుంది. ఇక ఈసినిమా ప్రమోషన్స్ ను ఎప్పుడో స్టార్ట్ చేశారు. ఇప్పటికే పాటలు, పోస్టర్లు, టీజర్ కూడా రిలీజ్ చేయగా వాటికి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడు ట్రైలర్ రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. దీనికి సంబంధించిన అప్ డేట్ కూడా ఇచ్చారు తాాజాగా. ‘రామారావు ఆన్ డ్యూటీ మాస్ ట్రైలర్ లోడ్ అవుతుందని చెబుతూ.. ట్రైలర్ లోడింగ్ అనౌన్స్ మెంట్ పోస్టర్ రిలీజ్ చేశారు. పోస్టర్ లో రవితేజ క్లాస్ అండ్ స్టైలిష్ గా ఆకట్టుకున్నారు. త్వరలోనే ట్రైలర్ రిలీజ్ డేట్ ప్రకటించనున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
Mass Maharaja is getting ready to give us all a MASSive treat 🔥🔥#RamaRaoOnDuty Trailer Announcement very soon 💥💥#RamaRaoOnDutyOnJuly29@RaviTeja_offl @directorsarat @itsdivyanshak @rajisha_vijayan @SamCSmusic @RTTeamWorks @SLVCinemasOffl @LahariMusic pic.twitter.com/FNM94ZFD1D
— SLV Cinemas (@SLVCinemasOffl) July 8, 2022
కాగా ఈసినిమాలో దివ్యాంక కౌశిక్, రజిష విజయన్ హీరోయిన్లుగా నటిస్తుండగా.. వేణు తొట్టెంపూడి, నాజర్, తనికెళ్లభరణి, పవిత్ర లోకేష్ ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని ఎస్‌ఎల్‌వీ సినిమాస్, ఆర్‌టీ టీం వర్క్స్ బ్యానర్లపై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు. ఈసినిమాకు శ్యామ్ సీఎస్ సంగీతం అందిస్తుండగా సత్యన్ సూర్యన్ సినిమాటోగ్రాఫర్‌గా వర్క్ చేస్తున్నారు.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: