అందాల రాక్షసి, కృష్ణ గాడి వీర ప్రేమ గాధ, పడి పడి లేచే మనసు లాంటి ప్రేమ కథలతో తెలుగు ప్రేక్షకులను అలరించిన డైరెక్టర్ హను రాఘవపూడి. ఇక ఇప్పుడు మరో డిఫరెంట్ కథతో వస్తున్నాడు. మలయాళం సూపర్ స్టార్ దుల్కర్ సల్మాన్ హీరోగా ఈసినిమా తెరకెక్కుతుండగా.. పాన్ ఇండియా రేంజ్ లో ఈసినిమాను రూపొందించారు. ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. మిలటరీ ప్రేమ కథగా ఈసినిమా రాబోతుందని అర్థమవుతుంది. ఇక ఈసినిమాలో నటిస్తున్న పాత్రలకు సంబంధించిన పోస్టర్లను ఒక్కొక్కటిగా రిలీజ్ చేస్తున్న సంగతి తెలిసిందే కదా.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
తాజాగా సుమంత్ పాత్రను రిలీజ్ చేశారు. ఈసినిమాలో సీతారామంలో బ్రిగేడియర్ విష్ణు శర్మగా సుమంత్ నటిస్తున్నాడు. కొన్ని యుద్దాలు మొదలు పెట్టడం మాత్రమే మన చేతుల్లో ఉంటుంది. ముగింపు కాదు..దిస్ ఈజ్ బ్రిగేడియర్ విష్ణు శర్మ.. మద్రాస్ రిజిమెంట్ అంటూ సుమంత్ చెప్పే డైలాగ్ ఆకట్టుకుంటోంది. సినిమాపై అంచనాలను మరింత పెంచేస్తోంది.
Unveiling the first look of yours truly as 𝐁𝐫𝐢𝐠𝐚𝐝𝐢𝐞𝐫 𝐕𝐢𝐬𝐡𝐧𝐮 𝐒𝐡𝐚𝐫𝐦𝐚
from #SitaRamam!🔗https://t.co/Zu0USKQfq6@dulQuer @mrunal0801 @hanurpudi @iamRashmika @Composer_Vishal @VyjayanthiFilms @SwapnaCinema @SonyMusicSouth #SitaRamamOnAug5 pic.twitter.com/kqXbcfflM9
— Sumanth (@iSumanth) July 9, 2022
కాగా వైజయంతి మూవీస్ సమర్పణలో స్వప్న సినిమాస్ పతాకంపై అశ్విని దత్, ప్రియాంక్ దత్ నిర్మిస్తున్న ఈ రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌లో లెఫ్టినెంట్ రామ్ పాత్రలో నటిస్తుండగా మృణాళిని ఠాకూర్ సీత పాత్ర లో కనిపించనుంది. అఫ్రీన్ అనే కశ్మీర్‌కు చెందిన ముస్లిం యువతిగా రష్మిక నటిస్తోంది. ఇక ఈసినిమాలో సుమంత్, గౌతమ్ మీనన్, ప్రకాష్ రాజ్, రాహుల్ రవీంద్ర పలువురు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. విశాల్ చంద్రశేఖర్ సంగీతం అందిస్తున్న ఈసినిమాకు పీఎస్ వినోద్ సినిమాట్రోగాఫర్ గా పనిచేస్తున్నారు. ఈసినిమాను ఆగష్ట్ 5వ తేదీన ప్రేక్షకుల ముందుకురానుంది




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: