విజన్ సినిమాస్ బ్యానర్ పై నాటకం ఫేమ్ కల్యాణ్ జీ గోగణ దర్శకత్వం లో ఆది సాయికుమార్ , పాయల్ రాజ్ పుత్ జంటగా మాస్ యాక్షన్ థ్రిల్లర్ “తీస్ మార్ ఖాన్” మూవీ తెరకెక్కిన విషయం తెలిసిందే. ఈ మూవీ లో సునీల్ , పూర్ణ , కబీర్ దుహాన్ సింగ్ , ఠాకూర్ అనూప్ సింగ్ ముఖ్య పాత్రలలో నటించారు. సాయి కార్తీక్ సంగీతం అందించారు. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ , , టీజర్ ట్రైలర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
హీరో ఆది సాయి కుమార్ మూడు డిఫరెంట్ పాత్రలలో నటించిన “తీస్ మార్ ఖాన్” విడుదల తేదీ ని మేకర్స్ కన్ఫర్మ్ చేశారు. ఆది సినీ కెరీర్ లో భారీ బడ్జెట్ తో తెరకెక్కిన “తీస్ మార్ ఖాన్” మూవీ ప్రపంచవ్యాప్తంగా ఆగష్టు 19 వ తేదీ రిలీజ్ కానుంది. హీరో ఆది సాయి కుమార్ తన స్టైలిష్ , మాస్ అప్పీలింగ్ యాక్షన్ ఓరియెంటెడ్ క్యారెక్టర్ తో ప్రేక్షకులను అలరించనున్నారు. హీరో ఆది పలు మూవీ కమిట్ మెంట్స్ తో బిజీగా ఉన్న విషయం తెలిసిందే.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: