తమిళ్ స్టార్ డైరెక్టర్ లింగు స్వామి దర్శకత్వంలో రామ్-కృతిశెట్టి హీరో హీరోయిన్లుగా తెరెక్కుతున్న సినిమా ది వారియర్. మాస్ యాక్షన్ ఎంటర్టైనర్‌గా తెరకెక్కిన ఈ సినిమాలో మొదటి సారి రామ్ పవర్ ఫుల్ పోలీస్ పాత్రలో కనిపిస్తుండటంతో మరింత అంచనాలు నెలకొన్నాయి. దానికి తోడు సినిమా నుండి విడుదలైన టీజర్, ట్రైలర్ సినిమాపై అంచనాలను రెట్టింపు చేశాయి. జులై 14న గ్రాండ్‌గా రిలీజ్ అవుతుండటంతో దీనిలోభాగంగానే ప్రమోషన్ కార్యక్రమాలు కూడా బాగా చేస్తున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
రామ్ తొలిసారి తమిళ్ లోకి డైరెక్టర్ గా ఎంట్రీ ఇస్తుండటంతో అక్కడ కూడా ఫోకస్ బాగా పెడుతున్నారు. ఇప్పటికే గ్రాండ్ గా ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా నిర్వహించారు. ఈ ఈవెంట్ కు ఏకంగా 28మంది సెలబ్రిటీలను ఆహ్వానించారు. ఇక ఈసినిమా తెలుగు ప్రీ రిలీజ్ ఈవెంట్ నిన్న జరిగిన సంగతి తెలిసిందే కదా. ఈ కార్యక్రమానికి అతిథిగా వచ్చిన హరీష్ శంకర్ మాట్లాడుతూ.. రామ్ తో వర్క్ చేయడానికి నేను ఈగర్ గా వెయిట్ చేస్తున్న.. రామ్ తో ఫ్యూచర్ లో తప్పకుండా వర్క్ చేస్తా.. ఎప్పుడు అనేది టైమ్ మాత్రం చెప్పలేను కానీ మేమిద్దరం కలిసి త్వరలోనే సినిమా తీస్తాం అని చెప్పడంతో అప్పుడే ఈ క్రేజీ కాంబినేషన్ కోసం వెయిట్ చేస్తున్నారు.
కాగా ది వారియర్ కాకుండా రామ్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే కదా. ఈసినిమా పూజా కార్యక్రమాలు కూడా జరిగాయి. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటున్న ఈ చిత్రం త్వరలో సెట్స్ పైకి వెళ్ళనుంది. మరోవైపు హరీష్ శంకర్ పవన్ సినిమా చేయాల్సి ఉంది. పవన్ హరిహర వీరమల్లు సినిమా అయిపోతే హరీష్ శంకర్ సినిమా మొదలుపెట్టే అవకాశం ఉంది. మరి రామ్, హరీష్ శంకర్ కాంబోలో సినిమా రావాలంటే పెండింగ్ ప్రాజెక్టులు కంప్లీట్ చేయాల్సిందే. చూద్దాం మరి ఎప్పుడు ఈసినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన వస్తుందో..




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:


























