‘మాచర్ల నియోజకవర్గం’ మాస్ సాంగ్ రిలీజ్

macherla niyojakavargam ra ra reddy song out

నితిన్ హీరోగా ఎంఎస్ రాజశేఖర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ‘మాచర్ల నియోజకవర్గం’. పొలిటికల్ ఎలిమెంట్స్ తో మాస్, కమర్షియల్ ఎంటర్ టైనర్ గా ఈసినిమాను తెరకెక్కిస్తున్నారు. ప్రస్తుతం అయితే ఈసినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటుంది. ఇక మరోవైపు ఈసినిమా అప్ డేట్స్ కూడా అప్పుడప్పుడు ఇస్తూనే ఉన్నారు. ఇక ఈసినిమా రిలీజ్ దగ్గర పడుతుండటంతో ప్రమోషన్ కార్యక్రమాలు కూడా భారీగా చేస్తున్నారు. దీనిలో భాగంగానే పాటలు రిలీజ్ చేస్తూ బజ్ క్రియేట్ చేస్తున్నారు. ఇప్పటికే రా రా రెడ్డి.. ఐ యామ్ రెడీ అనే మాస్ సాంగ్ పాటను రిలీజ్ చేశారు. ఇప్పుడు తాజాగా ఈసినిమా ఫుల్ లిరికల్ సాంగ్ ను రిలీజ్ చేశారు మేకర్స్. ఈ పాటకు కాసర్ల శ్యామ్ సాహిత్యంగా అందించగా లిప్సిక ఆలపించారు. ఈ పాటలో హీరోయిన్ అంజలి రామ్ తో కలిసి నటించింది. ఇక ఈ సాంగ్ చివర్లో అప్పట్లో నితిన్ హీరోగా వచ్చిన జయం సినిమాలోని రాను రాను అంటూనే సిన్నదో లిరిక్స్ వినిపించడం ఆసక్తికరం.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

కాగా ఈసినిమాలో జిల్లా కలెక్టర్ గా నితిన్ సినిమాలో కనిపిస్తున్నట్టు తెలుస్తుంది. శ్రేష్ట్ మూవీస్ బ్యానర్ పై సుధాకర్ రెడ్డి, నికితారెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రాన్ని రాజ్కుమార్ ఆకెళ్ల సమర్పిస్తున్నారు. కేథరిన్ థ్రెసా ఈ సినిమాలో మరో కథానాయిక గా నటిస్తుంది. ఈ చిత్రానికి ప్రసాద్ మూరెళ్ల సినిమాటోగ్రాఫర్ గా పని చేస్తుండగా, మహతి స్వర సాగర్ సంగీతం సమకూరుస్తున్నారు. ‘మాచర్ల నియోజకవర్గం’ ఆగస్ట్ 12న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్ గా విడుదల కానుంది.

 

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.