త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా ఒక సినిమా వస్తున్న సంగతి తెలిసిందే కదా. ఇక ఈసినిమా కోసం అందరూ చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈసినిమాను ఎప్పుడో ప్రకటించారు.. ఇటీవల పూజా కార్యక్రమాలు కూడా జరిగాయి. కానీ ఈసినిమా అప్ డేట్ కోసం మాత్రం ఫ్యాన్స్ ఎప్పటినుండో వెయిట్ చేస్తున్నారు. కానీ ఇంతవరకూ ఎలాంటి అప్ డేట్ లేదు. తాజాగా చిత్రయూనిట్ ఈసినిమాకు సంబంధించి సాలిడ్ అప్ డేట్ ఇచ్చారు. ఈసినిమా ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుందని.. ఆగష్ట్ నుండి ఈసినిమా షూటింగ్ ను ప్రారంభించనుందని.. వచ్చే ఏడాది సమ్మర్ కు ప్రేక్షకుల ముందుకు రానున్నట్టు తెలిపారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఇప్పుడు థమన్ కూడా ఈసినిమాకు సంబంధించి అప్ డేట్ ఇచ్చాడు. ఈసినిమా మ్యూజిక్ వర్క్ స్టార్ట్ చేసినట్టు తెలిపాడు. ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా వెల్లడించాడు. మరి ఇప్పటికే మహేష్ కు చాలా సినిమాలకు థమన్ సూపర్ హిట్ ఆల్బమ్స్ ఇచ్చాడు. రీసెంట్ గా సర్కారు వారి పాట సినిమా పాటలు ఎంత హిట్టయ్యాయో చూశాం. దీంతో ఈసినిమాపై కూడా మంచి అంచనాలు ఉన్నాయి.
కాగా ఈసినిమాలో మహేష్ బాబు సరసన పూజా హెగ్డే నటిస్తుంది. దీనితో పాటు మధి కెమెరామెన్‌గా, నవీన్ నూలి ఎడిటర్‌గా, థమన్ సంగీత దర్శకుడిగా పనిచేస్తున్నారు. హారిక అండ్ హాసిని క్రియేషన్స్‌పై ఎస్.రాధాకృష్ణ ఈసినిమాను నిర్మిస్తున్నారు.




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: