ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో నాగార్జున హీరోగా వస్తున్న సినిమా ది ఘోస్ట్. ఈసినిమా షూటింగ్ చివరి దశలో ఉండగా మరోవైపు పోస్ట్ ప్రొడక్షన్ పనులను కూడా చూసుకుంటుంది. ఇక ఇప్పటికే ఈసినిమా పలు పోస్టర్లు రిలీజ్ చేయగా తాజాగా ఈసినిమా గ్లింప్స్ ను రిలీజ్ చేశారు మేకర్స్. ఇక గ్లింప్స్ లో నాగ్ కోపం వచ్చినప్పుడు అన్స్టాపబుల్ కిల్లింగ్ మెషిన్ గా నాగ్ మారతాడని అర్ధం అవుతుంది. అంతేకాదు.. గోస్ట్ తో ఎప్పుడు గొడవ పడకండి అంటూ ఈ వీడియోలో చెప్పుకొచ్చారు. బ్యాక్ గ్రౌండ్ స్కోర్.. అలాగే విజువల్స్ కూడా ఆకట్టుకుంటున్నాయి. ఈ గ్లింప్స్ తో ఈ సినిమాపై మరింత అంచనాలు పెంచేశారని చెప్పొచ్చు. ఇక రిలీజ్ డేట్ ను కూడా ప్రకటించారు. ఈసినిమాను దసరా బరిలోకి దించనున్నారు. అక్టోబర్ 5న రిలీజ్ చేయనున్నట్టు అఫిషియల్ గా ప్రకటించారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
Hold ON to your nerves!
Presenting the Vicious #KILLINGMACHINEhttps://t.co/gCxyZx5rd8#TheGHOST arrives with breathtaking ACTION
𝗶𝗻 𝗧𝗵𝗲𝗮𝘁𝗿𝗲𝘀 𝗳𝗿𝗼𝗺 𝗢𝗖𝗧 𝟱th🔥@iamnagarjuna @sonalchauhan7 @PraveenSattaru
@bharattsaurabh @nseplofficial @SVCLLP @SonyMusicSouth— Northstar Entertainment (@nseplofficial) July 9, 2022
కాగా ఈసినిమాలో సోనాల్ చౌహాన్ హీరోయిన్ గా నటిస్తుంది. యాక్షన్ స్పై థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో నాగార్జున, సోనాల్ చౌహాన్ ఇద్దరూ ఇంటర్‌పోల్ ఆఫీసర్స్‌గా కనిపించనున్నట్టు తెలుస్తుంది. ఇక ఈసినిమాలో గుల్‌పనాగ్, అనిఖ సురేంద్రన్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. వెంకటేశ్వర సినిమాస్, నార్త్ స్టార్ ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్స్ పై ఈసినిమాను నిర్మిస్తున్నారు.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: