స్టార్ డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వంలో రామ్ చరణ్ , ఎన్టీఆర్ లు హీరోలుగా భారీ బడ్జెట్ , భారీ తారాగణం తో తెరకెక్కిన “ఆర్ ఆర్ ఆర్ “మూవీ ప్రపంచవ్యాప్తం గా ప్రేక్షకాదరణతో భారీ కలెక్షన్స్ రాబట్టిన విషయం తెలిసిందే. బాలీవుడ్ లో భారీ వసూళ్లు సాధించి ఈ మూవీ రికార్డ్ క్రియేట్ చేసింది. మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు క్యారెక్టర్ లో హీరో రామ్ చరణ్ అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకుల ప్రశంసలు అందుకుని దేశవ్యాప్తం గా క్రేజ్ పొందారు. ఇప్పుడు పలువురు బాలీవుడ్ మేకర్స్ రామ్ చరణ్ హీరోగా మైథలాజికల్ , ఫాంటసీ మూవీస్ కై రామ్ చరణ్ ను సంప్రదిస్తున్నట్టు సమాచారం.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై భారీ చిత్ర దర్శకుడు శంకర్ దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ , కియారా అద్వానీ జంటగా భారీ బడ్జెట్ తో“#RC15” మూవీ శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటున్న విషయం తెలిసిందే.ఈ మూవీ తరువాత సూపర్ హిట్ “జెర్సీ”మూవీ ఫేమ్ గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో “#RC16” మూవీకి రామ్ చరణ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. దాంతో ఏ బాలీవుడ్ మేకర్స్ కీ రామ్ చరణ్ తన అంగీకారం తెలపలేదని సమాచారం.




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: