జిన్నా ఫస్ట్ లుక్ గ్లింప్స్ రిలీజ్..!

Vishnu Manchu Ginna Movie First Look Glimpse Out,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, Ginna,Ginna Movie,Ginna Telugu Movie,Ginna movie First Look Released,Ginna Manchu Vishnu Movie,Ginna First Look Released,Ginna manchu Vishnu upcoming Movie Released, GINNA First Look Telugu,Ginna Movie First Look,Manchu Vishnu,Hero Manchu Vishnu,Manchu Vishnu Movie Updates,Manchu Vishnu Upcoming Movie Ginna latest Updates,Manchu Vishnu Upcoming Movies, Manchu Vishnu Latest Movie Ginna First Look Released,Sunny Leone,Paayal Rajput,Manchu Vishnu and Sunny Leone,Manchu Vishnu and Sunny Leone Ginna Movie latest Updates, Manchu Vishnu and Paayal Rajput Upcoming Movie Ginna,Manchu Vishnu and Paayal Rajput Ginna Movie First Look Released,Manchu Vishnu and Sunny Leone Ginna Movie First Look Released

చాలాగ్యాప్ తరువాత మళ్లీ సందడి చేయడానికి వస్తున్నాడు మంచు విష్ణు. తన నుండి సినిమా వచ్చి చాలా కాలం అయిపోయింది. ఈ నేపథ్యంలో ఈసారి మరో ఎంటర్ టైనర్ తో వచ్చేస్తున్నాడు. ఈషాన్‌ సూర్య దర్శకత్వంలో మంచు విష్ణు హీరోగా వస్తున్న సినిమా జిన్నా. ఈసినిమాలో మంచు విష్ణు గాలి నాగేశ్వర్రావు పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇక తన గాలి నాగేశ్వర్రావు పేరు నచ్చక హీరో జిన్నాగా మార్చుకుంటాడు కాబట్టి జిన్నా టైటిల్ నే ఫిక్స్ చేశారు మేకర్స్. ఇక ప్రస్తుతం అయితే ఈసినిమా శరవేగంగా షూటింగ్ ను జరుపుకుంటుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక తాజాగాఈసినిమా ఫస్ట్ లుక్ గ్లింప్స్ ను రిలీజ్ చేశారు మేకర్స్. ఈ ఫస్ట్లుక్ నే చాలా వినూత్నంగా రిలీజ్ చేశారు. ‘విష్ణు గారు… షాట్ రెడీ’ అని హీరో గారూ షాట్ రెడీ అని అసిస్టెంట్ డైరెక్టర్ వచ్చి ఎంత పిలిచినా విష్ణు షూటింగ్ కు రాడు. అప్పుడే సెట్స్ లోకి ఎంటర్ అయిన డ్యాన్స్ మాస్టర్ ప్రేమ్ రక్షిత్ సూచన మేరకు ‘జిన్నా.. షాట్ రెడీ’ అని పిలవగానే విష్ణు షూట్ కు వస్తాడు. ఇక వైట్ అండ్ వైట్ డ్రస్ లో మెడలో స్కార్ఫ్ తో మాస్ లుక్ లోనే కనిపిస్తున్నాడు. మొత్తానికి కామెడీ యాక్షన్ ఎంటర్ టైనర్ గా ఈసినిమా ఉండబోతుందని అర్థమవుతుంది.


కాగా ఈసినిమాలో బాలీవుడ్ ప్రముఖ నటి సన్నీ లియోన్, పాయల్ రాజ్ పుత్ లు హీరోయిన్స్ గా నటిస్తున్నారు. అవ ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ లో ఈ సినిమా తెరకెక్కుతోంది. కథ, స్క్రీన్ ప్లే తో పాటు క్రియేటివ్ ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తున్నారు కోన వెంకట్. డాషింగ్ సినిమాటోగ్రాఫర్ చో టా.కె.నాయుడు.. భాను, నందు డైలాగ్స్ అందిస్తున్న ఈ సినిమాకి అనూప్ రూబెన్స్ సంగీతం సమకూర్చుతున్నారు.

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.