‘రాధే శ్యామ్’ లో నా పాత్ర అదే

Krishnam Raju Reveals His Role In Radhe Shyam,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood News,Radhe Shyam,Radhe Shyam Movie,Radhe Shyam Film,Radhe Shyam Movie Telugu,Radhe Shyam Update,Radhe Shyam Movie News,Prabhas Radhe Shyam,Radhe Shyam Prabhas,Krishnam Raju,Actor Krishnam Raju,Krishnam Raju To Play Crucial Role In Radhe Shyam,Krishnam Raju In Radhe Shyam,Krishnam Raju In Prabhas Radhe Shyam,Krishnam Raju Reveals His Role,Prabhas,Rebel Star Prabhas,Actor Prabhas,Krishnam Raju In Radhe Shyam Movie

జిల్ ఫేమ్ రాధా కృష్ణ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా ‘రాధే శ్యామ్’ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ కూడా చివరి దశకు చేరుకుంది. ఇప్పటికే పూజా హెగ్డే తన షూట్ ను పూర్తి చేసుకుంది. ఇప్పటివరకూ టైటిల్ పోస్టర్ ను, పూజా హెగ్డే, ప్రభాస్ ఫస్ట్ లుక్, మోషన్ పోస్టర్ ను రిలీజ్ చేయగా వాటికి ఎలాంటి రెస్పాన్స్ వచ్చిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఈ చిత్రంలో కృష్ణం రాజు కూడా ఓ కీల‌క పాత్ర చేస్తున్నార‌ట‌. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా చెప్పారు. నిన్న కృష్ణం రాజు పుట్టిన రాజు సందర్భంగా మీడియాతో ముచ్చటించిన ఆయన రాధే శ్యామ్ సినిమా గురించి కూడా మాట్లాడుతూ పలు ఇంట్రెస్టింగ్ విషయాలు తెలిపారు. ఈ నేపథ్యంలో ఆయన రాధే శ్యామ్ లో నటిస్తున్నా అని… ఆ పాత్ర పేరు ప‌ర‌మ‌హంస అని, తాను ఓ మ‌హాజ్ఞానిలా క‌నిపిస్తాన‌ని.. ఈ పాత్ర కోసం గ‌డ్డం పెంచి డిఫ‌రెంట్ లుక్ ట్రై చేశాన‌ని.. ప్ర‌భాస్‌, త‌న కాంబినేష‌న్లో వ‌చ్చే కొన్ని స‌న్నివేశాలను ఇంకా చిత్రీక‌రించాల్సి ఉంద‌ని కృష్ణం రాజు వెల్ల‌డించారు.రాధేశ్యామ్‌ను ఏప్రిల్లో విడుద‌ల చేయాల‌నుకుంటున్న‌ట్లు కూడా కృష్ణంరాజు వెల్ల‌డించారు.

కాగా 1970 బ్యాక్‌డ్రాప్‌లో పీరియాడిక‌ల్ ల‌వ్‌స్టోరీగా రూపుదిద్దుకుంటున్న ఈ సినిమాలో పూజా హెగ్డే కథానాయికగా నటిస్తుండగా.. భాగ్య శ్రీ, మురళీ శర్మ, ప్రియదర్శి, కునాల్ రాయ్ కపూర్, సచిన్ ఖేదేకర్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. తెలుగు, తమిళ్, హిందీ మరియు మలయాళంలో భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాను గోపికృష్ణ మూవీస్, యూవీ క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

2 × 5 =