తన విలక్షణమైన నటనతో తన కంటూ ప్రత్యేక గుర్తింపును సొంతం చేసుకున్న సత్యదేవ్ హీరోగా, టాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్‌గా ఎదిగిన మిల్కీబ్యూటి తమన్నా హీరోయిన్‌గా ‘గుర్తుందా శీతాకాలం’ అనే సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. నాగశేఖర్ దర్శకత్వంలో కన్నడలో సూపర్ హిట్ అయిన ‘లవ్ మాక్ టైల్’ సినిమాను తెలుగులో గుర్తుందా శీతాకాలం పేరుతో రీమేక్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా శరవేగంగా షూటింగ్ ను జరుపుకుంటుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఇటీవలే ఈ సినిమా ఫస్ట్ షెడ్యూల్ ను పూర్తి చేసుకున్న సంగతి తెలిసిందే. ఇక దీనిపై తమన్నా తన ఇన్స్టా లో ఒక చిన్న వీడియో ను పోస్ట్ చేస్తూ ఫన్ షెడ్యూల్ అని.. సెట్ లో డైరెక్టర్ నాగ శేఖర్.. సత్య దేవ్ చాలా బాగా చూసుకున్నారు.. మళ్లీ సెట్స్ వెళ్లాలని వుంది అంటూ పోస్ట్ లో పేర్కొంది.
View this post on Instagram
కాగా నాగ శేఖర్ మూవీస్ బ్యానర్‌పై నిర్మితమవుతున్న ఈ సినిమాను నాగశేఖర్, భావన రవి నిర్మిస్తున్నారు. కీరవాణి తనయుడు కాల భైరవ సంగీతాన్ని అందిస్తుండగా.. సత్య హెగ్డే సినిమాటోగ్రాఫర్ గా పని చేస్తున్నారు. ఇక ఈ సినిమాకి సంబంధించిన మరిన్ని వివరాలు, ఇతర నటీనటుల వివరాలు త్వరలోనే తెలియచేయనున్నారు.




[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:



























