యాక్ట్రెస్ కావాలని కోరుకున్న మోడల్ ప్రియాంక అరుళ్ మోహన్ “ఒంధ్ కథె హెల్ల “కన్నడ మూవీ తో కెరీర్ ప్రారంభించారు. నాని హీరోగా రూపొందిన “గ్యాంగ్ లీడర్ “మూవీ తో ప్రియాంక కథానాయికగా టాలీవుడ్ కు పరిచయం అయ్యారు. శివకార్తికేయన్ హీరోగా రూపొందుతున్న “డాక్టర్ “తమిళ మూవీ తో ప్రియాంక కోలీవుడ్ కు పరిచయం అవుతున్నారు. ప్రియాంక ప్రస్తుతం కిషోర్ రెడ్డి దర్శకత్వంలో శర్వానంద్ హీరోగా
అగ్రికల్చరల్ బ్యాక్ డ్రాప్ లో రూపొందుతున్న “శ్రీకారం ” మూవీ లో కథానాయికగా నటిస్తున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
సక్సెస్ ఫుల్ “పసంగ” మూవీ తో కోలీవుడ్ కు దర్శకుడిగా పరిచయం అయినపాండి రాజ్ మొదటి సినిమాతోటే బెస్ట్ స్క్రీన్ ప్లే కు, బెస్ట్ ఫిల్మ్ గా నేషనల్ అవార్డ్స్ అందుకున్నారు. పలు సూపర్ హిట్ మూవీస్ తో సక్సెస్ ఫుల్ చిత్ర దర్శకుడిగా కొనసాగుతున్న పాండిరాజ్ ఇప్పుడు స్టార్ హీరో సూర్య కథానాయకుడిగా ఒక మూవీ ని తెరకెక్కించనున్నారు. సన్ పిక్చర్స్ బ్యానర్ పై పాండిరాజ్ దర్శకత్వంలో సూర్య హీరోగా సూర్య 40 వ మూవీ రూపొందనుంది. ఈ మూవీ లో సూర్య కు జోడీగా ప్రియాంక ఎంపిక అయ్యారు. మొదటి తమిళ సినిమా రిలీజ్ కాకుండానే స్టార్ హీరో సూర్య మూవీ లో కథానాయికగా అవకాశం అందుకున్న ప్రియాంక అదృష్టవంతురాలే.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: