వరుసగా సినిమాలు చేసుకుంటూ వెళ్తున్నాడు యంగ్ హీరో నాగశౌర్య. అంతేకాదు ఏదో ఒకటి కొత్తగా ట్రై చేయాలన్న పట్టుదలతో ఇప్పుడు విభిన్నమైన కథలతో వస్తున్నాడు. అలా చేస్తున్న సినిమాల్లో ఒకటి ‘లక్ష్య’. సుబ్రహ్మణ్యపురం ఫేమ్ దర్శకుడు సంతోష్ జాగర్లపూడి తో కలిసి నాగ శౌర్య ఈ సినిమా. ఈ సినిమా కోసం నాగశౌర్య తన లుక్ ను సైతం మార్చేశాడు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి ప్రీ లుక్ ను రిలీజ్ చేయగా…దానికి మంచి రెస్పాన్స్ రావడమే కాదు.. సినిమాపై అంచనాలు కూడా పెంచేసింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక నాగశౌర్య పుట్టిన రోజు సందర్భంగా తన సినిమాలకు సంబంధించి పలు వరుస అప్ డేట్స్ ఇస్తున్న సంగతి తెలిసిందే కదా. ఈ నేపథ్యంలోనే లక్ష్య సినిమా ఒక అప్ డేట్ ఇచ్చేసారు. ఈ సినిమా నుండి టీజర్ ను రిలీజ్ చేస్తున్నట్టు అప్ డేట్ ఇచ్చారు. జనవరి 22న ఉదయం పది గంటల 17 నిమిషాలకు ఈ టీజర్ విడుదల కాబోతోందని ప్రకటించారు.
So here I come, Super excited to meet you on Jan 22 at 10:17 am ♥️#NS20
@sharrath_marar @SVCLLP @nseplofficial @Santhosshjagar1 @RaamDop @IamJagguBhai @EditorJunaid #KetikaSharma @kaalabhairava7 @SachinSKhedekar #lakshya #IndiasFirstFilmonArchery pic.twitter.com/kMv5wqsWA0— Naga Shaurya (@IamNagashaurya) January 20, 2021
శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్‌ఎల్‌పి & నార్త్‌స్టార్ ఎంటర్టైన్మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ కింద నిర్మిస్తున్న ఈ చిత్రంలో కేతికా శర్మ హీరోయిన్ గా నటిస్తుంది. పురాతన క్రీడ నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కతున్నట్టు తెలుస్తుంది.
దీనితో పాటు పలు ప్రాజెక్ట్స్ లైన్ లో ఉన్నాయి. సితార ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై లక్ష్మీ సౌజన్య దర్శకత్వంలో నాగశౌర్య హీరోగా రొమాంటిక్ ఎంటర్ టైనర్ తెరకెక్కుతుంది. . నాగశౌర్య హీరోగా ఈస్ట్ కోస్ట్ ప్రొడక్షన్స్ లో కె.పి.రాజేంద్ర దర్శకత్వంలో మరో సినిమా తెరకెక్కుతుంది.




[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: