ఆ ఇద్ద‌రి రుణం తీర్చుకోలేనిది – అలీ

Comedian Ali Speaks About His Bonding With Atchi Reddy and SV Krishna Reddy,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood News,Comedian Ali,Atchi Reddy,SV Krishna Reddy,Achi Reddy And Sv Krishna Reddy,Andaru Bagundali Andulo Nenundali,Actor Ali,Comedian Ali Latest News,Ali,Comedian Ali About His Bonding With Atchi Reddy,Comedian Ali About SV Krishna Reddy,Comedian Ali Latest Movie News,Comedian Ali New Movie Update,Comedian Ali Latest Movie Details,Comedian Ali On Atchi Reddy and SV Krishna Reddy

వెండితెరపై బాలనటుడిగా.. హీరోగా.. కమెడియన్ గా ఎన్నో సినిమాలు చేసిన అలీ ఇప్పుడు నిర్మాతగా కూడా మారారు. అలీ నిర్మాత‌గా అలీవుడ్ ఎంట‌ర్ టైన్మెంట్స్ ప‌తాకాం పై తెర‌కెక్కుతున్న చిత్రం అంద‌రూ బాగుండాలి అందులో నేనుండాలి. అలీ, నరేష్ ప్ర‌ధాన పాత్ర‌లుగా రూపొందుతున్న ఈ సినిమా ఇటీవ‌లే మొద‌లైన విష‌యం తెలిసిందే. ప్ర‌స్తుతం ఈ సినిమా షూటింగ్ ద‌శ‌లో వుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఇంట్రెస్టింగ్ న్యూస్ ఏంటంటే.. ఈ సినిమాలో ప్ర‌ముఖ నిర్మాత అచ్చిరెడ్డి, ప్ర‌ముఖ సీనియర్ ద‌ర్శ‌కుడు కృష్ణారెడ్డి న‌టిస్తుండ‌టం విశేషం. ఇప్ప‌టివ‌రుకు తెర‌వెనుక‌నే ఉంటూ ఎన్నో బ్లాక్ బ‌స్ట‌ర్ చిత్రాల్ని తెలుగు చిత్ర‌సీమ‌కు అందించిన ఈ దిగ్గజ‌ద్వయం తొలిసారిగా వెండితెర మీద‌కు రాబోతున్నారు. గ‌తంలో ఎస్ వీ కృష్ణా రెడ్డి హీరోగా ప‌లు చిత్రాల్లో న‌టించిన‌ప్ప‌టికీ, అచ్చిరెడ్డిగారితో క‌లిసి న‌టించ‌డం ఇదే మొద‌టిసారి అవుతుంది డాక్ట‌ర్ అలీని హీరోగా ఇంట‌ర్ డ్యూస్ చేసి, ఆయ‌న కెరీర్ ని ఓ కీల‌క మ‌లుపు తిప్పిన అచ్చిరెడ్డి – కృష్ణారెడ్డి ఇప్పుడు ఆయ‌న కోరిక మేర‌కు సినిమాలో న‌టించ‌డానికి అంగీక‌రించ‌డం విశేషం.

ఈ సంద‌ర్భంగా డాక్ట‌ర్ అలీ మాట్లాడుతూ న‌న్ను హీరోగా ఇంట‌ర్ డ్యూస్ చేసి నా కెరీర్ ని కీల‌క మ‌లుపు తిప్పిన అచ్చిరెడ్డి – కృష్ణారెడ్డిగారికి మ‌ళ్లీ నేను నిర్మాతగా మారి తెర‌కెక్కిస్తున్న అంద‌రూ బాగుండాలి అందులో నేనుండాలి లో అవ‌కాశం ఇవ్వ‌డం చాలా ఆనందంగా ఉంద‌ని, ఈ సినిమాలో వారిద్ద‌రి పాత్ర చిన్న‌దైన‌ప్ప‌టికీ నా మీద అభిమానంతో న‌టించ‌డానికి అంగీక‌రించార‌ని డాక్ట‌ర్ అలీ అన్నారు. తాజాగా జ‌రిగిన షెడ్యూల్ లో అచ్చిరెడ్డి – కృష్ణారెడ్డి మీద కొన్ని కీల‌క స‌న్నివేశాల్ని చిత్ర ద‌ర్శ‌కుడు శ్రీపురం కిర‌ణ్ చిత్రీక‌రించారు. మ‌ళ‌యాలీ బ్లాక్ బ‌స్ట‌ర్ మూవీ వికృతికి తెలుగు రీమేక్ సినిమాగా అంద‌రూ బాగుండాలి అందులో నేనుండాలి రాబోతుంది. ఈ సినిమాలో యువ న‌టి మౌర్యానీ కీల‌క పాత్ర పోషిస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించిన మ‌రిన్ని వివ‌రాలు త్వ‌ర‌లోనే తెలియచేస్తామని అలీ అన్నారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

3 × five =