‘గాలి సంపత్’ డైరెక్షన్ లో కూడా

Director Anil Ravipudi Undertakes A Key Role For Gaali Sampath Movie,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood News,Director Anil Ravipudi,Anil Ravipudi,Gaali Sampath,Gaali Sampath Movie,Gaali Sampath Film,Gaali Sampath Telugu Movie,Gaali Sampath Movie Telugu,Gaali Sampath Movie Updates,Gaali Sampath Movie News,Anil Ravipudi Latest News,Sree Vishnu New Movie Updates,Anil Ravipudi Undertakes Key Role For Gaali Sampath,Sree Vishnu Gaali Sampath Movie,Sree Vishnu,Anish Krishna,Hero Sree Vishnu,Actor Sree Vishnu

అనీష్ కృష్ణ ద‌ర్శ‌క‌త్వంలో శ్రీ విష్ణు, ల‌వ్‌లీ సింగ్ హీరోహీరోయిన్లుగా గాలి సంపత్ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ మాత్రం రాపిడ్ స్పీడ్ లో జరుగుతుంది. ఫస్ట్ షెడ్యూల్ షూటింగ్ అరుకులో ప్రారంభమవగా.. సుమారు 25 రోజులపాటు అరుకు, విశాఖపట్నంలో తొలి షెడ్యూల్‌ను తాజాగా పూర్తి చేశారు. ఒక్క షెడ్యూల్ లోనే ఈ సినిమా షూటింగ్ ను 80 శాతం పూర్తి చేశారంటే చెప్పొచ్చు ఎంత ఫాస్ట్ గా వున్నారో. ఇక ఇప్పుడు దాదాపు షూటింగ్ చివర దశకు చేరుకుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇదిలా ఉండగా ఈ సినిమాను అనిల్ రావిపూడి స‌మ‌ర్పిస్తూ స్క్రీన్ ప్లే అందిస్తున్న సంగతి తెలిసిందే కదా. అయితే ఇప్పుడు మరో బాధ్యత కూడా తీసుకున్నట్టు తెలుస్తుంది. ఈ సినిమా గురించి అనిల్ రావిపూడి తన ట్విట్టర్ లో మొదట ఈ సినిమా ను ప్రకటించినప్పుడు సమర్పణ.. స్క్రీన్ ప్లే అందించడమే అనుకున్నాను.. కాని ఈ సినిమా ప్రత్యేకమైపోయింది.. ఇక ఇప్పుడు డైరెక్షన్ లో కూడా నా సపోర్ట్ అందిస్తున్నాను.. టీం వర్క్ అంటే ఇదే అంటూ ట్వీట్ చేసాడు.

కాగా ఈ మూవీని ఇమేజ్ స్పార్క్‌ ఎంటర్టైన్మెంట్ బేన‌ర్‌ పై ఎస్‌. క్రిష్ణ, షైన్ స్క్రీన్స్ బ్యానర్ పై మజిలీ వంటి హిట్ చిత్రాలు నిర్మించిన సాహు గారపాటి, హరీష్ పెద్దిలతో కలిసి నిర్మిస్తున్నారు. ఎస్. క్రిష్ణ ప‌టాస్ నుండి స‌రిలేరు నీకెవ్వ‌రు వ‌ర‌కూ అనిల్ రావిపూడి అన్ని చిత్రాల‌కు కో డైరెక్ట‌ర్, రైట‌ర్ గా వ‌ర్క్ చేశారు. ఇప్పుడు మొదటిసారి నిర్మాతగా మారుతున్నారు. ఇంకా ఈ సినిమాలో త‌నికెళ్ల భ‌ర‌ణి, స‌త్య‌, ర‌ఘుబాబు, శ్రీ‌కాంత్ అయ్యంగార్‌, మిర్చి కిర‌ణ్‌, సురేంద్ర రెడ్డి, గ‌గ‌న్‌, మిమ్స్ మ‌ధు, అనీష్ కురువిల్లా, ర‌జిత‌, క‌రాటే క‌ళ్యాణి, సాయి శ్రీ‌నివాస్‌, రూపల‌క్ష్మి త‌దిత‌రులు నటిస్తున్నారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

five × four =