వరుణ్ తేజ్ ‘గని’ లో అదే హైలైట్ 

Director Kiran To Highlight A Serious Issue Through Ghani Movie,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood News,Director Kiran,Kiran,Ghani,Ghani Movie,Ghani Film,Ghani Telugu Movie,Ghani Movie Telugu,Ghani Movie latest News,Ghani Movie Updates,Director Kiran Latest News,Kiran To Highlight Serious Issue,Director Kiran Ghani Movie,Ghani First Look,Varun Tej,Hero Varun Tej,Actor Varun Tej,Major Highlights Of Ghani,Varun Tej Ghani To Highlight Serious Issue,kiran korrapati,Highlights Of Ghani,Ghani Movie Highlight

ప్రస్తుతం కిర‌ణ్ కొర్ర‌పాటి దర్శకత్వంలో వరుణ్ తేజ్ హీరోగా ఒక సినిమా తెరకెక్కబోతున్న సంగతి తెలిసిందే కదా. బాక్సింగ్ నేపథ్యంలో ఈ సినిమా రూపొందుతుందన్న సంగతి కూడా విదితమే. ఇక ఈరోజు వరుణ్ తేజ్ పుట్టిన రోజు సందర్బంగా ఈ సినిమా టైటిల్, ఫస్ట్ లుక్ కు సంబంధించి మోషన్ పోస్టర్ ను రిలీజ్ చేయగా దానికి మంచి రెస్పాన్స్ వచ్చింది. ‘గని’ అనే టైటిల్ ను ఈ సినిమాకు ఫిక్స్ చేశారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఇదిలా ఉండగా ఈ సినిమా గురించి ఇప్పుడు ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఒకటి వినిపిస్తుంది. స్పోర్ట్స్ లో వుండే ఒక సమస్యను హైలైట్ చేయనున్నారట డైరెక్టర్ కిరణ్. తాజాగా ఒక ఇంటర్వ్యూ లో పాల్గొన్న కిరణ్ ఈ సినిమా నేపథ్యం గురించి మాట్లాడుతూ.. క్రీడా ప్రపంచంలో ప్రతిభ ఉన్న చాలామంది క్రీడా కారులు.. ఆఖరికి ఒలంపిక్స్ లో మెడల్స్ సాధించిన వాళ్ళు కూడా  సమస్యలు ఎదుర్కొనే పరిస్థితి  ఉంది..  భారతదేశంలో పరిస్థితి ఎంత ఘోరంగా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఛాంపియన్స్ ఎదుర్కొంటున్న ఈ నిర్లక్ష్యాన్ని తన చిత్రం హైలైట్ చేస్తుందని కిరణ్ అన్నారు. అంతేకాదు స్పోర్ట్స్ డ్రామాలో నటించడం వరుణ్ తేజ్ ఎప్పటినుండో ఎదురుచూస్తున్నాడు అని తెలిపాడు.

యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాను మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సమర్పణ లో రినైస్సన్స్ పిక్చర్స్, బ్లూ వాటర్స్ క్రియేటివ్ బ్యానర్స్ పై అల్లు బాబీ, సిద్దు ముద్దలు నిర్మిస్తున్నారు. ఇందులో ప్రముఖ బాలీవుడ్ నటుడు మహేష్ మంజ్రేకర్ కుమార్తె సాయి మంజ్రేకర్ కథానాయికగా నటిస్తుందని తెలుస్తోంది. ఉపేంద్ర‌, సునీల్ శెట్టి.. లాంటి స్టార్లు ఈ సినిమాలో కీల‌క పాత్ర‌లు పోషిస్తున్నారు. ఫాదర్ పాత్రలో ఉపేంద్ర.. కోచ్ పాత్రలో సునీల్ శెట్టి నటిస్తున్నట్టు తెలుస్తుంది. ఇక థమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాకు… హాలీవుడ్ స్టంట్ మాస్టర్ లార్నెల్ స్టోవాల్ ఫైట్స్ ను కంపోజ్ చేస్తున్నాడు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

18 − 16 =