కేవలం సినిమాల్లో మెసేజ్ లు ఇవ్వడమే కాదు.. సమాజ సేవ చేయడంలో కూడా మన హీరోలు ఎప్పుడూ ముందుంటారు. రీల్ లైఫ్ లోనే కాదు రియల్ లైఫ్ లో కూడా తాము చేసే పనుల ద్వారా హీరోలనిపించుకుంటారు. ఇక వారు చేసే సమాజ సేవ..పలువురికి చేసే గుప్తదానాలు బయటకు రావచ్చు.. రాకపోవచ్చు. అంతేకాదు వాళ్ళు కూడా బయటకు చెప్పుకోడానికి పెద్దగా ఇంట్రెస్ట్ చుపించారనుకోండి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఇప్పుడు తమిళ్ హీరో అజిత్ కూడా అలాంటి సాయమే చేసి రియల్ హీరో అనిపించుకున్నాడు. అసలు సంగతేంటంటే.. ప్రస్తుతం అజిత్ హెచ్. వినోత్ దర్శకత్వంలో ‘వాలిమై’ సినిమా చేస్తున్న తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ కొద్దిరోజులు హైదరాబాద్ లో జరిగింది. అయితే షూటింగ్ అయిపోయిన తర్వాత అజిత్ రాత్రి సమయంలో దగ్గరే ఉన్న ఇడ్లీ బండి వద్దకు వెళుతుండేవారట. అలా ఆ ఇడ్లీలు అమ్మే వ్యక్తి పిల్లల గురించి, ఆ పిల్లలను చదివించడానికి అతను పడుతున్న కష్టాన్ని గురించి తెలుసుకుని వారి చదువుల కోసం తనవంతుగా లక్ష రూపాయల సహాయం చేశారట. ఇక ఈ సినిమా షూటింగ్ ఇక్కడ కంప్లీట్ అయింది.. అజిత్ ఇంటికికూడా వెళ్ళిపోయాడు. అయితే ఇప్పుడు ఈ విషయం బయటకు రావడంతో వైరల్ అవుతుంది.
ఇక యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న చివరి షెడ్యూల్ మొరాకో లో జరుగుతుంది. ఈ చిత్రంలో అజిత్ పోలీస్ పాత్రలో కనిపించనుండగా, ఇందులో కథనాయికగా బాలీవుడ్ నటి హుమా ఖురేషి నటిస్తుంది. టాలీవుడ్ హీరో కార్తికేయ విలన్‌గా కనిపించనున్నారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: