ట్యాగ్ · 2112 కథనాలు · పేజీ 90
ఆది 'శశి' - మారిన రిలీజ్ డేట్
'నారప్ప' షూటింగ్ పూర్తి
ప్రభాస్ 'ఆదిపురుష్' ఆరంభం

100 శాతం ఆక్యుపెన్సీకి కేంద్రం గ్రీన్ సిగ్నల్
'సుల్తాన్' టీజర్ రిలీజ్
విశాల్ 'చక్ర' రిలీజ్ డేట్ ఫిక్స్
'రిపబ్లిక్' రిలీజ్ డేట్ ఫిక్స్
'నరుడి బ్రతుకు నటన' షూటింగ్ ప్రారంభం
'ఖిలాడి' లో మలయాళ హీరో
'ఆచార్య' లా మారిన వార్నర్
'చావు కబురు చల్లగా' రిలీజ్ డేట్ ఫిక్స్

'వకీల్ సాబ్' రిలీజ్ డేట్ ఫిక్స్

'ఖిలాడి' రిలీజ్ డేట్ ఫిక్స్
'సలార్' షూటింగ్ ప్రారంభం
శృతి హాసన్ బెస్ట్ జోడి..?
'మహా సముద్రం' రిలీజ్ డేట్ ఫిక్స్
'చెక్' ట్రైలర్ రిలీజ్ డేట్ ఫిక్స్
'ఆది పురుష్' ముంబై లో గ్రాండ్ లాంచ్
బాలీవుడ్ లో తానాజీ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్న డైరెక్టర్ ఓం రౌనత్. ఇక ఇప్పుడు ప్రభాస్ తో 'ఆదిపురుష్' సినిమాను తెరకెక్కిస్తున్నాడు. ఇక ఈ సినిమాను ప్రకటించిన దగ్గర నుండి అప్పుడప్పుడు అప్ డేట్స్ ఇస్తూనే ఉన్నాడు ఓం రౌత్. ఈ నేపథ్యంలోనే ఈ రోజు ప్రభాస్ ఫ్యాన్స్ కు సర్ఫరైజింగ్ అప్ డేట్ ఇచ్చాడు. మోషన్ క్యాప్చర్ టెక్నాలజీ వర్క్‌ను ఇటీవలే స్టార్ట్ చేసిన చిత్ర యూనిట్ నేడు ముంబైలో ఈ మూవీని గ్రాండ్ గా లాంచ్ చేశారు. ఈ విషయాన్ని అధికారికంగా తెలియచేసారు చిత్రయూనిట్. ఇక ఇప్పుడు ఆ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. రెగ్యులర్ షూటింగ్ కూడా నేటి నుండే మొదలుకానుంది.
ఆది 'శశి' - మారిన రిలీజ్ డేట్
శ్రీనివాస్ నాయుడు నడికట్ల డైరెక్షన్లో ఆది హీరోగా 'శశి' సినిమా వస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ ను పూర్తి చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది. ఇటీవలే ఈ సినిమానుండి టీజర్ ను రిలీజ్ చేయగా దానికి మంచి రెస్పాన్స్ రావడంతో సినిమాపై భారీ అంచనాలు పెరిగాయి. అంతేకాదు ఒకేఒక లోకం నువ్వు అనే సాంగ్ కూడా అందర్నీ ఆకట్టుకుంటుంది.
'నారప్ప' షూటింగ్ పూర్తి
వెట్రిమారన్ దర్శకత్వంలో కోలీవుడ్ హీరో ధనుష్ నటించిన ‘అసురన్’ సినిమా తెలుగులో కూడా రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో హీరో వెంకటేష్ ప్రధాన పాత్రలో ‘నారప్పగా’ ఈ సినిమా తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన గ్లిమ్స్, పోస్టర్లకు, ఫస్ట్ గ్లింప్స్ కు మంచి రెస్పాన్స్ వచ్చిన సంగతి తెలిసిందే. ఇక ఇటీవలే ఈ సినిమా రిలీజ్ డేట్ ను కూడా ప్రకటించిన సంగతి కూడా విదితమే. సమ్మర్ స్పెషల్‌గా మే 14 ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నారు.
'పాగల్' ఫస్ట్ లుక్ రిలీజ్ - రిలీజ్ డేట్ ఫిక్స్
మలయాళ సినిమా అంగమలై డైరీస్‌ను తెలుగులో ‘ఫలక్‌నుమా దాస్’గా తెరకెక్కించిన విశ్వక్ సేన్.. హీరోగా, దర్శకుడిగా మంచి విజయం సాధించాడు. ఇక గత ఏడాది శైలేష్ కొలను దర్శకత్వంలో హిట్ సినిమా చేసి దానితో ఒక్కసారిగా ఫుల్ క్రేజ్ తెచ్చుకున్నాడు. విశ్వక్ సేన్ ప్రస్తుతం లక్కీ మీడియా బ్యానర్ పై నూతన దర్శకుడు నరేష్ కుప్పిలి దర్శకత్వంలో 'పాగల్' సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే కదా. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ జరుపుకుంటుంది.
ప్రభాస్ 'ఆదిపురుష్' ఆరంభం
బాహుబలి1, బాహుబలి2 సినిమాల కోసం దాదాపు ఐదేళ్లు టైమ్ తీసుకున్నాడు ప్రభాస్. ఆ తర్వాత సాహో సినిమాకు దాదాపు రెండేళ్లు.. రాధే శ్యామ్ సినిమా కు కూడా అంతే టైమ్ తీసుకున్నారు.. దీనితో ప్రభాస్ సినిమా రావాలంటే మినిమమ్ రెండేళ్లు టైమ్ తీసుకోవాల్సిందే అన్న అభిప్రాయానికి వచ్చేసారు అందరూ. అయితే ఇప్పుడు అలాంటి పరిస్థితులు రాకుండా జాగ్రత్తపడుతున్నాడు ప్రభాస్. ప్రస్తుతం ప్రభాస్ చేతిలో నాలుగు భారీ పాన్ ఇండియా ప్రాజెక్ట్స్ వున్నాయి. వాటిలో రాధే శ్యామ్, నాగ్ అశ్విన్ తో సినిమా, ఓం రౌత్ తో ఆదిపురుష్, ప్రశాంత్ నీల్ తో సలార్. అన్నీ ఒకదానికి మించి ఒకటి పెద్ద ప్రాజెక్టులే.

100 శాతం ఆక్యుపెన్సీకి కేంద్రం గ్రీన్ సిగ్నల్
సినీ పరిశ్రమకు మరో గుడ్ న్యూస్ ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం. థియేటర్స్ తెరిచినా ఇప్పటివరకూ 50 శాతం అక్యుపెన్సీ తో నడిపించాలనే షరతులు ఉన్నాయి. ఆ మధ్య సంక్రాంతి పండుగ సీజన్‌లో నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్స్ అందరూ కేంద్ర ప్రభుత్వానికి పూర్తి సీటింగ్ కెపాసిటీ ఇవ్వాలంటూ రిక్వెస్ట్ చేసినా, రాష్ట్ర ముఖ్యమంత్రులు ప్రత్యేకంగా వంద శాతం థియేటర్స్‌ను ఓపెన్ చేసుకోమని చెప్పినా కేంద్ర ప్రభుత్వం ఒప్పుకోలేదు. ఇక ఇటీవల మరికొద్దిగా ఎక్కువ శాతం అక్యూపెన్సీ ని పెంచుకోవచ్చు అని కేంద్ర ప్రభుత్వం ఆదేశాలిచ్చింది. అయితే ఎంత శాతం అనేది మాత్రం చెప్పలేదు. ఇప్పుడు ఈ విషయంపై కూడా క్లారిటీ వచ్చింది.
'సుల్తాన్' టీజర్ రిలీజ్
‘ఖైదీ’ అనే మంచి థ్రిల్లర్ మూవీతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన తమిళ హీరో కార్తి.. ఇప్పుడు ‘సుల్తాన్’ అనే ఫ్యామిలీ అండ్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతున్నాడు. రెమో ఫేమ్ బక్కియరాజ్ కణ్ణన్ దర్శకత్వంలో కార్తీ, రష్మిక హీరో హీరోయిన్స్ గా వస్తున్న సినిమా 'సుల్తాన్'. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ ను కూడా పూర్తి చేసుకోగా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది. ఇప్పటికే విడుదల చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్ లకు మంచి రెస్పాన్స్ వచ్చింది .
విశాల్ 'చక్ర' రిలీజ్ డేట్ ఫిక్స్
విశాల్ హీరోగా సైబర్ క్రైమ్ నేపథ్యంలో యాక్షన్ ఎంటర్ టైనర్‌గా తెరకెక్కుతున్న సినిమా 'చక్ర'. బ్యాంక్ రాబరీ, సైబర్ క్రైమ్ నేపథ్యంలో ఫుల్ టెక్నికల్ విలువలతో కొత్త కథ-కథనాలతో ఈ చిత్రం రూపొందించినట్టు తెలుస్తుంది. ఇక ఈ సినిమాలో కూడా మరోసారి విశాల్ పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటిస్తున్నాడు. ఈ సినిమా కూడా ఎప్పుడో అన్ని పనులు ముగించుకొని రిలీజ్ కు రెడీ గా ఉంది. ఇప్పటికే ట్రయిలర్ ను కూడా రిలీజ్ చేశారు.
'రిపబ్లిక్' రిలీజ్ డేట్ ఫిక్స్
మెగా కాంపౌండ్ నుండి ఈ ఏడాది చాలా సినిమాలు రిలీజ్ కు సిద్ధంగా ఉన్నాయి. మెగా స్టార్ ఆచార్య, పవన్ కళ్యాణ్ 'వకీల్ సాబ్', రామ చరణ్ ఆర్ఆర్ఆర్, వరుణ్ తేజ్ గని, అల్లు అర్జున్ పుష్ప, వైష్ణవ్ తేజ్ ఉప్పెన ఇలా ప్రతి ఒక్కరూ ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమయ్యారు. ఇక సాయి తేజ్ కొత్త సినిమా కూడా ఆ లిస్ట్ లో చేరిపోయింది. ఇప్పటికే లాక్ డౌన్ తీసిన తర్వాత థియేటర్ లో తన మొదటి సోలో బ్రతుకే సో బెటర్ సినిమానే వేసాడు. ఇక ఆ సినిమా కూడా మంచి టాక్ ను, కలెక్షన్స్ ను సొంతం చేసుకొని తర్వాత థియేటర్ లో సినిమా రిలీజ్ చేయాలనుకున్న వారికి మంచి బూస్ట్ ఇచ్చింది.
'నరుడి బ్రతుకు నటన' షూటింగ్ ప్రారంభం
సిద్ధు జొన్నలగడ్డ, శ్రద్ధ శ్రీనాధ్ కాంబినేషన్ లో కృష్ణ అండ్ హిజ్ లీల సినిమా వచ్చిన సంగతి తెలిసిందే కదా. లాక్ డౌన్ లోనే ఈ సినిమా కూడా ఓటీటీ లో రిలీజ్ అయి మంచి టాక్ ను సొంతం చేసుకుంది. ఇక ఇప్పుడు 'కృష్ణ అండ్ హిజ్ లీల' డైరెక్షన్ డిపార్ట్మెంట్ లో పనిచేసిన విమల్ కృష్ణ దర్శకునిగా పరిచయం సిద్దు, నేహాశెట్టి హీరో హీరోయిన్స్ గా మరొక సినిమా రూపొందుతుంది. 'నరుడి బ్రతుకు నటన' అనే టైటిల్ తో ఈ సినిమా తెరకెక్కుతుంది.
'ఖిలాడి' లో మలయాళ హీరో
రమేష్‌వర్మ దర్శకత్వంలో రవితేజ హీరోగా ఖిలాడి సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమా మొదటి షెడ్యూల్ ను పూర్తి చేయగా.. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ ను జరుపుకుంటుంది. రవితేజ పుట్టినరోజు సందర్భంగా జనవరి 26న విడుదల చేసిన వీడియో గ్లిమ్స్‌కు సూపర్ రెస్పాన్స్ కూడా వచ్చింది. రీసెంట్ గానే ఈ సినిమా రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేశారు. మే 28న ఈ సినిమాను రిలీజ్ చేయనున్నట్టు ప్రకటించారు.
'ఆచార్య' లా మారిన వార్నర్
ఆస్ట్రేలియా స్టార్ క్రికెటర్ డేవిడ్ వార్నర్ గత కొద్దికాలంగా సోషల్ మీడియా లో చేస్తున్న హంగామా అందరికీ తెలిసిందే. తెలుగు సినిమా పాటలు, డైలాగ్స్ చెప్తూ వీడియోలు పోస్ట్ చేస్తూ అందర్ని సౌత్ ప్రజలను ఆకట్టుకుంటున్నాడు. మహర్షి లా మారాడు, బంటు పాత్రలో దూరాడు, ప్రభాస్ బాహుబలి అయ్యాడు.. ఎన్టీఆర్ లా మారాడు.. ఇక ఇప్పుడు ఏకంగా ఆచార్య లా మారాడు. ఇటీవలే చిరు నటిస్తున్న ఆచార్య సినిమా టీజర్ ను రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే కదా. ఈ నేపథ్యంలో ఫేస్ యాప్ ద్వారా టీజర్ లోని చిరు ప్లేస్ లో తన పేస్ పెట్టి వీడియో చేసి పోస్ట్ చేశాడు ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

బాలయ్య - బోయపాటి సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్
'సింహా', 'లెజెండ్' సినిమాల తర్వాత బోయపాటి దర్శకత్వంలో బాలకృష్ణ మూడో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. టైటిల్ ఇంకా కన్ఫామ్ చేయని ఈ సినిమా షూటింగ్ ఎప్పుడో మొదలైంది కానీ లాక్ డౌన్ వల్ల.. షూట్ కు బ్రేక్ చెప్పాల్సి వచ్చింది. ఈమధ్యనే మళ్లీ షూటింగ్ మొదలు పెట్టగా షూటింగ్ కూడా చివరి దశకు వచ్చేసింది. ఈ నెల రెండో వారంనుండి చివరి షెడ్యూల్ ప్రారంభించనున్నటు తెలుస్తుంది. ఇప్పటికే ఈ సినిమా నుండి టీజర్ ను రిలీజ్ చేయగా దానికి సూపర్ రెస్పాన్స్ రాగా.. ఆ తర్వాత ఈ సినిమాకు సంబంధించిన అప్ డేట్స్ పెద్దగా ఇవ్వలేదు బోయపాటి.
'చావు కబురు చల్లగా' రిలీజ్ డేట్ ఫిక్స్
ఆర్ ఎక్స్ 100 సినిమాతో తన నటనతో మంచి గుర్తింపు తెచ్చుకున్న యంగ్ హీరో కార్తికేయ. ఆ తర్వాత సినిమాల్లో నటించిన ఆశించినంత విజయం అందించలేకపోయాయి. ఈ మధ్య గ్యాంగ్ లీడర్ సినిమాతో విలన్ గా కూడా తన టాలెంట్ ను చూపించాడు. ఈ పాత్రకు కూడా మంచి పేరొచ్చింది. ప్రస్తుతం కార్తికేయ కౌశిక్ పెగళ్ళపాటి దర్శకత్వంలో 'చావు కబురు చల్లగా' సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఈసినిమాలో బస్తీ బాలరాజుగా ఒక పవర్ ఫుల్ మాస్ క్యారెక్టర్ లో కార్తికేయ నటిస్తున్నాడు. ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించి విడుదలైన హీరో, హీరోయిన్‌ల లుక్స్, 'బస్తీ బాలరాజు' క్యారెక్టర్ వీడియోకు మంచి రెస్పాన్స్ వచ్చింది.

'వకీల్ సాబ్' రిలీజ్ డేట్ ఫిక్స్
వేణు శ్రీరామ్ దర్శకత్వంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో హిందీ సూపర్ హిట్ మూవీ పింక్ రీమేక్ ను తెలుగులో 'వకీల్ సాబ్' గా చేస్తున్నసంగతి తెలిసిందే కదా. చాలా గ్యాప్ తర్వాత పవన్ నటిస్తున్న సినిమా కావడంతో ఆయన అభిమానులు ‘వకీల్ సాబ్’ రాక కోసం ఎదురుచూస్తున్నారు. ఇక ఇటీవలే వకీల్ సాబ్ చిత్రయూనిట్ కూడా షూటింగ్ ను పూర్తిచేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది. ఇక సంక్రాంతి పండుగ సందర్భంగా ఈ సినిమా టీజర్ ను రిలీజ్ చేయగా టీజర్ ఎన్ని రికార్డ్స్ క్రియేట్ చేసిందో తెలుసు.

'ఖిలాడి' రిలీజ్ డేట్ ఫిక్స్
'క్రాక్' వంటి బ్లాక్‌బస్టర్ తర్వాత మాస్ మహారాజా రవితేజ హీరోగా, 'రాక్షసుడు' వంటి బ్లాక్‌బస్టర్‌ని తెరకెక్కించిన రమేష్ వర్మ దర్శకత్వంలో రూపొందుతోన్న సినిమా ఖిలాడి. ఈ సినిమాలో రవితేజ రెండు విభిన్న పాత్రల్లో నటిస్తున్నట్టు తెలుస్తుంది. ఇప్పటికే ఈ సినిమా మొదటి షెడ్యూల్ ను పూర్తి చేయగా.. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ ను జరుపుకుంటుంది. ఇక ఇప్పటికే ఈ సినిమా నుండి ఫస్ట్ లుక్, ఫస్ట్ గ్లింప్స్ ను కూడా రిలీజ్ చేయగా మరోసారి హుషారైన పాత్రలో రవితేజ నటిస్తున్నట్టు కనిపిస్తుంది. దానికి తోడు రవితేజ పుట్టినరోజు సందర్భంగా జనవరి 26న విడుదల చేసిన వీడియో గ్లిమ్స్‌కు సూపర్ రెస్పాన్స్ కూడా వచ్చింది.
'సలార్' షూటింగ్ ప్రారంభం
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, కేజీఎఫ్ ఫేం ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో 'సలార్' సినిమా తెరకెక్కబోతున్న సంగతి తెలిసిందే కదా. ఈ సినిమాను ఇటీవలే గ్రాండ్ గా పూజా కార్యక్రమాలతో ప్రారంభించారు. ఇక ఈ సినిమా రెగ్యులర్ షూట్ కూడా ఈ రోజు నుండి మొదలైంది. ఇప్పటికే మొదటి షెడ్యూల్ తెలంగాణా లోని గోదావరి ఖని లో ఉన్న సింగరేణి గనుల్లో తెరకెక్కించనున్నట్టు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే కదా. వార్తల ప్రకారమే షూటింగ్ శుక్రవారం గోదావరిఖనిలో మొదలైంది. ఇందు కోసం గోదావరిఖని సమీపంలోని రామగుండం చేరుకుంది చిత్ర బృందం. అంతేకాదు హీరో ప్రభాస్ అక్కడి పోలీస్ అధికారిని కలిశారు. ఇప్పుడు ఆ ఫొటోలు సోషల్ మీడియాలో సందడి…
శృతి హాసన్ బెస్ట్ జోడి..?
కమల్ హాసన్ వారసురాలిగా ఎంట్రీ ఇచ్చిన శృతి హాసన్ తండ్రికి తగ్గ తనయగా పేరును సంపాదించుకుంది. అనగనగా ఓ ధీరుడు అనే సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన శృతిహాసన్ ఆ తరువాత తక్కువ కాలంలోనే తెలుగులో టాప్ హీరోయిన్ గా ఎదిగింది. మొదట వరుస ప్లాప్స్ తో కాస్త ఇబ్బంది పడ్డ శృతి ఆ తర్వాత చాలా మంది హీరోలకు లక్కీ హీరోయిన్ గా మారింది. పవన్ కల్యాణ్ సరసన గబ్బర్ సింగ్ లో నటించి బ్లాక్ బస్టర్ ను అందుకుంది. ఆ తరువాత వీరిద్దరి కాంబోలో కాటమరాయుడు రాగా.. ఇప్పుడు వకీల్ సాబ్‌లోనూ పవన్ సరసన శ్రుతీ నటిస్తోంది. వరుస ప్లాప్స్ లో ఉన్న రవితేజకు బలుపుతో మంచి హిట్ కొట్టింది. అల్లు అర్జున్ తో రేసుగుర్రం…
'మహా సముద్రం' రిలీజ్ డేట్ ఫిక్స్
అజయ్ భూపతి దర్శకత్వంలో మహాసముద్రం అనే సినిమా తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే.వైజాగ్ నేపథ్యంలో నడిచే క్రైమ్ థ్రిల్లర్ గా ఈ మహాసముద్రం చిత్రం తెరకెక్కనుంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ జరుపుకుంటుంది. ఇక తాజాగా ఈ సినిమా రిలీజ్ డేట్ ను కూడా ఫిక్స్ చేశారు. ప్రపంచ వ్యాప్తంగా 'మహా సముద్రం' సినిమాను ఆగస్ట్ 19న విడుదల చేయనున్నట్లు అధికారికంగా వెల్లడించారు. ఈ సందర్భంగా ఓ పోస్టర్ ని కూడా రిలీజ్ చేయగా.. ఇందులో శర్వానంద్ - సిద్దార్థ్ ఇద్దరూ ఓ పడవ పై కూర్చొని సిగరెట్ తాగుతూ కనిపిస్తున్నారు.
'చెక్' ట్రైలర్ రిలీజ్ డేట్ ఫిక్స్
గత ఏడాది భీష్మ సినిమాతో మంచి హిట్ ను సొంతం చేసుకున్న నితిన్ ప్రస్తుతం మూడు సినిమాలతో బిజీ గా వున్నాడు. ఇక ఈ ఏడాది రెండు సినిమాలతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ఒకటి రంగ్ దే కాగా.. మరొకటి చెక్. ఈ రెండు సినిమాల షూటింగ్‌లు ఇప్పటికే పూర్తయ్యాయి. నితిన్ హీరోగా చంద్రశేఖర్ యేలేటి దర్శకత్వంలో వస్తున్న సినిమా 'చెక్'. ఇక ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది ఈ సినిమా. ఇప్పటికే ఈ సినిమా టీజర్ ను రిలీజ్ చేయగా దానికి సూపర్ రెస్పాన్స్ వచ్చింది. అంతేకాదు ఇటీవలే ఈ సినిమా రిలీజ్ డేట్ ను కూడా ఫిక్స్ చేశారు. ఫిబ్రవరి 19న ఈ సినిమాను రిలీజ్ చేస్తున్నట్టు ఇప్పటికే అధికారికంగా ప్రకటించారు చిత్రయూనిట్…