బాలయ్య – బోయపాటి సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్

Director Boyapati Srinu and Balakrishna New Movie BB3 Release Date Announced,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood News,Balakrishna,Hero Balakrishna,Actor Balakrishna,Boyapati Srinu,Director Boyapati Srinu,Nandamuri Balakrishna,BB3 Movie,BB3Film,BB3,BB3 Roar On May 28th,NBK 106,Balayya Boyapati 3,BB3 Roar In Theatres From May 28th,Balakrishna Boyapati Srinu 3 Movie Release Date,Balayya Boyapati 3 Release Date Out,Balayya Boyapati 3 Release Date Fix,BB3 Release Date Announced,BB3 Release Date Confirmed,#NBK106,#BB3

‘సింహా’, ‘లెజెండ్’ సినిమాల తర్వాత బోయపాటి దర్శకత్వంలో బాలకృష్ణ మూడో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. టైటిల్ ఇంకా కన్ఫామ్ చేయని ఈ సినిమా షూటింగ్ ఎప్పుడో మొదలైంది కానీ లాక్ డౌన్ వల్ల.. షూట్ కు బ్రేక్ చెప్పాల్సి వచ్చింది. ఈమధ్యనే మళ్లీ షూటింగ్ మొదలు పెట్టగా షూటింగ్ కూడా చివరి దశకు వచ్చేసింది. ఈ నెల రెండో వారంనుండి చివరి షెడ్యూల్‌ ప్రారంభించనున్నటు తెలుస్తుంది. ఇప్పటికే ఈ సినిమా నుండి టీజర్ ను రిలీజ్ చేయగా దానికి సూపర్ రెస్పాన్స్ రాగా.. ఆ తర్వాత ఈ సినిమాకు సంబంధించిన అప్ డేట్స్ పెద్దగా ఇవ్వలేదు బోయపాటి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక తాజాగా సినిమా రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేస్తూ అప్ డేట్ ఇచ్చారు. చిత్రాన్ని మే 28న ప్రపంచ‌వ్యాప్తంగా విడుద‌ల‌ చేస్తున్నట్టు అధికారికంగా ప్రక‌టిస్తూ ఒక పోస్టర్ కూడా రిలీజ్ చేశారు. ఈ పోస్టర్‌లో బాలయ్య స్టైలిష్‌ లుక్‌లో ఆకట్టుకుంటున్నారు. కాగా మే 28 విశ్వవిఖ్యాత న‌ట‌సార్వభౌమ, న‌ట‌ర‌త్న నందమూరి తారక రామారావు జ‌యంతి.

ఇక ఈ సినిమాలో ప్రగ్యా జైస్వాల్‌ హీరోయిన్ గా నటిస్తుంది. మిర్యాల స‌త్యనారాయ‌ణ రెడ్డి స‌మ‌ర్పణ‌లో ద్వారకా క్రియేషన్స్ ప‌తాకంపై మిర్యాల రవీందర్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఎస్.ఎస్ థమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాకు సి.రాంప్రసాద్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. ఈ సినిమాలో బాలకృష్ణ రెండు విభిన్నమైన షేడ్స్ లో కనిపించనున్నాడట. వాటిలో రాయలసీమ నేపథ్యంలో ఒక పాత్ర .. వారణాసి నేపథ్యంలో మరో పాత్ర ఉన్నట్టు తెలుస్తుంది.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

12 − nine =